Bigg Boss 9 Telugu: 'శివ' రీ రిలీజ్ ప్రమోషన్స్ to రామూ రాథోడ్ ఎలిమినేషన్ వరకు... శనివారం బిగ్ బాస్9 ఎపిసోడ్ విశేషాలు
Bigg Boss 9 Telugu Today Episode - Day 62 Review : బిగ్ బాస్ సీజన్ 9 వేదికపై నాగార్జున 'శివ' మూవీ ప్రమోషన్స్ తో నేటి ఎపిసోడ్ ను స్టార్ట్ చేశారు. మరి నేటి ఎపిసోడ్ లో జరిగిన విశేషాలు ఏంటంటే ?

కల్ట్ క్లాసిక్ 'శివ' మూవీ సాంగ్స్ పెర్ఫార్మెన్స్ తో నేటి ఎపిసోడ్ ను స్టార్ట్ చేశారు నాగార్జున. "విత్ మై డియరెస్ట్ అమల" అంటూ తన సతీమణిని ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ వేదికపై చూపించారు. "36 ఏళ్ల క్రితం వచ్చిన శివ మూవీ మళ్ళీ నవంబర్ 14న రిలీజ్ కానుంది. అమలతో డ్యాన్స్ చేస్తానని మీకిచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. మీరు కూడా మీ మాట నిలబెట్టుకోవాలి. ఇక శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం" అంటూ ఎపిసోడ్ లోకి తీసుకెళ్లారు.
పీక్స్ లో 'శివ' రీరిలీజ్ ప్రమోషన్స్
సంజన ఖర్బుజా పండును దొంగతనం చేయగా, నిఖిల్ - సాయిలతో కలిసి తిన్నది. కెప్టెన్సీ టాస్క్ గురించి రీతూ - తనూజా మాట్లాడుకున్నారు. "నాపై కక్ష దేనికి? నేను నాన్నా అనగానే ఆయన నా దగ్గరకు రావడం ఆమెకు నచ్చలేదేమో" అంటూ తనూజా తన అభిప్రాయాన్ని చెప్పింది. మరోవైపు "ఇమ్మాన్యుయేల్ దగ్గర దివ్య నాతో ఒకమాట చెప్పి ఉండాల్సింది అని అన్నాను" అంటూ దివ్యకు నచ్చజెప్పబోయారు భరణి. "మీరు పోటీలో లేనప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? అందరి ముందు ఆమె ఎలిగేషన్స్ చేసినప్పుడు మీరు అందరి ముందే స్టాండ్ తీసుకోవాలి. ఆమె ఏడుస్తుంది అని అక్కడే ఉన్నారు. కానీ నా దగ్గరకు రావాలి అనిపించలేదా?" అంటూ దివ్య స్టార్ట్ చేసింది. "అందరికన్నా నాకు నువ్వే ముఖ్యం" అని ఆమెను సముదాయించాడు.
తనూజా - కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ - దివ్య, రీతూ - డెమోన్, సంజన - రీతూ జంటలుగా డ్యాన్స్ 'శివ' సినిమాలో సాంగ్స్ కి డ్యాన్స్ చేశారు. "4k డాల్బీ అట్మోస్ సౌండ్ తో అన్నపూర్ణ స్టూడియో 50వ ఏడాది సందర్భంగా ఈ మూవీని రీరిలీజ్ చేయాలనుకున్నాము. రీక్రియేషన్ కు 8 నెలల టైమ్ పట్టింది. మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్తాము" అంటూ హౌస్ మేట్స్ కి చెప్పారు నాగ్. "ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ?" అని కళ్యాణ్ అడిగాడు. "వర్మకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కాన్ఫిడెన్స్ కనిపించింది. అది బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్" అని చెప్పారు నాగ్. "ఫిల్మ్ విత్ హార్ట్" అంటూ ఒక్కమాట తో తేల్చింది అమల. 'శివ'లో 'సరసాలు చాలు శ్రీవారు' సాంగ్ ఇష్టమని చెప్పారు నాగ్. తరువాత రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చి "శివ 2 స్టార్స్ కలిసినప్పుడే. శివ అనేది పవర్ ఫుల్ కాబట్టి ఈ సినిమాకు ఆ పేరు పెట్టాము. సందీప్ వంగా బ్రిలియంట్ డైరెక్టర్ ఈ జనరేషన్ లో. హైదరాబాద్ లో దాదా అని ఉండేవారు. వాళ్ళు సైకిల్ చెయిన్ తో ఆయుధం చేయడం చూశాను. నాగార్జున రౌడీ కాదు హీరో. అప్పటికప్పుడు వెపన్ రావాలి. కాబట్టి ఆ సైకిల్ చెయిన్ విరగ్గొట్టేలా ప్లాన్ చేశాను" అంటూ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. అలాగే రీరిలీజ్ ట్రైలర్ ను ప్లే చేశారు.
టాప్ 6 కంటెస్టెంట్స్ కి స్పెషల్
నెక్స్ట్ హిట్ ఫ్లాప్ కంటెస్టెంట్స్ ను డిసైడ్ చేసే బాధ్యతను ఆడియన్స్ కు ఇచ్చారు నాగ్. సుమన్ 100% హిట్, సంజన 57% ఫ్లాప్, ఇమ్మూ 95% ఫ్లాప్, శ్రీనివాస్ సాయి 76% ఫ్లాప్, నిఖిల్ 55% ఫ్లాప్, గౌరవ్ 69% హిట్, డెమోన్ 72% హిట్, దివ్య 73% ఫ్లాప్, రీతూ 78% హిట్, రామూ 59% హిట్, కళ్యాణ్ 78% హిట్, తనూజా 93% హిట్, భరణి 65% ఫ్లాప్ అని తీర్పు ఇచ్చారు ఆడియన్స్. టాప్ 6 హిట్ అనిపించుకున్న కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పారు నాగ్.
మొదటి ప్లేస్ లో ఉన్న సుమన్ శెట్టి డైరెక్ట్ కంటెండర్షిప్ కావడానికి భరణి ఫ్యామిలీ వీక్ ను సాక్రిఫైజ్ చేయడాన్ని ఒప్పుకోలేదు. ఇమ్మాన్యుయేల్ గర్ల్ ఫ్రెండ్ వాయిస్ మేసేజ్ కోసం గౌరవ్ బిగ్ బ్లెస్సింగ్ పవర్ పీకేశాడు. తనూజాకు కళ్యాణ్ ను సీజన్ మొత్తం నామినేట్ చేయాలనడంతో త్వరలో పెళ్లి కాబోతున్న తన సిస్టర్ వాయిస్ నోట్ ను రిజెక్ట్ చేసింది. కళ్యాణ్ వీక్ అంతా చికెన్, మటన్ కోసం నిఖిల్ రెండు వారాలు నామినేట్ కావాలంటే ఒప్పుకోలేదు. కానీ తనూజా కోసం రెండు వారాలు నామినేట్ కావడానికి రెడీ అయ్యాడు. తనూజా అందుకు ఒప్పుకోలేదు. దీంతో నెక్స్ట్ 2 వీక్స్ నువ్వు నామినేట్ అవ్వవు అంటూ కళ్యాణ్ ను పంపేశాడు. రీతూ తన తండ్రి షర్ట్ కోసం సంజన శారీస్ ను పంపించింది. డెమోన్ పవన్ తన ఫ్యామిలీ ఫోటోను త్యాగం చేసి రీతూ ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాడు. ఆ తరువాత ఎవరు ఎవరిని దేనికోసం త్యాగం చేశారో వెల్లడించారు. చివరగా నాగ్ ఎంత చెప్పినా వినకుండా రామూ సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు.





















