Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 82 రివ్యూ... దివ్యను కోలుకోలేని దెబ్బ కొట్టిన తనూజా... టాస్క్ లో డెమోన్ గాయం... చివరి కెప్టెన్ ఎవరంటే?
Bigg Boss 9 Telugu Today Episode - Day 82 Review : కెప్టెన్సీ టాస్క్ లో డెమోన్ పవన్, కళ్యాణ్ కలిసి పోటీ పడగా, డెమోన్ వెన్ను నొప్పితో విలవిల్లాడాడు. మరి అతని హెల్త్ అప్డేట్, చివరి కెప్టెన్ ఎవరంటే?

డే 82 రోజు "రుచితాను తిట్టేసి వచ్చాను. ఆమె వస్తుందేమో సారీ చెప్పాలి అనుకున్నా" అంటూ గర్ల్ ఫ్రెండ్ ను గుర్తు చేసుకున్నాడు ఇమ్మాన్యుయేల్. "బిగ్ బాస్ హౌస్ లో చివరి కెప్టెన్సీ కోసం జరుగుతున్న పోరులో ఇప్పటి వరకూ నేను పంపించిన యోధులతో మీరు అలుపెరగని పోరాటం చేశారు. ఇప్పుడు మీలో ఎవరు ఈ కెప్టెన్సీకి చేరువ కావాలనేది కెప్టెన్సీ రేసు నుంచి ఇప్పటికే వీడిన సభ్యులు నిర్ణయిస్తారు. బజర్ మోగినప్పుడల్లా కెప్టెన్సీ రేసులో లేని సభ్యులు డ్యాగర్ ను అందుకుని, తగిన కారణాలతో ఎవరు కెప్టెన్ అవ్వాలో వారికి ఇవ్వాలి. వారు ఎవరు కెప్టెన్ రేసు నుంచి ఎవరు తప్పుకోవాలో చెప్పాలి" అని చెప్పారు బిగ్ బాస్.
రీతూ వర్సెస్ సంజన రచ్చ
సుమన్ డ్యాగర్ ను రీతూకి ఇవ్వగా... ఆమె సంజనాను పొడిచి "ఫస్ట్ వీక్ కెప్టెన్ సపోర్ట్ తో అయ్యింది. గేమ్ గురించి మాట్లాడాలి. ఆమె కెప్టెన్ గా కాకముందే అన్ని మాటలు అన్నది. అదే కెప్టెన్ అయితే ఇంకెన్ని మాటలు అంటుందో. అందుకే వద్దు. ఒక్క ఇమ్మూతో తప్ప మిగతా అందరితో బిలో ది బెల్ట్ మాట్లాడారు. అలా టార్గెట్ చేసిన మనిషి కెప్టెన్ గా వద్దు" అంటూ తన పాయింట్ చెప్పింది రీతూ. "ఒకసారి లోపలికి వస్తే అంతా గేమ్ మాత్రమే" అని సంజన సమర్థించుకుంది. "మీరు ఇమ్ము కలిసి ఆడేది గేమా?" అని రీతూ అడిగితే, "అది ప్రిషియస్ బాండ్" అని చెప్పింది సంజన. "మీకైతే ప్రిషియస్... మిగతా వాళ్ళను మాత్రం ఏదేదో అంటారు" అంటూ ఇచ్చిపడేసింది రీతూ. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. "ఇమ్ము, నేను నామినేషన్ కు వచ్చాము. ఇప్పుడు ఓటింగ్ ఎక్కడికి పోతుంది అన్నది మీ సూపర్ బాండ్" అని రీతూ అంటే, "చిన్న చిన్న షోలు చేసుకుని ఇక్కడికి రాలేదు. నేను 19 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నా. నాకు ఫ్యాన్ బేస్ ఉంది" అని అని సంజన సాగదీసింది. డెమోన్ కూడా "ఏం చేశామో చెప్పండి" అని ఫైర్ అయ్యాడు. "ఇలాంటి వాళ్ళ కోసం జుట్టు కట్ చేసుకున్నా, మా నాన్న షర్ట్ రిటర్న్ ఇచ్చి శారీలు తెప్పించడం చేశా. మీకోసం నేను త్యాగం చేయడం బ్యాడ్ గా ఫీల్ అవుతున్నా" అని రీతూ కౌంటర్ ఇచ్చింది. "మధ్యలో నన్ను తీయకు రీతూ. నిన్ను మాటలు అన్నప్పటి నుంచి నేను దూరంగా ఉంటున్నా ఆమెకు" అని క్లారిటీ ఇచ్చాడు ఇమ్మూ.
గాయంతో విలవిల్లాడిన డెమోన్
సెకండ్ భరణి కత్తిని తెచ్చి "డెమోన్ ఈ మధ్య ఒక్కడివే డల్ గా ఉంటున్నావ్. ఇది నీకు హెల్ప్ అయ్యి, ఎనర్జీ ఇస్తుందని అనుకుంటూ" అని కత్తి ఇచ్చాడు. అతను వెంటనే "నేను కెప్టెన అయ్యాను అని కెప్టెన్సి నుంచి తీసేసావ్. దివ్య కెప్టెన్ అయినా ఆమెకు సపోర్ట్ చేశావ్. నన్ను సపోర్ట్ చేయట్లేదు అంటూ ఇమ్మూని కత్తితో గుచ్చి, మూడవ వారం నుంచి ఇప్పటిదాకా ఉన్న రీజన్స్ ను చెప్పాడు డెమోన్. దీంతో ఇమ్మూ ఫైర్ అవుతూనే వివరణ ఇచ్చుకున్నాడు. "నన్ను కెప్టెన్ గా చేయకపోతే ఇంకెప్పుడూ సపోర్ట్ చేయను అని బెదిరిస్తే ఎవరు తీసుకుంటారు" అని డెమోన్ ను అడిగాడు.
అలాగే "కెప్టెన్సీ కంటెండర్ గా చూడాలనుకుంటూ" అని రీతూకి డ్యాగర్ ను ఇచ్చింది తనూజా. దీంతో "నేను కెప్టెన్ అవ్వాలి అనుకుంటే మీరు ఉండకూడదు" అని దివ్యను తీసేసింది రీతూ. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. రీతూకి రెండుసార్లు ఎందుకు ఛాన్స్ ఇచ్చావ్ అని దివ్య, తనూజాతో గొడవ పడింది. తరువాత సంజనా డ్యాగర్ తీసుకుని "రీతూకి ట్రిపుల్ ఇమ్యూనిటీ ఇవ్వను" అని చెప్పింది. చివరికి కళ్యాణ్, డెమోన్ కలిసి రీతూని తీసేశారు. "నువ్వు కెప్టెన్ అవకపోతే మీ అమ్మ ఎంత ఫీల్ అవుతుందో తెలీదు. నేను అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతా" అని చెప్పింది తనూజా. "రోడ్ టు కెప్టెన్సీ" టాస్క్ ఇచ్చారు కళ్యాణ్, డెమోన్ కు. ఈ టాస్క్ లో డెమోన్ సడన్ గా నొప్పితో విలవిల్లాడడడంతో కళ్యాణ్ విన్ అయ్యాడు. డెమోన్ వెన్ను నొప్పితో కదలలేకపోయాడు. మెడికల్ రూమ్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. తరువాత రెస్ట్ తీసుకున్నాడు డెమోన్. "టికెట్ టు ఫినాలే, విన్నర్ ఉంది. ఏం కాదు" అని సముదాయించింది రీతూ. టాస్క్ ఓడిపోయినందుకు బ్యాడ్ లక్ అంటూ డెమోన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరి కెప్టెన్ కళ్యాణ్ అయ్యాడు.





















