Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 69 రివ్యూ... సంజనాకు నో ఫ్యామిలీ వీక్... మ్యాన్ హ్యాండ్లింగ్ ఇష్యూ to నిఖిల్ ఎలిమినేషన్ - ఎపిసోడ్ హైలెట్స్
Bigg Boss 9 Telugu Today Episode - Day 69 Review : 10వ వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ అందరికీ అక్షింతలు వేశారు. మరి నేటి స్టార్టింగ్ నుంచి ఎలిమినేషన్ వరకు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటంటే?

డే 69 ఎపిసోడ్ లో నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన' సాంగ్ తో బ్యూటిఫుల్ ఎంట్రీ ఇచ్చారు. తరువాత శుక్రవారం ఏం జరిగిందో చూపించారు. స్టోర్ రూమ్ లో కూర్చుని "నన్ను చెఫ్ సంజయ్ సెల్ఫిష్ అనడం బాధ అనిపించింది" అని రీతూ మాట్లాడడంతో బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చింది. తరువాత సంజన, డెమోన్, భరణి ఉబర్ టాస్క్ విన్ అయ్యారు. దివ్య గతవారం వేసిన స్ట్రాటజీ ఎందుకు తప్పయింది అనేది వివరించింది సుమన్ కు. "మాధురి వెళ్తూ సంజనాతో దివ్య వాళ్ళ మదర్ కాల్ చేసి భరణి గారితో అంత క్లోజ్ గా ఉండొద్దు అని చెప్పారట. నువ్వెల్లి దివ్యకు చెప్పు" అని తనూజాను అడిగాడు భరణి. "పాజిటివ్ గా చెప్పినా వాళ్ళు నెగెటివ్ గా తీసుకుంటున్నారు" అంటూ చెప్పడానికి వెనకడుగు వేసింది తనూజా.
కత్తులు - క్లాప్స్
ఇక "అనుకున్నది సాధించావు" అంటూ ముందుగా కెప్టెన్ తనూజాకు కాంగ్రచులేషన్స్ చెప్పారు నాగార్జున. "ఇవన్నీ మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్న కత్తులు. వీటితోనే చెప్తాను మీ ఆట ఎలా ఉందో. పవన్ ఆల్రెడీ నీకు చెప్పాను ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండమని. మ్యాన్ హ్యాండ్లింగ్ అనే వాదన ఎందుకు వచ్చింది" అని అడిగారు నాగ్. అలాగే తనూజాని అసలేం జరిగిందని అడిగారు. "నింద పడింది తన మీద అయితే ఎందుకు కామ్ గా ఉంటాడు? దివ్య ఆర్డర్ చేసిందని హర్ట్ అయ్యావా? డెమోన్ తోశాడని హర్ట్ అయ్యావా" అంటూ వీడియోను ప్లే చేశారు. ఇక్కడ మగపిల్లలు, ఆడపిల్లలు, సుకుమారంగా ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేది ఉండదు. పవన్ టాస్క్ లో భాగంగా చేశాడు. ఒకవేళ దివ్య ఆర్డర్ చేయడం నీకు నచ్చకపోతే చెప్పు. చిన్న చిన్న వాటిని భూతద్దంలో చూడొద్దు. నెట్టడం తోయడం నీకు సమస్య కదా" అంటూ బుట్టలో బాల్ వేసిన టాస్క్ వీడియోను ప్లే చేశారు. "కానీ నేను పుష్ చేయలేదు. ఫస్ట్ వీడియోలో నాదే తప్పు. కానీ ఇందులో నా తప్పు లేదు" అని చెప్పింది తనూజా. "బుర్రలేకుండా బుద్ధి లేకుండా హౌస్ లో ఆడపిల్లని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడు అనే నిందలు వేయొద్దు కదా? అది కరెక్ట్ కాదని ప్రూవ్ చేయాలి కదా" అంటూ ఆమె కత్తిని విరగ్గొట్టేశారు నాగార్జున.
తరువాత సుమన్ శెట్టి - సంజన టవర్ టాస్క్ లో సంచాలక్ కళ్యాణ్ నిర్ణయం కరెక్ట్ అని తేల్చారు నాగార్జున. "మరి అన్నీ తెలిసినట్టు ఎందుకు వాదించావ్ ?" అని తనూజాను అడిగారు నాగ్. "నీ నిర్ణయం కరెక్ట్. కానీ వివరణ ఇవ్వడం బాలేదు. ఫెయిల్డ్ సంచాలక్. తనూజాతో ఆడిన టాస్క్ లో కావాలనే ఓడిపోయావా? కాన్సంట్రేషన్ పెంచుకో" అంటూ కళ్యాణ్ కత్తిని విరగ్గొట్టారు. "ఈ వారం బెస్ట్ సంచాలక్ రీతూ. ఎన్ని బాల్స్ ఉన్నాయో అన్నిసార్లు నిర్ణయం మార్చుకుంది. డిజాస్టర్ సంచాలక్ రీతూ" అంటూ చప్పట్లు కొట్టించి మరీ వీడియోను చూపించారు. "ఆఫ్ట్రాల్ ఏంటి అందరూ ఇంగ్లీష్ నేర్చుకుని రావాలా?" అని సంజనాను, ఎత్తుకోలేదని దివ్య అలగడం గురించి ప్రశ్నించారు నాగార్జున. భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టిల కామెడీకి క్లాప్ పడ్డాయి. "లాస్ట్ వీక్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్ నిఖిల్" అని ప్రశంసించారు. కన్ఫెషన్ రూమ్ లో డెమోన్ "రీతూకి తన ఫాదర్ లేరు. నేను నా ఫ్యామిలీ పిక్ వదులుకున్నా. నేను ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నా అనుకుంటారేమో అని" అని క్లారిటీ ఇచ్చాడు.
సంజనకు ఫ్యామిలీ వీక్ కట్
'ముంచేది తేల్చేది' అనే టాస్క్ ఇవ్వగా... ఇమ్మాన్యుయేల్ సంజన సపోర్ట్, ముంచేది తనూజా... కళ్యాణ్ తనూజా సపోర్ట్, ముంచేది సంజన... దివ్య వచ్చేసి సుమన్ బలం, బలహీనత భరణి... రీతూ బలం డెమోన్, బలహీనత తనూజా... నిఖిల్ సపోర్ట్ గౌరవ్, వీక్నెస్ సంజన... భరణి బలం సుమన్, బలహీనత దివ్య... సంజన సపోర్ట్ ఇమ్మూ, బలహీనత కళ్యాణ్... సుమన్ బలం భరణి, బలహీనత సంజన... గౌరవ్ బలం నిఖిల్, బలహీనత సంజన అని చెప్పారు. డెమోన్ బలం రీతూ, బలహీనత కళ్యాణ్... తనూజా సపోర్ట్ కళ్యాణ్, సింక్ చేసేది భరణి అని ఇచ్చింది. తరువాత నాగార్జున 'నో ఫ్యామిలీ వీక్' అనే బాంబును సంజనపై వేశారు. దీంతో "నేను ఇంటికి వెళ్ళిపోతాను నా వల్ల కాదు" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంజన. చివరికి "డబుల్ ఎలిమినేషన్ కు టైమ్ అయ్యింది" అంటూ నిఖిల్ ను ఎలిమినేట్ చేశారు.




















