AP Inter Supply Exam Date 2025: ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై మంత్రి లోకేష్ ప్రకటన
AP Inter Results 2025 | ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. వచ్చే నెలలో పరీక్షలపై క్లారిటీ ఇచ్చారు.

AP Inter Supply Exam Date 2025: అమరావతి: ఏపీలో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విడుదల చేశారు. ఫలితాలలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇంటర్ సెకండియర్ లో 83 శాతం మంది పాస్ కాగా, ఫస్టియర్ పరీక్షలలో 70 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇదే సమయంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలపై అప్‌డేట్ ఇచ్చారు. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు నిరాశ చెందవద్దని, వచ్చే నెలలో నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని, స్కోర్ చేయడానికి మళ్లీ ప్రిపేర్ అయి మంచి మార్కులతో పాస్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఎగ్జామ్ ఫీజు, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ వివరాలు
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజులు చెల్లించాలని సప్లిమెంటరీ విద్యార్థులకు సూచించారు. ఏపీలో ఫస్టియర్ కంటే సెకండియర్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఓవరాల్ గా చూస్తే ఫలితాలలో అమ్మాయిలు పైచేయి సాధించారు.
ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలలో గత 10 పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఫస్టియర్ లో 70% విద్యార్థులు శాతం పాస్ కాగా, రెండో సంవత్సరంలో 83% మంది ఉత్తీర్ణత సాధించారు.
ఫస్టియర్ పాస్ పర్సంటేజీ..
4,87,295 మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరుకాగా, 3,42,979 మంది పాసయ్యారు. ఫస్టియర్ ఒకేషనల్‌లో 38,553 మంది పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 23,991 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఓవరాల్ గా చూస్తే 70 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఒకేషనల్ లో అయితే 62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
సెకండియర్ పాస్ పర్సంటేజీ..
ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు 83 శాతం పాస్ అయ్యారు. సెకండియర్ లో 4,22,030 మంది విద్యార్థులు ఎగ్జామ్ హాజరుకాగా, 3,51,521 మంది పాసయ్యారు. ఒకేషనల్ విద్యార్థులలో 33,289 మంది పరీక్ష రాయగా, 25,707 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విద్యార్థులలో 77 శాతం పాస్ అయ్యారని మంత్రి లోకేష్ వెల్లడించారు.
ఫస్టియర్‌లో అమ్మాయిలు 75 శాతం పాస్ కాగా, బాలురు 66 శాతం పాసయ్యారు. ఫస్టియర్ ఒకేషనల్ లో అయితే అమ్మాయిలు 71 శాతం పాస్ కాగా, బాలురు 50 శాతం ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్ లో అమ్మాయిలు 86 శాతం పాస్ కాగా, అబ్బాయిలు 80 శాతం పాసయ్యారు. ఒకేషనల్ లో అమ్మాయిలు 84 శాతం పాస్ కాగా, అబ్బాయిలు 67 శాతం ఉత్తీర్ణత సాధించారు.






















