Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 72 రివ్యూ... చెల్లిని పెళ్లి కూతురును చేసి మురిసిన కెప్టెన్... సుమన్ శెట్టికి వైఫ్ వార్నింగ్ ఎందుకంటే?
Bigg Boss 9 Telugu Today Episode - Day 72 Review : బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. మరి ఎవరెవరి ఫ్యామిలీలు వచ్చాయంటే ?

బిగ్ బాస్ డే 72లో 'రీతూని చిన్న పిల్లలా చూశాను. నామినేషన్ లో యాక్ట్ చేస్తున్నాను అని ఆమె అన్నమాటలతో నాకు నిద్ర పట్టలేదు' అంటూ ఉదయాన్నే ఎమోషనల్ అయ్యింది సంజన. ఫ్యామిలీ వీక్ లో కంటెస్టెంట్స్ తమ కుటుంబాలతో కలిసి ఎంత సమయం గడపాలి అనే దాన్ని 'చిక్కుముడి' అనే టాస్క్ ద్వారా నిర్ణయించుకోండి. రోప్స్ ముడివిప్పి, ఫ్రేమ్ లోపలికి వెళ్ళి, మాగ్నెటిక్ బోర్డులో కావాల్సిన టైమ్ ను తీసుకోవాలి. మీ ఫ్యామిలీతో గడిపే ప్రతి నిమిషం, వారు మీకు తెలిపే ప్రతి విషయం ట్రోఫీ వైపుకు మిమ్మల్ని నడిపిస్తుందని మర్చిపోవద్దు. సంజన మీపై బిగ్ బాంబు ఉన్న కారణంగా సంజన సంచాలక్. అలాగే కెప్టెన్ అయిన కారణంగా తనూజా డైరెక్ట్ గా టైమ్ ను ఎంచుకోండి" అని ఆదేశించారు బిగ్ బాస్. తనూజా ఏకంగా 60 నిమిషాలు తెచ్చుకుంది. ఇమ్మాన్యుయేల్ 45, డెమోన్ 30, కళ్యాణ్ 20, సుమన్ 15, దివ్య 20 నిమిషాలు, రీతూ 15, భరణి 15 నిమిషాలు తీసుకున్నారు. కళ్యాణ్ తన 20 నిమిషాలు సుమన్ కి ఇవ్వడంతో సంజన, దివ్య మధ్య గొడవైంది.
సుమన్ శెట్టి 16వ మ్యారేజ్ యానివర్సరీ
మధ్యాహ్నం 2 గంటలకు సుమన్ శెట్టికి 'హ్యాపీ 16వ మ్యారేజ్ యానివర్సరీ' అంటూ ఆయన భార్య లాస్య రాసిన లెటర్ వచ్చింది. యానివర్సరీ గిఫ్ట్ గా కోట్ ను కూడా పంపారు. ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మిగతా ఇంటి సభ్యులతో టైమ్ స్వాప్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కానీ సుమన్ ఎవ్వరిని బాధ పెట్టను అని రిజెక్ట్ చేశాడు. తరువాత సుమన్ శెట్టి వైఫ్ లాస్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందరి బాగోగులు అడిగాక, ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. గేమ్ బాగా ఆడుతున్నావ్ అంటూ ప్రశంసలు కురిపించింది లాస్య. భార్యాభర్తలు ఇద్దరూ ప్రేమగా ఒకరికొకరు తినిపించుకున్నారు. "టాప్ 5లో ఉండాలి, విన్ అయితే ఇంకా హ్యాపీ. తనూజాతో తగ్గించండి. హైప్ లో ఉండేవాళ్లనే దగ్గర చేసుకుంటుంది. ఏడవద్దు" అని సలహా ఇచ్చి వెళ్ళిపోయింది లాస్య.
చెల్లిని పెళ్లి కూతురును చేసిన కెప్టెన్
తరువాత తనూజాను టైం స్వాప్ చేసుకోమంటే నో చెప్పేసింది. ఆమె ఫ్యామిలీ నుంచి బుజ్జి అతిథి వచ్చింది. "అను నువ్వు రా" అని తనూజా తన అక్కని పిలిస్తే... బిగ్ బాస్ 'ఇక నువ్వు వెళ్లొచ్చు' అని ఆమెను పాపతో పంపేశారు. తన అక్క కూతురు శ్రేష్ఠ అని అందరికీ పరిచయం చేసింది తనూజా. తన చెల్లి ఎంట్రీ ఇవ్వగానే "నువ్వు రావొద్దు అనుకున్నా" అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది తనూజా. పెళ్లి కూతురు పూజ అంటూ.తన చెల్లిని పరిచయం చేసింది. "తనే చెల్లి. కానీ అమ్మ లాంటిది" అని చెప్పింది. ఇక పూజా తనూజాతో "ఎక్కువ బాధ పడకు, ఏడవకు. అను అమ్మను నాకు హ్యాండిల్ చేయడం చాలా.డిఫికల్ట్ గా ఉంది. అర్థరాత్రి 12 గంటలకు కాల్ చేసి తనూజా ఏడ్చింది అని చెప్పి ఏడుస్తున్నారు. నా పెళ్లికి కొద్ది రోజులే ఉంది. టెన్షన్ లో ఉన్నాను. అమ్మ, అను, పెళ్లిని హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది. నువ్వు గేమ్ ఆడే విధానం అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు నువ్వే విన్ అవ్వాలి. అందరూ నిన్ను బయటా లోపలా బాగా సపోర్ట్ చేస్తున్నారు" అని చెప్పింది పూజా. మరోవైపు సంజన ఎమోషనల్ అయ్యింది. చివరికి పెళ్లి కూతురిని చేసి, ఆమెను సాగనంపారు బిగ్ బాస్.సుమన్ శెట్టి వైఫ్ లాస్య, పూజా టాస్క్ ఆడి హౌస్ మేట్స్ కు నెయ్యి, క్రీంను తెచ్చిపెట్టారు.





















