Camera Dog In IPL: ఐపీఎల్ గ్రౌండ్‌లో 'కెమెరా డాగ్' - ఆసక్తి పెంచిన సరికొత్త టెక్నాలజీ
Pet Vision Technology: ఐపీఎల్ స్ట్రీమింగ్‌లోకి ప్రత్యేకమైన రోబోటిక్ కెమెరా డాగ్ ప్రవేశించింది. సాంకేతికత & వినోదాన్ని మిళితం చేసి అభిమానులకు 'పెట్ విజన్' అనుభవాన్ని అందిస్తోంది.

Unique Robotic Camera Dog In IPL 2025 Season: ఈసారి ఐపీఎల్ (Indian Premier League 2025) మాచ్‌ల్లో విభిన్నమైన & ఆసక్తికరమైన విషయం కనిపించింది. మ్యాచ్ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లే కాదు, ఒక అందమైన రోబోటిక్ కుక్క కూడా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. అది సాధారణ శునకం కాదు, సాంకేతికత & కెమెరాతో కూడిన ప్రత్యేకమైన రోబోటిక్ డాగ్. ఈ రోబోటిక్ డాగ్ పరిగెత్తగలదు, దూకగలదు & దాని పాదాలతో హార్ట్ ఎమోజీ (Heart emoji)ని కూడా సృష్టించగలదు.
రోబోటిక్ కెమెరా డాగ్‌కు సంబంధించిన వీడియోను IPL అధికారిక X ఖాతాలో (గతంలో ట్విట్టర్) షేర్ చేశారు. ఈ వీడియోలో, ప్రముఖ కామెంటేటర్ డానీ మోరిసన్ (Danny Morrison) ఈ కొత్త కెమెరా కుక్కను పరిచయం చేశారు. అక్కడ ఉన్న వాళ్లు కెమెరా కుక్కతో కలిసి సరదాగా గడిపారు, దానితో పాటు పరుగెత్తారు. ఆ కుక్క తన పాదాలతో 'హార్ట్ ఎమోజి'ని సృష్టించగలదని కూడా ప్రూవ్ చేశారు.
రోబోటిక్ కెమెరా కుక్క ఎలా ఉంటుంది?
ఈ రోబోట్ శునకానికి గోధుమ రంగు చర్మం లాంటి పూతను అతికించారు. దాని ముఖం స్థానంలో ఒక కెమెరాను ఫిక్స్ చేశారు. గోప్రో లాంటి యాక్షన్ కెమెరా లాగా ఈ కెమెరా పని చేస్తుంది.
గ్రౌండ్‌లోకి ఎందుకు తీసుకొచ్చారు?
ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలోని అన్ని మూలలకు తిరుగుతూ, 'పెట్ విజన్' (Pet Vision) అందించడం దీని పని. అంటే, ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని కోణాల నుంచి మ్యాచ్‌ను చూపిస్తుంది.
ఆటగాళ్ల వద్దకు వెళ్లినప్పుడు ఏం జరిగింది?
ఢిల్లీ క్యాపిటల్స్ & ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌కు ముందు, ఆటగాళ్ల సమీపంలోకి ఈ కుక్క వెళ్లింది. దీనిని చూసి చూసిన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషంగా కనిపించగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ కాస్త అయోమయానికి గురయ్యాడు. ఈ రోబో కుక్క అకస్మాత్తుగా తన వెనుక కాళ్ళపై నిలబడినప్పుడు MI బౌలర్ రీస్ టోప్లీ షాక్ అయ్యాడు.
ఈ అద్భుతమైన రోబోటిక్ డాగ్ LSG & CSK మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా మైదానంలో కనిపించింది. ఇది మహేంద్ర సింగ్ ధోని వైపు వెళ్ళినప్పుడు, అతను సరదాగా దాన్ని ఎత్తి కింద పెట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన అభిమానులు విరగబడి నవ్వారు.
పేరు సూచించమని అభిమానులకు విజ్ఞప్తి
ఈ కొత్త రోబో శునకానికి మంచి పేరు సూచించమని ఐపీఎల్ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సోషల్ మీడియా ప్రజలు దీనికి నవ్వు తెప్పించే & అందమైన పేర్లను సూచిస్తున్నారు.
క్రీడా ప్రసారంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం
ఈ రోబోటిక్ డాగ్ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, ఇది క్రీడా ప్రసార ప్రపంచంలో మరో పెద్ద మార్పు. కెమెరా, గ్రాఫిక్స్, బాల్ ట్రాకింగ్ & వీడియో నాణ్యత మెరుగుపడుతున్న కొద్దీ క్రికెట్ & ఇతర క్రీడలను చూసే విధానం మారుతోంది & ఆనందం రెట్టింపు అవుతోంది.





















