Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే67 రివ్యూ... బీబీ రాజ్యంలో వారెవ్వా చెఫ్ రాయల్ డిన్నర్... కళ్యాణ్ చేజారిన కెప్టెన్సీ... తనూజాకు కలిసొచ్చిన లక్
Bigg Boss 9 Telugu Today Episode - Day 67 Review : గత 9 వారాలుగా కెప్టెన్సీ కోసం పోరాడుతున్న తనూజ ఎట్టకేలకు 10వ వారం కెప్టెన్సీ టాస్క్ విన్ అయ్యింది. మరి నేటి ఎపిసోడ్ లో జరిగిన విశేషాలు ఏంటంటే ?

బిగ్ బాస్ డే 67 ఎపిసోడ్ లో 'కోడికూర చిల్లుగారే' అంటూ వారెవ్వా చెఫ్ సంజయ్ తుమ్మాను హౌస్ లోకి పంపారు. ఆయనకు హౌస్ ను తిప్పి తిప్పి చూపించారు ఇంటి సభ్యులు. "రాజు రాణి ఎలా తింటారో అలాగే ఈరోజు కింగ్ క్వీన్స్ కు వండి పెట్టబోతున్నాము" అని చెప్పారు చెఫ్. సుమన్ శెట్టిని సాంబార్ తో పోల్చిన ఆయన, తనూజా లవబుల్, డెమోన్ బాహుబలి లాంటి పర్సనాలిటీ, ఇమ్మాన్యుయేల్ ను టెడ్డి బేర్ తో పోల్చాడు. పవర్ చెఫ్ ప్రణవ్ ను హౌస్ లోకి ఆహ్వానించారు. "రాయల్ ఫుడ్ అరేంజ్ చేస్తున్నాము. వీళ్ళు ఏమైనా వదిలేస్తే మీకు వడ్డిస్తాము" అని మిగతా హౌస్ మేట్స్ చెప్పారు. ఇక కింగ్ క్వీన్స్ కి క్యాండిల్ లైట్ డిన్నర్ ఇచ్చారు. అలాగే కమాండర్స్, ప్రజలకు కూడా విందు భోజనం ఆరగించే ఛాన్స్ ఇచ్చారు.
బీబీ రాజ్యంలో తిరుగుబాటు
నెక్స్ట్ డే ఉదయాన్నే "నిన్న ప్రజలను గట్టిగానే ఆడుకున్నారు" అంటూ తిరుగుబాటు మొదలుపెట్టారు ఇమ్మూ, భరణి. పక్కా ప్లానింగ్ తో ఈ పోరాటం మొదలు పెట్టారు. "మాకేమన్నా కంటెండర్షిప్ ఇచ్చారా? గేములు ఆడే ఛాన్స్ ఇచ్చారా? మీకు ఇంత చాకిరీ చేశాము. అయినా మమ్మల్ని పట్టించుకోలేదు" అంటూ రాజులను సూటిగా ప్రశ్నించారు. రాజులు నిఖిల్, కళ్యాణ్, రాణి రీతూ చౌదరి అందరినీ సమానంగా చూడాలని డిసైడ్ అయ్యారు. అయితే ప్రజలను సమాన హక్కులతో చూడాలి. కమాండర్ల పనులు వాళ్ళే చేసుకోవాలి, రాజ్యంలోకి ఇదరిద్దరూ ప్రజలు వస్తారు అనే డిమాండ్లను రాజు ముందు పెట్టారు ప్రజలు. అంతలోనే కమాండర్లు కూడా పోరాటం మొదలుపెట్టారు. దీంతో ప్రజలైన సుమన్, ఇమ్మాన్యుయేల్ ను పిలిచి పనిష్మెంట్ ఇచ్చింది రాణి.
Also Read: బిగ్ బాస్ డే 65 రివ్యూ... సుమన్ శెట్టికి అన్యాయం... ఇమ్మూ కూరగాయల కథ... కళ్యాణ్ vs తనూజా గొడవ
ఎట్టకేలకు కెప్టెన్సీ సాధించిన తనూజా
"రాణి రాజులు ఈ వారం ఎన్నో ప్రత్యేక హక్కులు పొందారు. ప్రత్యేకంగా ఇమ్యూనిటి కూడా దక్కించుకున్నారు. చివరిసారిగా మీ స్థానాన్ని కాపాడుకునే సమయం వచ్చేసింది. ఎవరైతే ఈ పోటీలో గెలిచి చివరి వరకూ వాళ స్థానాన్ని నిలబెట్టుకుంటారో వారు ఎంపరర్ గా మారడానికి, కెప్టెన్సీని దక్కించుకోవడం కోసం పోరాడతారు. నేనిచ్చే ఈ అవకాశంలో రాణి లేదా రాజుతో కమాండర్స్ పోటీ పడాల్సి ఉంటుంది" అని బిగ్ బాస్ ప్రకటించారు. రాజులు, రాణి ముగ్గురూ డిస్కస్ చేసుకుని కళ్యాణ్ ను ఈ టాస్క్ కోసం పంపారు. ప్రజలంతా కలిసి తనూజా, దివ్యను సెలెక్ట్ చేశారు.
"7 వారాల నుంచి నేను రేసులోనే లేను. ఒకసారి కెప్టెన్ అయితే మళ్ళీ కావొద్దా. ప్రతివారం నన్ను కెప్టెన్ అయ్యావు అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా నన్ను సపోర్ట్ చేస్తే, మీకు అవసరం అయినప్పుడు నేను ఉంటా" అని అందరినీ రిక్వెస్ట్ చేశాడు డెమోన్. అయినప్పటికి టాస్క్ కోసం తనను సెలెక్ట్ చేయలేదని బాధ పడ్డాడు. బిగ్ బాస్ పెట్టిన 'రేస్ ఆఫ్ ఫ్లోర్' అనే టాస్క్ లో కళ్యాణ్, తనూజా పాల్గొనగా... తనూజా విన్ అయ్యి రాణిగా నిలిచింది. అయితే నేటి ఎపిసోడ్ లో ఇంకా తనూజాను బిగ్ బాస్ కెప్టెన్ గా ప్రకటించలేదు.





















