By: ABP Desam | Updated at : 28 Oct 2021 08:27 AM (IST)
(Image credit: Pexels)
మన మెదడు శరీరపు క్రియలను నియంత్రించేది. అందుకే మెదడుకు కొన్ని గంటల పాటూ విశ్రాంతి అవసరం. మనం నిద్రపోయినప్పుడే మెదడుకు కాస్త విశ్రాంతి లభించేది. కానీ ఈకాలంలో ఎక్కువ గంటలు పనిచేస్తూ తక్కువ నిద్రపోయేవారి సంఖ్య పెరిగిపోయింది. కనీసం ఆరుగంటలు కూడా నిద్రపోనివారి సంఖ్య పెరిగిపోతోంది. ఆరు గంటల కన్నా తక్కువ నిద్రపోతే ఏమవుతుందో హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వివరిస్తున్నారు. కొన్ని రోజులు అయిదు గంటలే నిద్రపోతారు చాలా మంది. గంటే కదా తగ్గించాం అనుకుంటారు కానీ ఆ గంటే మెదడుపై చాలా ప్రభావం చూపిస్తుంది.
1. ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు త్వరగా రోగాల బారిన పడతారు. నిద్రకు రోగనిరోధక వ్యవస్థకు మధ్య పరస్పర సంబంధం ఉంది. నిద్ర సరిపోకపోతే ఆ వ్యవస్థ కూడా సరిగా పనిచేయదు.
2. ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోయేవారిలో, అలాగే తొమ్మిది గంటల కన్నా ఎక్కువ నిద్రపోయేవారిలో అనారోగ్య లక్షణాలు త్వరగా కలుగుతాయి. ముఖ్యంగా వారి గుండెపై ప్రభావం పడుతుంది. స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
3. తక్కువ నిద్ర అలవాటైన వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
4. తక్కువ గంటలు నిద్రపోయేవారిలో విశ్లేషణాత్మకంగా ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. చురుకుదనం, నిర్ణయం తీసుకునే శక్తి కూడా తగ్గిపోతాయి.
5. ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోవడం కొన్నినెలలుగా సాగితే వారిలో మతి మరుపు లక్షణాలు పెరుగుతాయి. నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
6. నిద్ర తక్కువైతే బరువు పెరిగే ఛాన్స్ కూడా పెరుగుతుంది. 20 ఏళ్లు కన్నా ఎక్కువ వయసు ఉన్న 21,469 మందిపై అధ్యయనం చేశారు. అందులో తక్కువ నిద్రకు, బరువుకు మధ్య సంబంధాన్ని ఆ అధ్యయనం తేల్చింది.
7. డయాబెటిస్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువ నిద్ర వల్ల పెరుగుతాయి. పది వేర్వేరు అధ్యయనాలలో ఈ విషయం రూఢీ అయింది.
2018లో నిద్రపై ఒక అధ్యయనం సాగింది. అందులో ఆరుగంటల నిద్ర కూడా సరిపోదని తేలింది. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతేనే మెదడు బాగా పనిచేస్తుందని, శరీరం పనిచేసే సామర్థ్యం పటిష్టంగా ఉంటుందని తేలింది. ఈ అధ్యయనాన్ని దాదాపు పదివేల మందిపై చేశారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: రోజూ తాగుతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ
Also read: ఒత్తయిన జుట్టు కావాలా... ఈ మూడూ తినండి చాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Breakfast Recipes: మీరు చాలా బిజీయా? అయితే పది నిమిషాల్లో తయారయ్యే దోశెల రెసిపీలు ఇవిగో
Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
Life Expectancy: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Cucumber: తొక్కే కదా అని తక్కువగా చూడొద్దు, కీర దోస తొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జీవ గడియారం అంటే ఏమిటీ? సమయానికి నిద్రాహారాలు లేకపోతే అంత ప్రమాదమా?
లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!
Weather Latest Update: 13న మరో అల్పపీడనం, ఇంకో వారం వర్షాలే! భారీ గాలులతో ఈ ప్రాంతాలవారికి అలర్ట్: IMD
Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు
ఉచిత పథకాలపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ- మోదీ, కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం