Hair: ఒత్తయిన జుట్టు కావాలా... ఈ మూడూ తినండి చాలు
అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా జుట్టు ఒత్తుగా ఉంటేనే అందం. అందుకోసం ఏం తినాలో ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
జుట్టు పెరగడంపై చాలా అంశాల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మీ జన్యువులు పెద్ద పాత్ర వహిస్తాయి. అలాగే మీ వయస్సు, మీ రక్తంలోని హార్మోన్లది కూడా ముఖ్య పాత్రే. ఇవన్నీ కాకుండా మీరు తినే ఆహారంలో పోషకాలు లేకున్నా కూడా జుట్టు సరిగా పెరగదు, మెరవదు. కొన్ని రకాల ఆహారం ద్వారా జుట్టును ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. అందుకు మీరు రోజువారీ ఆహారం మూడు రకాల ఆహారాలు ఉండేట్టు చూసుకోవాలి. అవేంటంటే...
1. ప్రోటీన్లు
మన జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుంది. కెరాటిన్ అనేది అన్ని పోట్రీన్ల మాదిరిగానే అమైనో ఆమ్లాల ప్రత్యేక మిశ్రమాలతో రూపొందించబడింది. హార్వర్డ్ అధ్యయనం ప్రకారం తగినంత ప్రోటీన్ రోగనిరోధక వ్యవవస్థకు, గుండె, మెదడు, చర్మం వంటి అవయవాలు సరిగ్గా పనిచేయడానికి కూడా చాలా అత్యవసరం. అలాగే జుట్టును పెంచేందుకు కూడా ప్రోటీన్ చాలా ముఖ్యం. రోజూ గుడ్డు, కొమ్ముశెనగలు, నట్స్ (జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, పిస్తా, ఎండు ద్రాక్షలు) వంటివి తింటే ప్రోటీన్ అందుతుంది. అలాగే చేపలు, చికెన్, ఓట్స్, బీన్స్ వంటి వాటిలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వైద్యుల సలహాతో ప్రోటీన్ సప్లిమెంట్లను కూడా వాడొచ్చు.
2. బి విటమిన్లు
బయోటిన్, నియాసిన్ అనే బి విటమిన్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తిని అందిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. హార్వర్డ్ పరిశోధన ప్రకారం బయోటిన్ సప్లిమెంట్లు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయని, జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా పెరిగేందుకు సహకరిస్తాయని తేలింది. అయిదే వైద్యుల సలహాతో మాత్రమే వీటిని వాడాలి. బయోటిన్ లోపం జుట్టు, చర్మంపై పడుతున్నట్టు ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. చేపలు, గుడ్లు, నట్స్, చిలగడదుంపలు, బ్రకోలీ, పాలకూర వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. వైద్యులను సంప్రదించి సప్లిమెంట్లు కూడా వాడొచ్చు.
3. విటమిన్ డి
సూర్యరశ్మి ద్వారా అందే విటమిన్ డి కూడా ఆరోగ్యకరమైన జుట్టుకు చాలా అవసరం. ఇది వెంట్రుకల ఫోలికల్స్ ని సృష్టించడంతో పాటూ ఎదుగుదలకు సహకరిస్తాయి. చేపలు, గుడ్డు సొనలో విటమిన్ డి లభిస్తుంది. బటన్ పుట్టగొడుగులు, సాల్మన్ చేపలు, కాడ్ లివర్ ఆయిల్, సార్టినెస్ చేపల ద్వారా విటమిన్ డి అందుతుంది. రోజూ నీరెండలో అరగంట పాటూ నిల్చున్నా మన శరీరంలో ఆ సూర్యరశ్మిని గ్రహించి విటమిన్ డి ని తయారుచేసుకుంటుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: రోజూ తాగుతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ
Also read: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి
Also read: డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి