అన్వేషించండి

Weight Loss: ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఖాతాలు తొలగించాక... ఏకంగా 31 కిలోలు తగ్గిందట ఈ అమ్మడు

ఇది సోషల్ మీడియా కాలం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దాదాపు సోషల్ మీడియా ఖాతాల్లోనే గడిపే వాళ్లు అధికం.

సోషల్ లైఫ్ అంటే అర్థం మారిపోయింది. సోషల్ మీడియా ఖాతాల్లో బతకడమే సోషల్ లైఫ్. అంతకుముందు అందరూ కలిసి, ఒకచోట చేరి సంతోషంగా బతకడాన్ని సోషల్ లైఫ్ గా భావించేవాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టడం, చాట్ చేయడమే సామాజిక జీవితమైపోయింది. ఇలా చాలా మంది సోషల్ మీడియాలోనే గంటలుగంటలు గడిపేస్తున్నారు. అలా తెలియకుండానే ఎన్నో ఆరోగ్యసమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ అమ్మాయి తన సోషల్ మీడియా ఖాతాలను తొలగించి, కెలోరీలు తగ్గించుకుని నాజుకుగా మారింది.  ఖాతాలను తొలగించాక ఏకంగా 31 కిలోలు బరువు తగ్గానని చెబుతోంది. ఆమె పేరు బ్రెండా, నివసించేది లండన్లో. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు తొలగిస్తే, బరువు ఎలా తగ్గుతారు అన్న అనుమానం వచ్చిందా? అయితే చదవండి... 

బ్రెండా లావుగా ఉండేది. ఎన్ని  డైట్లు పాటించినా బరువు తగ్గలేదు. వైద్యులను కూడా కలిసింది అయినా ఫలితం లేదు. ఎన్ని టెక్నిక్స్ పాటించినా బరువు మాత్రం తగ్గలేకపోయింది. ఓసారి మొబైల్ నుంచి ఫేస్ బుక్, ఇన్ స్టా రెండు యాప్ లను తొలగించింది. తన ఖాతాలను ఇనాక్టివ్ చేసింది. పూర్తిగా వాటి సంగతే మర్చిపోయింది. ఇలా ఏడాది వాటికి దూరంగా ఉంది. ఆ ఏడాదిలో ఆమె 31 కిలోలు తగ్గింది. ఎలాగో తెలుసా? సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని పూర్తిగా ఫిట్నెస్ పై ఖర్చుపెట్టింది. జిమ్ లో వ్యాయామాలు చేయడం, నడక వంటివి పాటించేది. దీంతో ఊహించని విధంగా బరువు తగ్గి సన్నని మెరుపుతీగలా మారింది. అందుకే తన కథను అందరితో పంచుకుంది. 

ఆ పోస్టులు చూస్తే మరీను...

బ్రెండా చెప్పిన ప్రకారం 2016 నుంచి 2019 మధ్య ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం వల్ల భారీగా బరువు పెరిగింది. గతేడాది లాక్ డౌన్ లో మరిన్ని కిలోలు పెరిగింది. దానికి సోషల్ మీడియానే కారణమని అర్థం చేసుకుంది బ్రెండా. ఇన్ స్టా, ఫేస్ బుక్ చూసుకుంటూ తాను నాలుగైదు గంటలు కూర్చునే ఉండిపోయేదట. అంతేకాదు ఆరోగ్యానికి, అందానికి సంబంధించిన పోస్టులు చూసినప్పుడల్లా చాలా డిప్రెస్ గా ఫీలయ్యేదట.అందుకే ఆ ఖాతాలు లేకపోతే మంచిదని భావించింది. అలా తొలగించిన కొన్ని నెలలకే దుస్తులు వదులైనట్టు అనిపించాయి బ్రెండాకి. కేవలం ఏడాదిలోనే బరువులో మూడో వంతు తగ్గినట్టు గుర్తించింది. తన సమయాన్ని వృథా చేయకుండా జాగింగ్ కు వెళ్ళడం, ఆరోగ్యకరమైన వంటలు వండుకోవడం వంటి పనులతో గడుపుతోంది. ఇంతకుముందు కన్నా జీవితం చాలా ఆనందంగా ఉందని చెబుతోంది బ్రెండా. ఇదంతా సోషల్ మీడియా ఖాతాలు తొలగించడం వల్లే అంటోంది. 

Also read: ఒత్తయిన జుట్టు కావాలా... ఈ మూడూ తినండి చాలు

Also read: రోజూ తాగుతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ

Also read: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి

Also read:  డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
HIV and Pregnancy : HIV ఉన్నా తల్లి కావచ్చు.. బిడ్డకు వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి ప్రాసెస్ ఇదే
HIV ఉన్నా తల్లి కావచ్చు.. బిడ్డకు వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి ప్రాసెస్ ఇదే
Aloe Vera Benefits : చర్మం, జుట్టు సంరక్షణకు కలబంద.. ఇంట్లోనే ఈ DIY చిట్కాలు ఫాలో అవుతూ ఉపయోగించండి
చర్మం, జుట్టు సంరక్షణకు కలబంద.. ఇంట్లోనే ఈ DIY చిట్కాలు ఫాలో అవుతూ ఉపయోగించండి
HIV Emergency Treatment : హెచ్ఐవీ వస్తుందని డౌట్ ఉందా? 72 గంటల్లో ఈ చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చా? PEP అంటే ఏమిటి?
హెచ్ఐవీ వస్తుందని డౌట్ ఉందా? 72 గంటల్లో ఈ చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చా? PEP అంటే ఏమిటి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget