Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 78 రివ్యూ... రీతూపై నోరు పారేసుకున్న సంజన... కళ్యాణ్ పీక పట్టేసుకున్న డెమోన్... నామినేషన్స్ లో హద్దులు దాటిన హౌస్ మేట్స్
Bigg Boss 9 Telugu Today Episode - Day 76 Review :12వ వారం నామినేషన్లతో ఈరోజు హౌస్ దద్దరిల్లింది. ఒక్కొక్కరూ ఒక్కో రేంజ్ లో నామినేషన్లలో రచ్చ చేశారు. డెమోన్, పవన్ అయితే ఏకంగా కొట్టుకునేదాకా వెళ్లారు.

డే 78 ఎపిసోడ్లో బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఫ్యామిలీ వీక్ అయిపోవడంతో ఫుల్ ఎనర్జీగా ఉన్న కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్ల పేరుతో హౌస్ భగ్గుమనేలా చేశారు. "మీ కుటుంబ సభ్యులను కలిశాక ఎన్నో హింట్స్ అందుకున్నారు. అది మిమ్మల్ని ఫినాలే వైపు నడిపించే ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈవారం రెండు రౌండ్లు నామినేషన్ ఉంటుంది. మొదటి రౌండ్ ప్రైవేట్ నామినేషన్ లో మీరు చెప్పాలని చెప్పలేకపోయిన కంటెస్టెంట్స్ పేర్లు రాసి, పాయింట్స్ చెప్పి బాక్స్ లో వేయండి" అని చెప్పారు.
ప్రైవేట్ నామినేషన్స్ తో బాక్స్ బద్దలు
ఇమ్మాన్యుయేల్ "మొన్న వేరే వాళ్ళ కంటెండర్షిప్ ను వదులుకున్నాడు" డెమోన్ ను, "12 వారం కూడా నామినేషన్లు అంటే భయపడుతున్నాడు. నేను కెప్టెన్సీ గురించి ఫైట్ చేద్దాం అనుకున్నా. కెప్టెన్ గా డెమోన్ గివ్ అప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పినా, ఎలాగైనా ఆపండి, నేను ఆడదాం అనుకుంటున్నా అని చెప్పినా అతని మైండ్ మారలేదు" అని సుమన్ ను పేరు చెప్పారు. "హౌస్ లో రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనూజా, దివ్యకు చెబుతూనే ఉన్నా. చిన్నపిల్లల ఆటలా అయిపోతోంది. ఆల్రెడీ దివ్యను నేమింగ్ చేశాను. కాబట్టి దివ్యను నామినేట్ చేస్తున్నా" అన్నారు భరణి.
"నాకు కళ్యాణ్ సపోర్ట్ చేయట్లేదు, 7 వారాలుగా చాన్స్ రాకపోయినా లాస్ట్ వీక్ కంటెండర్స్ లిస్ట్ లో నా పేరు చెప్పాడు. అంతకుముందు తనూజా నాకు గొడవ్వినప్పుడు రాజుగా నాకేం సపోర్ట్ చేయలేదు" అని కళ్యాణ్ పడాల పేరు చెప్పాడు. "భరణి నా వైపు ఉంటారనుకున్నప్పుడల్లా స్టాండ్ తీసుకోవట్లేదు" అని భరణి పేరు చెప్పింది దివ్య. సుమన్ వచ్చి సంజన వల్ల హౌస్ హార్మని తగ్గిపోతుంది. సుమన్ డార్లింగ్ అని పిలవడం నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉందని చెప్పాడు. తనూజా హౌస్ లో చిన్న చిన్న విషయాలకు కూడా అరుస్తూ రీతూతో గొడవ పడడం నచ్చదు అని డెమోన్ ను నామినేట్ చేసింది. సంజన "నేను కెప్టెన్ అవ్వాలి అనుకుంటున్నా అని చెప్పినా ఫస్ట్ నన్నే లాగేసారు" అని భరణి పేరును రాసింది. ఇంతటితో మొదటి లెవెల్ ఓటింగ్ అయిపోయింది. భరణి 2, పవన్ 2, సుమన్ 1, తనూజా 1, కళ్యాణ్ 1, సంజన 1 ఓట్లు వచ్చాయి.
మళ్ళీ నోరు జారిన సంజన
రెండవ రౌండ్ లో ఫోటోను ఫైర్ లో వేసి నామినేట్ చేయాలి. భరణి "ఎంత మంచిగా ఉన్నా వాయిస్ ను అనవసరంగా రైజ్ చేయడం వల్ల వేస్ట్ అవుతుంది. నా విషయంలో కూడా ఇదే జరిగిందని మా గురువు గారు చెప్పారు. నేను కామ్ గా ఉండడం ఎందుకంటే నామీద ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నారో, నేను అంతే చూపించాలి అనుకున్నా. నాకు సెటైర్లు రాక కాదు, మాట్లాడలేక కాదు. నీలో ఛేంజ్ రావాలి" అని దివ్యని నామినేట్ చేశారు. "మీ నోరు ఎవరు నొక్కారు?" అని అడిగింది దివ్య. "కారణం ఉన్నా లేకపోయినా.గట్టిగా మాట్లాడతావు అన్నారు" అని భరణి అనగానే... "ఎవరన్నారు" అని దివ్య అరిచింది. వేలు చూపించకు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు" అంటూ భరణి రెచ్చిపోయాడు. "నేను ఎవడన్నాడు అనలేదు. డిస్ రెస్పెక్ట్ చేయలేదు అని చెప్పింది దివ్య.
నా గేమ్ పోయింది నీవల్లే అంటూ సుమన్, స్ట్రాంగ్ అంటూ ఇమ్మూ తనూజాను నామినేట్ చేశారు. కళ్యాణ్ 'ఛాన్స్ వస్తే వేరే వాళ్ళ కోసం గివ్ అప్ ఇచ్చావు' అని డెమోన్ ను నామినేట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది. చివరకు ఇద్దరూ నవ్వేశారు. "ఇమ్మూ కెప్టెన్సీని త్యాగం చేశాడు, రెస్పెక్ట్ లేదు అన్నావ్ నచ్చలేదు" అని తనూజాను నామినేట్ చేశాడు ఇమ్మాన్యుయేల్. "నువ్వు త్యాగం చేసి రెండుసార్లు కెప్టెన్ అయినా కూడా ఇంకోసారి కెప్టెన్ అవ్వాలి అనుకుంటే నేను అవ్వొద్దా? నువ్వు నన్ను ఆ రేస్ నుంచి తప్పించావ్" అని చెప్పింది తనూజ. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది.
"ఒక మనిషి ఇష్టం లేదన్నా వాళ్ళ వెంట పడుతున్నావ్ అనడం తీసుకోలేకపోతున్నా" అని దివ్య తనూజాను, "ఇక్కడితో అంతా అయిపోవాలి. నువ్వంటే నాకిష్టం. ఒకరి గురించి కొట్టుకుంటున్నాం అని ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వొద్దు" అని తనూజా దివ్యను నామినేట్ చేసింది. "అన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం. సపోర్ట్ చేస్తానని చేయలేదు" అని ఏడుస్తూనే ఇమ్మూని నామినేట్ చేశాడు డెమోన్. అయితే ఇది టీం టాస్క్, కానీ నువ్వు వేరే వాళ్ళ కోసం ఛాన్స్ వదులుకున్నావ్ అని ఇమ్మూ, పవన్ ఫైర్ అయ్యారు. ఈ గొడవలో రీతూ మధ్యలో రావడంతో కళ్యాణ్, పవన్ కొట్టుకునేదాకా వెళ్లారు. అంతా కూల్ అయ్యింది అనుకునేలోపే... రీతూ సంజనను నామినేట్ చేయడంతో మరో పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవలో 'రాత్రంతా డెమోన్ తో హత్తుకుని కూర్చుంటావు. చూడలేకపోతున్నా' అంటూ నోరు పారేసుకుంది సంజన. హౌస్ మొత్తం ఆమె మాటలను ఖండించారు. ఈవారం దివ్య, పవన్, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన, భరణి, సుమన్ , తనూజ నామినేట్ అయ్యారు.





















