By: ABP Desam | Published : 25 Oct 2021 12:47 PM (IST)|Updated : 25 Oct 2021 12:47 PM (IST)
(Image credit: Pexels)
ఆ కుర్రాడికి ఇరవైతొమ్మిదేళ్లు. పేరు ఐన్ క్రాస్. అంత వయసొచ్చినా ప్రేమించడానికి, పెళ్లాడడానికి ఓ పిల్ల దొరకలేదు. బయట వెతికి వెతికి అలిసిపోయినా ఐన్, చివరికి ఓ డేటింగ్ సైట్ ను ఆశ్రయించాడు. వారు చెప్పింది విని అడిగినంత డబ్బు ముట్టచెప్పాడు. కానీ చివరికి చూస్తే అక్కడ కూడా పిల్ల దొరకలేదు. సరికదా ఆ డేటింగ్ యాప్ వాళ్లు తనకు అబద్ధాలు చెప్పి మోసం చేసినట్టు గుర్తించాడు. దీంతో ఆ డేటింగ్ వెబ్ సైట్ పైనే కోర్టులో దావా వేశాడు. ఇదంతా జరిగింది అమెరికాలో.
అమెరికాలో ‘డెన్వర్ డేటింగ్ కో’ ఓ డేటింగ్ యాప్. ఐన్ ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడి తనకు ఓ మంచి అమ్మాయి కావాలని కోరాడు. ఆమెతో డేటింగ్ చేశాక, నచ్చితే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెప్పాడు. తనకు 25 నుంచి 35 ఏళ్లలోపు అమ్మాయి కావాలని చెప్పాడు. దానికి ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ తమ డేటింగ్ యాప్ లో వందల కొద్దీ అమ్మాయిలు ఉన్నారని, సభ్యుడిగా చేరితే, నచ్చిన వారిని ఎంచుకోవచ్చని చెప్పాడు. ఇంకేముంది ఐన్ కొండంత ఆశతో ఏడు లక్షల రూపాయలు కట్టాడు. తీరా చూసే ఆ వెబ్ సైట్ డేటాబేస్‌లో అయిదుగురు అమ్మాయిలు మాత్రమే ఉన్నట్టు తెలిసింది. ఆ అయిదుగురిలో ఒక్కరు కూడా బాగోలేరు. దీంతో ఐన్ కు ఒళ్లు మండింది. వందల మంది ఉన్నారని అబద్ధాలాడి తన చేత డబ్బులు కట్టించుకున్నారని చెబుతూ ఆ సంస్థపై కోర్టులో కేసు వేశాడు. మరి కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి. గత మేనెలలో కూడా ఇలాగే ఓ మహిళ డేటింగ్ ఏజెన్సీపై కేసు వేసింది. తనకు ఆరు అడుగుల అందగాడు కావాలని అడిగితే, అంతకన్నా తక్కువ ఎత్తు ఉన్నవారిని డేటింగ్ ఏజెన్సీ చూపించిందని ఆమె ఆరోపణ.
కొత్తగా ఆ సర్టిఫికెట్ కూడా
డేటింగ్ యాప్ లో వివరాలు నమోదులో ఇప్పుడు కొత్తగా ఓ కాలమ్ చేరింది. అదే వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లకే డేటింగ్ యాప్ లో డిమాండ్ ఉంటోందట. అందుకే వ్యాక్సిన్ సమాచారం మాండేటరీ చేశాయి డేటింగ్ సైట్లు.
Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?
Also read: ఆ సమస్యా ఉన్నా ఇలా చేస్తే పిల్లలు పుట్టే ఛాన్స్
Also read: డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?
Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్
Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Viral news: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్కు మహిళల సూటిప్రశ్న