అన్వేషించండి

IPL 2025 GT Replacement: గుజ‌రాత్ టీంలో కీల‌క మార్పు.. గాయ‌ప‌డిన ఫిలిప్స్ స్థానంలో లంక ఆల్ రౌండ‌ర్.. రేపు ఢిల్లీతో మ్యాచ్

రెండునెల‌ల‌కుపైగా సుదీర్ఘంగా సాగే ఐపీఎల్లో ఆట‌గాళ్లు గాయ‌ప‌డ‌టం మాములే. తాజాగా గాయ‌ప‌డిన ఫిలిఫ్స్ స్థానంలో గుజ‌రాత్ టైటాన్స్ ఒక ఆట‌గాడిని తీసుకుంది. ప్ర‌స్తుతం పట్టిక‌లో జీటీ టాప్-2లో నిలిచింది.

Dasun Shanaka VS Glenn Phillips: గుజ‌రాత్ టైటాన్స్ తన స్క్వాడ్ లో ఒక మార్పు చేసింది. గాయ‌పడిన ఆల్ రౌండ‌ర్ గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మ‌రొ ఆట‌గాడిని తీసుకుంది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఫిలిప్స్ గాయ‌ప‌డ్డాడు. ప్ర‌సిధ్ కృష్ణ బౌలింగ్ చేస్తున్న‌ప్పుడు ఇషాన్ కిష‌న్ ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించ‌గా, ర‌నౌట్ చేసే క్ర‌మంలో తొడ కండ‌రాల‌గాయానికి ఫిలిప్స్ గుర‌య్యాడు. దీంతో వెంట‌నే అత‌డిని డ్రెస్సింగ్ రూంకి త‌ర‌లించి, చికిత్స అందించారు. ఆ త‌ర్వాత గాయం తీవ్ర‌త తెలియ‌డంతో మెరుగైన చికిత్స కోసం త‌న‌ని న్యూజిలాండ్ పంపించారు. ఈ సీజ‌న్ లో గుజ‌రాత్ త‌ర‌పున ఆడుతున్న ఫిలిప్స్ కు తుదిజట్టులో ఆడే అవ‌కాశం రాలేదు. స‌న్ పై మాత్రం ఫీల్డింగ్ చేసి, అన్ ల‌క్కీగా గాయ‌ప‌డ్డాడు. అత‌ని స్థానంలో శ్రీలంక‌కు చెందిన మాజీ కెప్టెన్ దాసున్ ష‌న‌క‌ను గుజ‌రాత్ టీమ్ తీసుకుంది. దీనికి ఐపీఎల్ మేనేజ్మెంట్ కూడా ఆమోదం తెలిపింది. 

మూడు జ‌ట్ల త‌ర‌పున ఆడిన ఫిలిప్స్.. 
ఐపీఎల్లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు జ‌ట్ల త‌ర‌పున ఫిలిప్స్ ప్రాతినిథ్యం వ‌హించాడు. గ‌తంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడినా, తుది జ‌ట్టులో ఎక్కువ అవ‌కాశాలు రాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 8 మ్యాచ్ లే ఆడాడు. ఇక గ‌తేడాది మెగావేలంలో త‌న‌ను గుజ‌రాత్ రూ.2 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు మ్యాచ్ లు ఆడిన‌ప్ప‌టికీ, ఫిలిప్స్ కు తుదిజ‌ట్టులో చాన్స్ దొర‌క‌లేదు. గ‌త చాంపియ‌న్స్ ట్రోఫీలో ఫీల్డ‌ర్ గా అంద‌రి దృష్టిని ఫిలిప్స్ ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే.  ఇక స‌బ్ స్టిట్యూట్ ఫీల్డ‌ర్ గా గాయ‌ప‌డ‌టంతో ఈ సీజ‌న్ లో ఫిలిప్స్ ప్ర‌స్థానం ముగిసిన‌ట్ల‌య్యింది. మ‌రోవైపు ష‌న‌కతో రూ. 75 ల‌క్ష‌ల‌కు జీటీ ఒప్పందం చేసుకుంది. 

ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు..
లంక ఆల్ రౌండ‌ర్ ష‌న‌కకు ఆల్ రౌండ‌ర్ గా మంచి గుర్తింపు ఉంది. జాతీయ జ‌ట్టు త‌ర‌పున 102 టీ20 మ్యాచ్ ల్లో 5 అర్ద సెంచ‌రీలు చేయ‌గా, 33 వికెట్లు తీశాడు. అలాగే 71 వ‌న్డేలు, 6 టెస్టులు ఆడాడు. ఇక టీ20 ఫార్మాట్ లో జ‌రిగిన ఆసియా క‌ప్ 2022ను లంక గెల‌వ‌డంతో సార‌థిగా ష‌న‌క కీల‌క‌పాత్ర పోషించాడు.ఇక 2023లోనూ రీప్లేస్ మెంట్ గా షనక.. గుజరాత్ తరపున ఆడాడు. ఆ సీజన్ లో కేన్ విలియమ్సన్ గాయపడటంతో అతని స్థానంలో షనకను తీసుకున్నారు. ఈ సీజ‌న్ లో గుజ‌రాత్ అద్భుత ప్ర‌దర్శ‌న చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో నాలిగింటిలో గెలుపొంది, రెండింటిలో ఓడిపోయింది. దీంతో 8 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో నెం. 2 పొజిష‌న్ లో ఉంది. 2022 లో చాంపియ‌న్ గా నిలిచిన గుజ‌రాత్,, త‌ర్వాత ఏడాది ర‌న్న‌ర‌ప్ తో స‌రిపెట్టుకుంది. ఇక త‌ర్వాతి మ్యాచ్ ను శ‌నివారం అహ్మాదాబాద్ లో టేబుల్ టాప‌ర్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో గుజ‌రాత్ ఆడ‌నుంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
Balakrishna : మూడు నిమిషాలే... ఏ ఛాలెంజ్‌కైనా రెడీ - బాలయ్య పవర్ ఫుల్ స్పీచ్
మూడు నిమిషాలే... ఏ ఛాలెంజ్‌కైనా రెడీ - బాలయ్య పవర్ ఫుల్ స్పీచ్
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
Balakrishna : మూడు నిమిషాలే... ఏ ఛాలెంజ్‌కైనా రెడీ - బాలయ్య పవర్ ఫుల్ స్పీచ్
మూడు నిమిషాలే... ఏ ఛాలెంజ్‌కైనా రెడీ - బాలయ్య పవర్ ఫుల్ స్పీచ్
Adilabad Tiger News: ఐదేళ్ల తర్వాత కవ్వాల్ అభయారణ్యంలో కాలుమోపిన పెద్దపులి- శాశ్వతంగా ఉండేలా అధికారుల చర్యలు
ఐదేళ్ల తర్వాత కవ్వాల్ అభయారణ్యంలో కాలుమోపిన పెద్దపులి- శాశ్వతంగా ఉండేలా అధికారుల చర్యలు
Agnipath 2025 Recruitment : అగ్నివీర్ అవ్వడానికి ఈ సబ్జెక్టులతో పాస్ అవ్వడం ముఖ్యం, నిబంధనలు తెలుసుకోండి
అగ్నివీర్ అవ్వడానికి ఈ సబ్జెక్టులతో పాస్ అవ్వడం ముఖ్యం, నిబంధనలు తెలుసుకోండి
Akhanda 2 Thaandavam Teaser : ట్రెండింగ్‌లో 'అఖండ 2 మాస్సివ్ తాండవం' టీజర్ - ఒకే ఒక్క డైలాగ్... బాలయ్య విశ్వరూపం
ట్రెండింగ్‌లో 'అఖండ 2 మాస్సివ్ తాండవం' టీజర్ - ఒకే ఒక్క డైలాగ్... బాలయ్య విశ్వరూపం
Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 82 రివ్యూ... దివ్యను కోలుకోలేని దెబ్బ కొట్టిన తనూజా... టాస్క్ లో డెమోన్ గాయం... చివరి కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ డే 82 రివ్యూ... దివ్యను కోలుకోలేని దెబ్బ కొట్టిన తనూజా... టాస్క్ లో డెమోన్ గాయం... చివరి కెప్టెన్ ఎవరంటే?
Embed widget