Revolver Rita OTT : కీర్తి సురేష్ లేడీ డాన్ 'రివాల్వర్ రీటా' - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
Revolver Rita OTT Platform : కీర్తి సురేష్ లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'రివాల్వర్ రీటా' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి.

Keerthy Suresh's Revolver Rita OTT Platform Locked : మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'రివాల్వర్ రీటా'. వివిధ కారణాలతో వాయిదా పడిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై లేడీ ఓరియెంటెడ్ మూవీలో డాన్ పాత్రలో కీర్తి సురేష్ కనిపించగా హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ కూడా ఫిక్స్ అయ్యింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి 6 వారాల మధ్యలో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, శాటిలైట్ రైట్స్ 'విజయ్ టీవీ' సొంతం చేసుకోగా... థియేట్రికల్ రన్ తర్వాత ప్రీమియం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ మూవీకి జేకే చంద్రు దర్శకత్వం వహించగా... కీర్తి సురేష్‌తో పాటు రెడిన్ కింగ్స్‌లీ, రాధిక, అజయ్ ఘోష్, జాన్ విజయ్, సూపర్ సుబ్బరాయన్, సెండ్రయాన్ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్ బ్యానర్స్‌పై సుదన్ సుందరం, జగదీష్ పళని స్వామి సంయుక్తంగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో హాస్య మూవీస్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా రిలీజ్ చేశారు.
Also Read : యుద్ధానికి 'వానర' సైన్యం సిద్ధం - వార్ ఎవరి కోసం?... సరికొత్తగా మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్






















