Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 80 రివ్యూ... తనూజా, సుమన్ లకు బ్యాడ్ లక్... మానస్ ను ఓడించిన డెమోన్... భరణి వర్సెస్ దివ్య
Bigg Boss 9 Telugu Today Episode - Day 80 Review : బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం చివరి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఎక్స్ కంటెస్టెంట్ తో జరుగుతున్న ఈ పోరులో నేటి ఎపిసోడ్లో డెమోన్ విన్ అయ్యాడు.

79వ రోజు రాత్రి ఎక్స్ కంటెస్టెంట్ ప్రేరణ కంబం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు డెన్ తో పాటు ఇళ్లంతా తిప్పి చూపించారు. "టాప్ 5 లో వీడియోను పర్సనలైజ్ చేసి వేస్తారు. అలాగే బిగ్ బాస్ మన గురించి చెప్తారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడానికి మాటల్లేవ్. దీని కోసమైనా టాప్ 5లో ఉండాలి. గట్టిగా ఆడండి" అని అందరిని మోటివేట్ చేసింది. "క్రాస్ ఇట్ క్లైమ్బ్ ఇట్ రోప్ ఇట్" అనే టాస్క్ పెట్టారు. అందులో భాగంగా రోప్ వే ద్వారా స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు నడిచి, పైనున్న బాల్ ను తీసుకుని స్లోప్ లో నుంచి హోల్స్ లో పడేలా చేయాలి. ఈ టాస్క్ ప్రేరణ, తనూజా మధ్య జరిగింది. దీనికి దివ్య సంచాలక్. ఈ టాస్క్ లో ప్రేరణ విన్ అయ్యింది. 5 సెకండ్స్ లో మిస్ అయ్యింది అని బాధ పడింది తనూజా. గేమ్ లో ఓడిపోయినంత మాత్రాన మొత్తం ఓడిపోయినట్టు కాదని రీతూ ఆమెను ఓదార్చింది.
దివ్య వర్సెస్ భరణి
80వ రోజు ఉదయాన్నే భరణి, రీతూ, ఇమ్మాన్యుయేల్ కెమెరా ముందు ఫన్నీ స్టెప్ వేసి నవ్వించారు. 10 గంటలకు "నేనే తక్కువ మాట్లాడడం బెటర్" అంటూ మళ్ళీ దివ్య దగ్గర డిస్కషన్ పెట్టాడు భరణి. "దివ్య నీకో నమస్కారం... ఏజ్ గురించి ప్రతిసారీ ఎందుకు? దేనికైనా ఒక లిమిట్ ఉంటది" అని ఫైర్ అయ్యాడు. "మీరు జోక్ వేసినప్పుడు నేను తీసుకున్నా. నేను వేస్తే నువ్వు తీసుకోవాలి. నిన్నటి నుంచి నేను కుంటితే జోక్ వేశారు కదా. అది జోకా?" అని అడిగింది దివ్య. "నాదే తప్పు సారీ... నేను ఇంకెప్పుడూ అది రిపీట్ చేయను" అని అన్నాడు భరణి. "అదే వద్దు" అంటే... "చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా సారీ ఇలాగే చెప్తారు వినమ్రంగా. తీసుకో" అంటూ సీరియస్ గా వెళ్ళిపోయాడు.
దేత్తడి హారిక సందడి
"నేను సీజన్ 4లో టాప్ 5 కంటెస్టెంట్ ను. కనిపెట్టండి" అంటూ దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చింది. "నేను భరణి గారితో మాట్లాడొచ్చా దివ్య గారు ?" అని సెటైర్ వేసింది. అంతేకాదు అందరూ వచ్చి అద్దం దగ్గర చూసుకుంటే, దాని రియాక్షన్ ఏంటి అనే స్కిట్ ను ఇమ్మూతో చేయించింది. మధ్యాహ్నం సుమన్ శెట్టితో "టవర్ ఆఫ్ పవర్" అనే టాస్క్ ఆడడానికి సిద్ధమైంది హారిక. వై ఆకారపు ఫోర్క్ ను ఉపయోగించి, ఫ్రేమ్ లో ఉన్న డిస్క్, బాల్ లను ఒక్కొక్కటిగా తీసుకొచ్చి టవర్ లా నిర్మించాలి. పోడియం దగ్గరకు వెళ్ళడానికి టైర్ వేను ఉపయోగించాలి. దీనికి సంచాలక్ భరణి. ఇందులో హరికనే విన్ అయ్యింది. ఇమ్మూని స్విమ్మింగ్ పూల్ లోకి తోసి వెళ్ళిపోయింది హారిక. "నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు" అంటూ మళ్ళీ దొంగతనంతో చిలిపి పనులు మొదలుపెట్టింది సంజన.
సాయంత్రం 4 గంటలకు మానస్ వచ్చాడు. వైబ్ లోగా ఉందని బిగ్ బాస్ ను అడిగి మరీ "కుర్చీని మడతబెట్టి" సాంగ్ వేయించుకుని డ్యాన్స్ వేశాడు. అందరినీ కూర్చోబెట్టి "నామినేషన్ లో స్ట్రాంగ్ పాయింట్ ఉంటేనే నామినేట్ చేయండి" అని సలహా ఇచ్చాడు. డెమోన్ తో మానస్ "నెయిల్ ఇట్ టు విన్ ఇట్" అనే టాస్క్ ఆడాడు. జిగ్ జాగ్ వే ద్వారా పరిగెత్తుకుంటూ వెళ్ళి, పైన ఉన్న ట్రాక్స్ నుంచి విడుదలయ్యే బాల్స్ ను బోర్డు దగ్గరకు తీసుకొచ్చి నెయిల్స్ కు గుచ్చుకునేలా విసరాలి. కళ్యాణ్, భరణి లు బాల్స్ విసరగా... ఈ టాస్క్ లో డెమోన్ విన్ అయ్యాడు. దీంతో సెకండ్ కంటెండర్ గా నిలిచాడు డెమోన్ పవన్.





















