Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 70 రివ్యూ... తనూజాకు మళ్లీ క్లాస్... నాగచైతన్య ఎంట్రీ to గౌరవ్ గుప్తా ఎలిమినేషన్ వరకు సండే ఫన్ డే హైలెట్స్ ఇవే
Bigg Boss 9 Telugu Today Episode - Day 70 Review : శనివారం ఎపిసోడ్ లో నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యాక నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వెల్లడించారు. నేటి ఎపిసోడ్లో గౌరవ్ ఎవిక్ట్ అయ్యాడు.

బిగ్ బాస్ 9 డే 70 ఎపిసోడ్ మొదట్లో తనూజా - ఇమ్మాన్యుయేల్ గొడవను చూపించారు. "సేఫ్ గేమ్.అనేది కొన్నిచోట్ల మాత్రమే పనికొస్తది. 3 వీక్స్.తర్వాత మనం అస్సలు కలిసే లేము. అలాంటిది నేను నిన్ను ఎలా ముంచేస్తా?" అంటూ ప్రశ్నించింది తనూజా. "నేను బయట ఇమ్మూ ఫ్రెండ్. కానీ ఇక్కడికి వచ్చాక నాకంటే నువ్వే తనకు ఎక్కువ" అని రీతూ ఇమ్మూకి సపోర్ట్ చేసింది. "నా పేరు తీసి నువ్వు నన్ను బ్యాడ్ చేయొద్దు. పాయింట్ ఉంటే నామినేట్ చెయ్" అంటూ ఫైర్ అయ్యింది తనూజా. నాగ్ రాగానే ఇమ్మాన్యుయేల్, తనూజా అంటూ రెండు టీమ్స్ గా విడగొట్టారు. రెండు టీమ్స్ కి 'మూగ భాషలు' అనే టాస్క్ ఇచ్చారు. మూవీ క్లిప్స్ లో పాపులర్ డైలాగులను మ్యూట్ చేసి చూపిస్తే, కంటెస్టెంట్స్ వాటిని చెప్పాలి. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ టీమ్ విన్ అయ్యింది.
హర్ట్ చేసిన వాళ్లకు ఘాటు మిర్చి
"ఈ హౌస్ లో మిమ్మల్ని బాగా హర్ట్ చేసింది ఎవరో వాళ్ళకి మిర్చి.తినిపించాలి. ఇంటెన్సిటీని బట్టి ఎన్ని మిర్చీలు అనేది డిసైడ్ చేయాలి" అని చెప్పారు నాగ్. దివ్య కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదని భరణికి 1 మిర్చి, సంజన నన్ను ఎమోషనల్ డ్రామా క్వీన్ అంటాడు అంటూ గౌరవ్ కి, సుమన్ శెట్టి సంజనాకు, డెమోన్, రీతూ కళ్యాణ్ కు ఇచ్చారు. భరణి తనూజాకు ఇవ్వగా... నాకు మిర్చి పడదు అంటూ గుంజీళ్ళు తీసింది. దివ్యకు కెప్టెన్సీ టాస్క్ గురించి కళ్యాణ్, గౌరవ్ కెప్టెన్సీ టాక్ లో నిఖిల్ కు సపోర్ట్ చేయలేదని సంజనాకు, చీటి నామినేషన్ లో ఫ్లిప్ అయ్యాడు అంటూ ఇమ్మూ కళ్యాణ్ కు, రెబల్ టాస్క్ లో సపోర్ట్ చేయలేదు అంటూ డెమోన్ కు తనూజ మిర్చీలు ఇచ్చారు. 'శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగింది?' అంటూ తనూజా, ఇమ్మూ గొడవ గురించి అడిగారు నాగార్జున. తనూజా లేచి "3వ వారం తర్వాత మా ఇద్దరి మధ్య ఏం లేదసలు. వీకెండ్ రాగానే నా ఫోటో కన్పిస్తోంది లేదా పేరు విన్పిస్తోంది" అని చెప్పింది. "నేను ఆ ఫ్లాగ్ ను కూడా నీకు పాజిటివ్ గానే పెట్టాను" అని చెప్పాడు ఇమ్మూ. "నువ్వు తన వీక్నెస్ అనేది అతని జెన్యూన్ ఒపీనియన్ దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావ్. ఇంటెన్షన్స్ అర్థం చేసుకో. ఫీల్ అవ్వకు. సాగదీయకు" అని తనూజాకు అర్థం అయ్యేలా చెప్పారు నాగ్.
నాగచైతన్య ఎంట్రీ
అక్కినేని నాగ చైతన్య 'హైలెస్సా' సాంగ్ తో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడు. అందరికీ తన తనయుడిని పరిచయం చేసి, 'ఎందుకొచ్చావ్' అని అడిగాడు నాగ్. "ముందు శివ రీరిలీజ్ గురించి మాట్లాడతా. ఆ సినిమా వచ్చినప్పుడు నేను చాలా చిన్నోడిని. అందరూ కల్ట్ క్లాసిక్ అంటే విని ఎగ్జైట్ అయ్యేవాళ్ళము. ఇప్పుడు థియేటర్లలో చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి" అంటూ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాడు..నాగార్జున 'శివ' రీరిలీజ్ కు మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కు థాంక్స్ చెప్పారు. "నాకు రేసింగ్ అంటే బాగా పిచ్చి అని నీకు తెలుసు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఒక ఫెస్టివల్ ను స్టార్ట్ చేశారు. క్రికెట్ లాగా ఒక్కో ఏరియాకి ఒక్కో ఓనర్ ను అపాయింట్ చేశారు. నాకు హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ కి ఓనర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. నాలుగేళ్లు గా సైలెంట్ గా సాగుతోంది. ఈసారి బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు మనోళ్లు. జియో హాట్ స్టార్ లో ఈ రేసింగ్ ను చూడొచ్చు" అంటూ తమ టీంను పరిచయం చేశారు నాగ చైతన్య.
రేసింగ్ గురించి ముచ్చటించాక హౌస్ మేట్స్ ను పరిచయం చేశారు నాగార్జున. 'మీకు నేను పిచ్చి పిచ్చి అభిమానిని' అంటూ రీతూ నాగ చైతన్యకు పరిచయం చేసుకుంది. ఇక నాగ చైతన్య సమక్షంలో ఇంటి సభ్యులకు ఓ గేమ్ పెట్టారు బిగ్ బాస్. నాగ్ చేతిలో ఉన్న బొమ్మను చూసి, దాని స్పెల్లింగ్ ను బోర్డుపై సెట్ చేయాలన్నది టాస్క్. ఇందులో కూడా ఇమ్మాన్యుయేల్ టీమ్ విన్ అయ్యింది. దీంతో హౌస్ మేట్స్ కి పిజ్జా ట్రీట్ ఇచ్చారు నాగచైతన్య.
చివరికి గౌరవ్ - దివ్య నామినేషన్ లో మిగలగా, గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో గోల్డెన్ బజర్ ను వాడి గౌరవ్ ను సేవ్ చేసే ఛాన్స్ ను తనూజాకు ఇచ్చాడు నాగార్జున. ఒకవేళ గౌరవ్ ను సేవ్ చేస్తే దివ్య ఎలిమినేట్ అవుతుంది. కానీ తనూజా గోల్డెన్ బజర్ ను వదులుకొని, ఆడియన్స్ తీర్పును గౌరవిస్తానని చెప్పి, గౌరవ్ ను సాగనంపింది. వెళ్తూ గౌరవ్ హౌస్ మేట్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పాడు.





















