News
News
X

Cooking Oil: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

మార్కెట్లో చాలా నూనెలు లభిస్తున్నాయి. వాటిలో ఏ నూనె వంటల్లో వాడితే మంచిదనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

FOLLOW US: 

సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశెనగ నూనె, కొబ్బరి, నువ్వుల నూనె, కనోలా, ఆలివ్ ఆయిల్, ఆవ నూనె ... ఇలా ఎన్నో రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతుంటే, మరికొందరు వేరుశెనగ నూనె వాడతారు. నువ్వుల నూనె వాడేవాళ్లు, ఆలివ్ ఆయిల్ వాడేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. వీటన్నింటిలో ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో, ఆరోగ్యనిపుణులు ఏంచెబుతున్నారో తెలుసుకుందాం. 

కొబ్బరి నూనె విషంతో సమానం
హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన ఓ పరిశోధనలో కొబ్బరి నూనెను ఎక్కువగా తినకపోవడమే మంచిదని తేలింది. దాన్ని నేరుగా విషంతో సమానమని తేల్చింది. కానీ కేరళలో అధికంగా కొబ్బరినూనెనే వాడతారు. కొబ్బరి నూనె శరీరంలో ఎల్డీఎల్ స్థాయిలను పెంచుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్. కాబట్టి శరీరంలో పేరుకుపోతే రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి కొబ్బరి నూనెను వంటల్లో ఉపయోగించవద్దని హార్వర్డ్ పరిశోధకులు నేరుగా చెప్పారు. 

ఆలివ్ ఆయిల్‌తో మేలు
నూనెలన్నింటిలో ఆరోగ్యకరమైనదిగా పేరు తెచ్చుకుంది ఆలివ్ ఆయిల్. దీన్ని వాడడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం అయిదు శాతం నుంచి ఏడు శాతం వరకు తగ్గుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ వారు 24 ఏళ్ల పాటూ లక్ష మందిపై పరిశోధన చేశారు. ఆ లక్ష మంది కేవలం ఆలివ్ ఆయిల్ వండిన వంటల్నే తినేలా జాగ్రత్త పాటించారు. వారందరిలో 15 శాతం వరకు గుండె జబ్బుల ప్రమాదం తగ్గినట్టు తేలింది. అన్నింటికన్నా ఆలివ్ ఆయిల్ మంచిదనే నిర్ధారణకు వచ్చారు పరిశోధకులు. ఈ నూనెలో మోనో సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్లు, ఖనిజాలు, పాలీ ఫెనాల్స్ ఈ నూనె ద్వారా లభిస్తాయి. ఈ నూనె వల్ల హానికారక కొవ్వు పదార్థాలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆలివ్ నూనెను ఆలివ్ పండ్ల గుజ్జుతో తయారుచేస్తారు. 

రైస్ బ్రాన్ ఆయిల్ మంచిదే
బియ్యం పొట్టు నుంచి తయారుచేసే ఆయిల్ రైస్ బ్రాన్ నూనె. ఇది కూడా మంచిదేనని కితాబిచ్చాయి ప్రపంచఆరోగ్య సంస్థ, అమెరికా హార్ట్ అసోసియేషన్. మనదేశంతో పాటూ జపాన్, చైనాలోనూ దీని విరివిగా వాడతారు. ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఆలివ్ కాకుండా మిగతా నూనెలతో పోలిస్తే రైస్ బ్రాన్ నూనె కూడా గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనె రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది. మధుమేహులు ఈ ఆయిల్ లో వండిన వంటలు తినడం మంచిది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ ను పెంచుతుంది. 

నువ్వుల నూనె
నువ్వుల నూనె వాడే వారి సంఖ్య చాలా తక్కువ. ముఖ్యంగా వయసుపైబడిన వారికి నువ్వుల నూనెతో చేసిన వంటకాలు ఆరోగ్యాన్నందిస్తాయి. బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ పోరాడే శక్తి కూడా ఇస్తుంది నువ్వుల నూనె. కాబట్టి ఇది వాడినా మంచిదే. 

సన్ ఫ్లవర్ ఆయిల్
పొద్దుతిరుగుడు గింజల నుంచి తయారుచేసే నూనె ఇది. సన్ ఫ్లవర్ గింజలు తింటే ఎంత ఆరోగ్యమో అందరికీ తెలిసిందే. అలాగే సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా మంచిదే. ఈ నూనెతో చేసిన వంటలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఒంట్లో చేరదు. మలబద్దకం సమస్య కూడా దరిచేరదు. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read:  ఆ సమస్యా ఉన్నా ఇలా చేస్తే పిల్లలు పుట్టే ఛాన్స్

Published at : 25 Oct 2021 12:12 PM (IST) Tags: Healthy life Cooking Oil Best Cooking Oils Olive Oil కుకింగ్ ఆయిల్

సంబంధిత కథనాలు

Women Fertility: స్త్రీలు ఏ వయసు వరకు బిడ్డను కనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు?

Women Fertility: స్త్రీలు ఏ వయసు వరకు బిడ్డను కనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు?

రాత్రి పూట ఈ మందులు వేసుకుంటే నిద్రకు దూరమవ్వడం ఖాయం

రాత్రి పూట ఈ మందులు వేసుకుంటే నిద్రకు దూరమవ్వడం ఖాయం

Skinny Jeans:స్టైలిష్‌గా కనిపించాలని స్కిన్నీ జీన్స్ వేసుకుంటున్నారా? వాటి వల్ల తీవ్ర సమస్యలు, తెలుసుకోకపోతే మీకే నష్టం

Skinny Jeans:స్టైలిష్‌గా కనిపించాలని స్కిన్నీ జీన్స్ వేసుకుంటున్నారా? వాటి వల్ల తీవ్ర సమస్యలు, తెలుసుకోకపోతే మీకే నష్టం

Fish Rice: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు

Fish Rice: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

టాప్ స్టోరీస్

KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్

KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్

Bigboss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6 కంటెస్టెంట్లు వీళ్లేనట, వాళ్లకు సెకండ్ ఛాన్స్?

Bigboss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6 కంటెస్టెంట్లు వీళ్లేనట, వాళ్లకు సెకండ్ ఛాన్స్?

YSR Nethanna Nestham: గుడ్‌న్యూస్! వీళ్ల అకౌంట్స్‌లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే

YSR Nethanna Nestham: గుడ్‌న్యూస్! వీళ్ల అకౌంట్స్‌లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే

Targeted Killing: కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోవటం తప్ప వేరే దారి లేదు - పండిట్‌ల ఆవేదన

Targeted Killing: కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోవటం తప్ప వేరే దారి లేదు - పండిట్‌ల ఆవేదన