Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 64 రివ్యూ... నామినేషన్లలో బుర్రబద్దలయ్యే షాక్... ఆ ఒక్కడు తప్ప అందరికీ డేంజరే
Bigg Boss 9 Telugu Today Episode - Day 64 Review : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 64లో నామినేషన్ల హీట్ పెరిగింది. హౌస్ మేట్స్ లో ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ఎవరెవరు నామినేట్ అయ్యారు? అంటే...

బిగ్ బాస్ డే 63 ఎపిసోడ్లో "మీరు అరవడం ఆడియన్స్ కు నచ్చింది కాబట్టి అలాగే అరుస్తూ ఉంటారా?" అంటూ డిస్కషన్ పెట్టింది దివ్య. అంతేకాకుండా అసలు భరణి అరిస్తే ఎందుకు బాగుంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. మరునాడు ఉదయాన్నే నామినేషన్ల గోల మొదలైంది. "కళ్యాణ్ తప్ప ఎవ్వరికీ వ్యాలీడ్ రీజన్ లేదు" అంటూ డైరెక్ట్ గా భరణితోనే చెప్పింది దివ్య. "అందరితోనూ బాండింగ్ ఉంది. కానీ ఒక బాండింగ్ ను పట్టుకుని అక్కడే ఆగిపోయారు జనాలు" అంటూ భరణి వివరణ ఇచ్చాడు. "నిఖిల్ ను ఎందుకు నామినేట్ చేయవు? ఫైర్ స్టార్మ్, గేమ్ ఏది అని చెప్పొచ్చు" అంటూ భరణిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది దివ్య.
మధ్యాహ్నం "ఈ వారం నామినేషన్లు మీ అంచనాలను తలకిందులు చేస్తాయి. ఒక్కొకరు ఒక్కరిని మాత్రమే, బలమైన మీ కారణాలతో 5 నిమిషాల్లోనే నామినేట్ చేసి, అంతరం వారిని పక్కనే ఉన్న షవర్ కింద నిలబెట్టడండి. మీరు చెప్పే ప్రతి మాట మీరు నామినేట్ చేసేవారికి గుచ్చుకుంటే సరిపోదు ప్రేక్షకుల్లోకి చొచ్చుకుంటేనే మీ ప్రయాణం ముందుకు సాగుతుంది" అంటూ ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఇమ్మాన్యుయేల్ "మీరు కంటెండర్షిప్ విషయంలో గివప్ ఇచ్చారు. మీ గురించి మీరు స్టాండ్ తీసుకోకుండా నాకంటే బెస్ట్ ప్లేయర్ తనూజా అనడం, మీ గురించి మీరు ఫైట్ చేయకపోవడం, ఆట ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ మీ కళ్లలో కన్పించిన కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు" అంటూ భరణిని నామినేట్ చేశాడు. "పర్టికులర్ పాయింట్ లో తనూజా నాలుగు సార్లు చివరిదాకా వచ్చిపోయింది. ఇందులో ఫేవరిటిజం ఏం లేదు. నేను జెన్యూన్ గానే తనూజాకు ఇచ్చాను" అని చెప్పారు భరణి.
రీతూ వర్సెస్ దివ్య
తరువాత రీతూ వచ్చేసి దివ్య పేరు చెప్పింది. "నీ రీజన్ చెప్పు" అని దివ్య అనడంతో,."కెప్టెన్సీ టాస్క్ లో నన్ను తీసేయాలని సాయిని మానిప్యులేట్ చేశావ్. నేను లాస్ట్ ప్రయారిటీ అని చెప్పావ్. నువ్వు చెప్పిదనల్లా చేయడానికి కొంతమందిని ఉంచుకుంటావ్. అలాగే వాళ్లను టైమ్ వచ్చినప్పుడు బాణాల్లా వదులుతావు. భరణి లేనప్పుడే బాగా ఆడావు. ఓవర్ స్మార్ట్. నిన్న నేను ఆడలేను కాబట్టి ఇమ్మాన్యుయేల్ కు రీతూని ఇచ్చాను అన్నావ్. నా గురించి డిసైడ్ చేయడానికి నువ్వెవరు ?" అంటూ మాటల దాడి చేసింది రీతూ. దివ్య సమాధానం ఇస్తూ "తనూజాకు సపోర్ట్ చేస్తా అన్నాడు సాయి. ఆమెకు రీతూ కాంపిటీషన్ అన్నాడు కాబట్టి అలా చేసాను. నేను చెప్తే వినడానికి వాళ్లేమన్నా చిన్న పిల్లలా? వింటే నీ ప్రాబ్లం ఏంటి?" అని అడిగింది దివ్య. "ఈరోజు వాళ్ళు ఇద్దరు రేపు ఇంకొకళ్ళు... ఆ ఎఫెక్ట్ నాపై కూడా పడొచ్చు. నిన్ను చూసి భయపడుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. అది మార్చుకో" అంటూ రీతూ.ఇచ్చిపడేసింది. "నువ్వు డెమోన్ గేమ్ ను పాడు చేశావ్. నీకు భయమేసి నామినేట్ చేశావ్" అని ఫైర్ అయ్యింది దివ్య.
గౌరవ్ సెల్ఫిష్ అని సంజనాను, నిఖిల్ ను పర్సనాలిటీ బయటకు రాలేదు అని కళ్యాణ్, కెప్టెన్సీ నుంచి ఎలిమినేట్ చేశాడు అంటూ నిఖిల్ ను సుమన్ శెట్టి, నీకు గేమ్ అర్థం కాదని నా ఫీలింగ్ అంటూ దివ్య గౌరవ్ ను, తనూజా, డెమోన్, సంజన కూడా గౌరవ్ నే నామినేట్ చేశారు.
భరణి వర్సెస్ దివ్య
చివరగా భరణి వచ్చి "నా నామినేషన్ దివ్య. అందరూ నా గేమ్ కనపడట్లేదు అంటున్నారు. గేమ్ ఆడకుండా 5 టైమ్స్ నేను కెప్టెన్సీ టాస్క్ లోకి రాను. నావల్ల ఎవరెవరు ఎలాంటి పరిస్థితిలో హెల్ప్ పొందారో అందరికీ తెలుసు. దివ్య వల్ల నా గేమ్.పాడయింది అన్నారు. బయటకు వెళ్ళి వచ్చాక నాకు కూడా అదే డౌట్ ఉంది. అది తప్పని నువ్వు ప్రూవ్ చేసుకుంటావ్ అని నామినేట్ చేస్తున్నా" అని చెప్పాడు భరణి. దీంతో ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది.
"ఇప్పుడు నావంతు... ఈ వారం మీ అందరినీ నామినేట్ చేస్తున్నాను" అంటూ బిగ్గెస్ట్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. అలాగే కెప్టెన్ ను నామినేట్ చేయాలా వద్దా అనేది సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా నిర్ణయించారు. భరణి మినహా అందరూ ఇమ్మాన్యుయేల్ కు ఇమ్యూనిటి ఉండాలని ఓటు వేశారు. దీంతో ఇమ్మూ నామినేషన్ నుంచి సేవ్ అయ్యాడు.





















