![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anger Management: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి
కోవిడ్ ఓసారి ఎటాక్ చేశాక ఆ రోగుల్లో చాలా మానసిక, శారీరక సమస్యలు పెరుగుతున్నాయి.
![Anger Management: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి Feeling angry post Covid? Tips to improve your brain health Anger Management: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/26/634cd92c9175f99c8df54f094f8b94b1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నెలల తరబడి లాక్ డౌన్ ప్రక్రియ, ఇంటికే పరిమితమైన జీవితం, కరోనా వస్తుందనే భయం, వచ్చాక తగ్గుతుందో లేదో అన్న సందేహం, తగ్గాక సైడ్ ఎఫెక్టులు ఏమొస్తాయేమోనన్న అనుమానం... ఇలాంటి మానసిక స్థితిలో మనసు, మెదడు రెండూ గతి తప్పుతున్నాయి. విపరీత భావోద్వేగాలకు లోను చేస్తున్నాయి. దీనివల్ల అకారణంగా కోపాలు రావడం, అసహాయత, ఓపిక లేకపోవడం.. ఇలా చాలా మార్పులు మనుషుల్లో కనిపిస్తున్నాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా కోపం మాత్రమే చాలా మందిలో పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మీకు కూడా అకారణంగా, చిన్నచిన్న విషయాలకే కోపం వస్తోందా? అయితే ఇలా చేయండి... కాస్త కోపం కంట్రోల్ కావచ్చు.
1. కోపం వచ్చినప్పుడు ముందుగా నిశ్శబ్ధంగా ఉండిపోండి. మీ శ్వాసపైనే దృష్టి పెట్టండి. దీర్ఘంగా శ్వాసతీసుకుని వదలండి. కొద్దిసేపు ఇటూ అటూ నడవండి. నడక వల్ల కండరాలు కాస్త రిలాక్స్ మూడ్ లోకి వెళతాయి.
2. మీకు మీరే ‘రిలాక్స్’ అంటూ చెప్పుకోండి. లేదా త్రీ ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్ లా ‘ఆల్ ఈజ్ వెల్’ అంటూ పదే పదే చెప్పుకోండి. ఈ చిట్కాలు మీకు చిన్నగా కనిపిస్తున్నా ఎఫెక్టివ్ గానే పనిచేస్తాయి.
3. ఒత్తిడి ఎక్కువైతే కోపం ఇంకా పెరిగిపోతుంది. మీ ఒత్తిడి బయటికి పోతే కోపం దానంతట అదే తగ్గిపోతుంది. ఎవరికైనా మీ ప్రాణస్నేహితులకు ఫోన్ చేసి మీ బాధనంతా చెప్పేసుకోండి. కోపం, ఒత్తిడి ఉఫ్ మని ఊదినట్టు బయటికిపోతాయి.
4. కోపం వచ్చినప్పుడు ఎవరితోనూ డిస్కషన్ కంటిన్యూ చేయకండి. గదిలోకి వచ్చి ఒంటరిగా కూర్చోండి. చేతులు, కాళ్లు స్ట్రెచింగ్ చేయండి. కోపం కారణంగా బిగుసుకున్న కండరాలు ఫ్రీగా అవుతాయి.
5. మీకు నచ్చిన పాటలు పెట్టుకుని వినండి. లేదా యూట్యూబ్ లో కామెడీ స్కిట్ లు చాలానే ఉన్నాయి. అవి పెట్టుకుని చూడండి. బాగా నవ్వొచ్చే స్కిట్ చూస్తే... ఆ నవ్వుతో పాటూ కోపం కూడా బయటికి పోతుంది.
6. ముఖ్యంగా మనసులో ఏమీ పెట్టుకోవద్దు. బాధైన, ఆనందమైనా బయటికి చెప్పేయండి. లేకుంటే భారం ఎక్కువై అది అసహనంగా, కోపంగా మారే ఛాన్సు ఉంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?
Also read: ఆ సమస్యా ఉన్నా ఇలా చేస్తే పిల్లలు పుట్టే ఛాన్స్
Also read: డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)