Viral: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?
హిందూ ఆచారంలో మంగళసూత్రాన్ని చాలా పవిత్రమైనదిగా చూస్తారు. ఇప్పుడు దానిపై రూపొందిన ఓ ప్రకటన వివాదాస్పదంగా మారింది.
బంగారు తీగల మధ్యలో నల్లటిపూసలు చేర్చిన మంగళసూత్రం పెళ్లయిన మహిళలకు ప్రధాన ఆభరణం. ప్రముఖ్య ఫ్యాషన్ డిజైనర్ సభ్యసాచి ‘ఇంటిమేట్ ఫైన్ జ్యూయలరీ’ పేరుతో నల్లపూసల మంగళసూత్రాన్ని తయారుచేశారు. మంగళసూత్రాలు చూడటానికి సింపుల్, అందంగా ఉన్నప్పటికీ వాటి ప్రచారం కోసం తయారుచేసిన ప్రకటన మాత్రం విమర్శలపాలైంది. మంగళసూత్రాన్నే అవమానించేలా ఉందంటూ నెటిజన్లు సభ్యసాచిని తిడుతూ విరుచుకుపడుతున్నారు. సభ్యసాచికి మంగళసూత్రాలు ఎందుకో, ఎలా ఉంటాయో కూడా తెలియవా? అంటూ పోస్టులు పెడుతున్నారు.
యాడ్‌లో అసలేముంది?
సింపుల్ గా ఉన్న నల్లటి మంగళసూత్రాలు వేసుకున్న ఓ మహిళ తన భర్త గుండెలపై వాలినట్టు ఉంది. కాకపోతే ఆమె వేసుకున్న డ్రెస్ అభ్యంతరకరంగా కనిపిస్తోంది. కేవలం ఆమె బ్రాతోనే ఉన్నట్టు చూపించారు. మరో ఫోటోలో ఇద్దరు మగవాళ్లు మంగళసూత్రాలు ధరించి కనిపించారు. వారిద్దరినీ హోమోసెక్సువల్ కపుల్స్ గా చూపించారు. ఆ ప్రకటనలు చూస్తుంటే అవి మంగాళసూత్రం యాడ్ లా లేదని, లోదుస్తుల యాడ్ లా ఉందంటూ విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ట్విట్టర్లో ఈ యాడ్ విపరీతంగా ట్రోల్ అవుతోంది. ‘అయ్యో నేను ఇది లోదుస్తుల ప్రకటన అనుకున్నాను... కాదు కాదు, ఇది మంగళసూత్రాల ప్రకటనా... నేను గుర్తించలేకపోయానే’ అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు. సభ్యసాచికి మంగళసూత్రాలు ఎలా ఉంటాయో తెలియదనుకుంటా అంటూ పద్దతిగా చీరకట్టుకుని, మెడలో మంగళసూత్రాలు వేసుకున్న మహిళ ఫోటోను పోస్టు చేసి ‘ఇలా ఉంటారు’ అంటూ ట్వీట్ చేస్తున్నారు. దీనిపై సభ్యసాచి ఇంతవరకు స్పందించలేదు. ‘రాయల్ బెంగాల్ మంగళసూత్ర 1.2’, ‘బెంగాల్ టైగర్ ఐకాన్’ వెర్షన్ల పేరుతో వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. బ్లాక్ ఎనామిల్ వేసిన 18కె బంగారంతో చేసిన నెక్లెస్ లు, చెవిపోగులు, ఉంగరాలు తయారుచేసి అమ్ముతున్నారు.
[tw]
No other way to show 'Mangalsutra' ?
— Bhagyashri Patwardhan (@bvpat2501) October 27, 2021
What are u actually selling #Sabyasachi ?
Matlab kuch bhi!!!!!#jewellery @ShefVaidya pic.twitter.com/iFwXgh40lW
Hey #Sabyasachi you selling mangalsutra or obscenity.Shameful.#sabyasachijewelry pic.twitter.com/XIWX5Pas43
— Vandana Gupta 🇮🇳 (@im_vandy) October 27, 2021
Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?
Also read: అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు