అన్వేషించండి

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 77 రివ్యూ... కొడుకు వల్ల సంజన గేమ్ డౌన్... తనూజా vs హరిత కౌంటర్... ఆ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసిన ఇమ్మాన్యుయేల్

Bigg Boss 9 Telugu Today Episode - Day 77 Review : బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వీకెండ్ మొత్తం ఫ్యామిలీ వీక్ నడిచిన సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్లో ఫ్యామిలీతో పాటు సెలబ్రిటీలు కూడా హంగామా చేశారు.

బిగ్ బాస్ డే 77 ఎపిసోడ్లో నాగార్జున మాస్ ఎంట్రీ తర్వాత సీక్రెట్స్ చెబితేనే ఫ్యామిలీని అలో చేస్తానని చెప్పారు. సుమన్ శెట్టి షూటింగ్స్ అని చెప్పి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తానని చెప్పాడు. అలాగే తనూజా అపార్ట్మెంట్ యాప్ ను సీక్రెట్ గా డౌన్లోడ్ చేసుకుని, తన ఫ్రెండ్స్ ను ఇంటికి రప్పించుకుంటానని చెప్పింది. నెక్స్ట్ సుమన్ శెట్టి ఫ్యామిలీ హౌస్ లోకి అడుగు పెట్టింది. ఆయన కూతురు రూపిక, కొడుకు పండు, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చి, గేమ్ బాగా ఆడాలని సుమన్ శెట్టికి చెప్పారు. టాప్ 5లో సుమన్, ఇమ్మూ, తనూజా, భరణి, కళ్యాణ్ కు ఇచ్చారు. కట్ అవుట్ బాక్స్ లో 'పద్మనాభసింహా'ని సుమన్ కు, 'అపరిచితుడు'ను తనూజాకు ఇచ్చారు శ్రీనివాస్ రెడ్డి. "ఇమ్మూ మెయిన్ డెసిషన్ తీసుకోవడంలో షేక్ అవుతున్నారు. డెమోన్ నీ కోసం గేమ్ ఎప్పుడు ఆడతావా అని చూస్తున్నా, చెరుకు రసం బండిని చూస్తే నువ్వే గుర్తొస్తావు భరణి, మొన్నైతే ఛాయాదేవి, సూర్యకాంతంను చూసిన ఫీలింగ్ వచ్చింది" అని చెప్పారు. "ఇక్కడ ఎవ్వరినీ నమ్మొద్దు, గట్టిగా ఆడు" అని చెప్పారు. 

నిజాలు బయట పెట్టిన ఫ్యామిలీ మెంబర్స్ 

సంజన కోసం.తల్లి అనిత, మేనల్లుడు జమీన్ వచ్చారు. తన పిల్లల గురించి కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకుంది సంజన. "ఏడవకు. ఎంత జెన్యూన్ గా ఉంటావో తెలుసు. ఇమ్మూ నీకు కొడుకులాంటివాడు. కానీ ఆ బాండింగ్ నిన్ను కిందకి లాగుతోంది".అని చెప్పారు. టాప్ 5లో సంజన, ఇమ్మూ, కళ్యాణ్, తనూజా, సుమన్ లకు టాప్ 5 ఇచ్చారు. "ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్ తో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు అలా ఉదయం 3 గంటల వరకూ తిరిగాము. ఉదయం 5.30కి గోవా వెళ్ళిపోయాము. 2 డేస్ తర్వాత డబ్బులు బొక్క అయ్యాయని అర్థం అయ్యింది. మా అమ్మకు ఫ్రెండ్ దగ్గర ఉన్నా అని అబద్దం చెప్పి, 2 డేస్ చిల్ అయ్యి వచ్చాము" అని తన సీక్రెట్ చెప్పింది రీతూ. తరువాత రీతూ బ్రదర్ జతిన్, ఎక్స్ కంటెస్టెంట్ అఖిల్ స్టేజ్ మీదకు వచ్చారు. "నెగెటివిటీ మొత్తం క్లియర్ అయ్యింది. పాజిటివిటితో బయటకు వస్తున్నావు. ఇమ్మూ బాగా ఎంటర్టైన్ చేస్తున్నావ్" అని చెప్పాడు. రీతూ, తనూజా, కళ్యాణ్, ఇమ్మూ, డెమోన్ కు టాప్ 5 ఇచ్చారు. డెమోన్ తో "రీతూను అలా నామినేషన్ లలో కాకుండా రెండు నిమిషాల ముందే మాట్లాడితే బెటర్ గా ఉండేది" అని చెప్పారు. అఖిల్ 'పుష్ప' కటౌట్ ను రీతూకి, 'భానుమతి'ని సంజనాకు ఇచ్చారు.

Also Read: 'బిగ్ బాస్'లో వీకెండ్ వార్... అతనికి సల్మాన్ ఖాన్ క్లాస్... హిందీలో ఏం జరుగుతోందంటే?

"మా ఫ్రెండ్ బాటిల్స్ తెచ్చి, దాచమని నాకిస్తే... సీక్రెట్ గా పైకెళ్ళి టేస్ట్ చేసేవాడిని" అని చెప్పాడు. "కంటేనే అమ్మ అంటే ఎలా కంటికి రెప్పలా చూసుకున్నా అమ్మే" అంటూ తనూజా సొంత తల్లి సావిత్రిని కాకుండా హరితను పిలిచారు. అలాగే సీరియల్ యాక్టర్ పవన్ సాయి వచ్చాడు. "లేడీ సింగం పర్ఫెక్ట్ గా ఆడుతున్నావ్, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను" అని చెప్పారు హరిత. తనూజా, రీతూ, భరణి, కళ్యాణ్, ఇమ్మూకి టాప్ 5 ఇచ్చారు. ఇక కటౌట్ 'అర్జున్ రెడ్డి'ని భరణికి ఇచ్చారు. "జాగ్రత్తగా చూసుకోండి. అది నాపిల్ల" అని చెప్పాడు పవన్. సంజనాకు 'చంద్రముఖి' ఇచ్చారు. "మిస్టర్ పుట్టస్వామి నా బిడ్డను నేను కప్పుతో చూడాలి అని ఎదురుచూస్తున్నారు. ముద్దు ముద్దు మాటలతో ముద్ద మందరం చెవిలో పెడుతుంది అని చాలామంది అన్నారు. అలాగే నీ చెవిలో పువ్వులు పెట్టే వాళ్ళు నీ చుట్టుపక్కల కూడా ఉంటారు జాగ్రత్త. ఆ పువ్వులను మాలలు కట్టి, వికసించేలా చేయాలి" అని చెప్పారు. 

పవర్ అస్త్రాతో ఎలిమినేషన్ క్యాన్సిల్ 

ఇప్పుడు డెమోన్ తాను దూరం నుంచి ఇష్టపడిన అమ్మాయి పేరు రమ్య అని, 10వ తరగతిలో ఇది జరిగిందని చెప్పాడు. డెమోన్ కోసం నాన్న దుర్గా ప్రసాద్, ఫ్రెండ్ పవన్ వచ్చారు. మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం అని ఆయన నాగార్జునతో చెప్పారు డెమోన్ తండ్రి. "ఇప్పటి వరకు బాగా ఆడావు. గేమ్ మీద ఫోకస్ చెయ్యి. ఆవేశపడకు. ఏడవకు... నిన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఆయన చాలా బాగున్నారు. నీకు బాధ కలిగించే విషయాలకు దూరంగా ఉండు. అది ఎవరైనా సరే" అని చెప్పాడు. డెమోన్, ఇమ్ము, సంజన, తనూజా, రీతూకి ఇచ్చారు. రేలంగి మామయ్య డెమోన్ కు, శివగామి సంజనాకు ఇచ్చారు. "బాహుబలి కంటే భళ్లాల దేవుడికే సపోర్ట్ చేస్తున్నారు" అని సంజనకు చెప్పారు. డెమోన్ ను ఫ్యామిలీ చేత సేఫ్ చేశారు. 

Also Read: 'బిగ్ బాస్ 9'కు షాక్ ఇవ్వబోతున్న స్టార్ హీరో.... హోస్ట్‌ చేయడం ఆపేస్తారా?

చివరగా ఎలిమినేషన్ ప్రాసెస్ ను పెట్టారు. భరణి - సంజన మిగలగా, ఇమ్మూని పవర్ అస్త్రా వాడి, ఎలిమినేషన్ ను క్యాన్సిల్ చేసే ఛాన్స్  ఇచ్చారు. "వాడినా వాడకపోయినా పవర్ పోతుంది" అంటూ పవర్ అస్త్రాను వాడాడు ఇమ్మూ. దివ్యకు లీస్ట్ ఓటింగ్ వచ్చింది అని చివర్లో వెల్లడించారు. 

Also Readబిగ్‌ బాస్ డే 72 రివ్యూ... చెల్లిని పెళ్లి కూతురును చేసి మురిసిన కెప్టెన్... సుమన్ శెట్టికి వైఫ్ వార్నింగ్ ఎందుకంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget