Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 59 రివ్యూ... ఘోస్ట్ రూంలో గడబిడ... పట్టుబడ్డ రెబల్స్ సుమన్ శెట్టి, దివ్య... ప్రోమో అంతా తూచ్
Bigg Boss 9 Telugu Today Episode - Day 59 Review : బిగ్ బాస్ సీజన్ 9లో 9వ వారం ఆట ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుండగా, ఈ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారంటే?

బిగ్ బాస్ డే 59లో రేషన్ మేనేజర్ రీతూ చౌదరి "పాలు ఎవరో లేపేసారు" అని చెప్పడంతో ఉదయాన్నే రచ్చ మొదలైంది. ఎప్పటిలాగే అందరూ సంజనా పైనే అనుమానపడ్డారు. నిఖిల్ మాత్రం "సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో. దివ్య చేసినట్టు ఉంది" అంటూ కరెక్ట్ గా గెస్ చేశాడు. 8 పాల ప్యాకెట్లను కొట్టేసిన సుమన్ శెట్టి, దివ్య మాత్రం సీక్రెట్ టాస్క్ ను పూర్తి చేసి, సుద్దపూసల్లా అందరితో కలిసి పాలను ఇళ్లంతా వెతకడం మొదలెట్టారు. "తెలియకుండా ఆడుతూ ఆడుతూ పాలను ఏమైనా తీశావా నాన్నా?" అంటూ ఇమ్మూ సంజన దగ్గర నుంచి కూపీలాగే ప్రయత్నం చేశాడు. కానీ ఆవిడ కాదని తేలిపోయింది. తనూజా రీతూపై అనుమానం వ్యక్తం చేయగా, రామూ "దీనికి రేషన్ మేనేజర్ దే బాధ్యత" అని అన్నాడు. ఇక దివ్య "ఫుడ్ విషయంలో ఎంత సీరియస్ అవుతుందో తెలుసా? ఎవరు తీశారో చెప్పండి" అంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. మధ్యాహ్నం గడిచినా విషయం తేలలేదు.
ఆమ్లెట్ రచ్చ... అర్థం చేసుకోని గౌరవ్
"నేను వంట చేస్తుంటే నువ్వేం చేస్తావ్? ఇక్కడ ఆమ్లెట్ వేయాలి కదా" అంటూ గౌరవ్ పై కెప్టెన్ దివ్య ఫైర్ అయ్యింది. "స్నానానికి వెళ్ళాను" అంటూ బాటిల్స్ నింపడంలో రీతూకి హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు గౌరవ్. దీంతో "నువ్వు చేయాల్సి పని చెయ్యి. కూరగాయలు కట్ చేసి వెళ్ళు స్నానానికి" అని చెప్పింది రీతూ. "ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ ఉంది కదా తినండి. లంచ్ టైంకి చేస్తా" అని గౌరవ్ చెప్పడంతో... "నీ కెప్టెన్సీ ఏంటి? సజెషన్స్ ఎందుకు ఇస్తున్నావ్?" అని కెప్టెన్ మండిపడింది. రీతూ డైరెక్ట్ గా కిచెన్ టీంలో గౌరవ్ వద్దని కుండబద్దలు కొట్టింది. దీంతో గిన్నెలు కడుగుతానని చెప్పి, వాష్ రూమ్ లో "అందరూ ఫేక్... ఒంటరివాడ్ని అయిపోయాను" అని ఆవేదన వ్యక్తం చేశాడు గౌరవ్.
"నువ్వు చేయలేవు. కాబట్టి నిన్ను వాష్ రూమ్ కి ఛేంజ్ చేస్తా" అని కెప్టెన్ చెప్పింది. "నేను వాష్ రూమ్ చెయ్యను" అని గౌరవ్ తేల్చడంతో, "మిల్క్ విషయంలో తప్పు ఎవరిది? నాకు పాలు కావాలి. ఇప్పుడు ఎలా?" అని అడిగాడు గౌరవ్. "నీపై చాలా కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి నీకు డిపార్ట్మెంట్ మార్చాను. రేషన్ మేనేజర్ అన్నీ పనులు సవ్యంగా చేసింది. పాలు మిస్ అవ్వడం అనేది వ్యాలీడ్ రీజన్ కాదు. ఆమెను తీసేయడానికి. నీకు రివేంజ్ కావాలంటే నామినేషన్ లో చూసుకుందాం. కెప్టెన్ గా నేను నీకు వాష్ రూమ్ ఆప్షన్ ఇస్తున్నా. చేయకపోతే ఫుడ్ ఉండదు" అని సీరియస్ గా వెళ్లిపోయింది. "నేను ఎంత పిలిచినా నువ్వు రావట్లేదు. నన్ను తప్పులు పడుతున్నావ్" అని రీతూ మండిపడగా, "నేనేం మీ సర్వెంట్ కాదు" అని గౌరవ్ అరిచాడు.
ఇక సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి కావడంతో కంటెండర్ టాస్క్ నుంచి నిఖిల్ ను తీసేశారు దివ్య, సుమన్. "రెబల్ ను గుర్తు పట్టడానికి ఇదే మంచి సమయం. రీజన్స్ తో ఎక్కువ మంది ఎవరి పేఋ చెబితే వాళ్ళు ఈ టాస్క్ నుంచి అవుట్ అవుతారు" అని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో డెమోన్ కి ఎక్కువ ఓట్లు పడగా, ఆయన టాస్క్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. "చాలా తెలివిగా పవన్ ను రెబల్.అనుకున్నారు. కానీ అది తప్పు. రెబల్స్ ఇంకా మీ మధ్యే ఉన్నారు" అంటూ షాక్ ఇచ్చారు బిగ్ బాస్.
రీతూ వర్సెస్ తనూజా
డెమోన్ ను ఇలా కంటెండర్ టాస్క్ నుంచి తప్పించడంతో తనూజా - రీతూకి మధ్య మాటా మాటా పెరిగింది. "మీరు బాగా ఆలోచిస్తున్నారని మీ హెయిర్ స్టైల్ చెబుతోంది. వెనక్కి తిరిగి అందరినీ చూడండి. నిఖిల్ ను రెబల్స్ టాస్క్ నుంచి తప్పించారు" అని ఇమ్మాన్యుయేల్ తో సెటైరికల్ గా చెప్పారు బిగ్ బాస్. తరువాత "టచ్ ఇట్ స్మెల్ ఇట్ గెస్ ఇట్" అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఆరెంజ్ టీం నుంచి తనూజా విన్ అయ్యింది. కానీ టాస్క్ పూర్తి కాగానే, నావల్ల కాదు అని బోరున ఏడుస్తూ బయటకు పరుగులు తీసింది. తరువాత రీతూ "పులి ఆడపులి" అంటూ ఎంట్రీ ఇచ్చి, భయపడింది. దివ్య ఈ టాస్క్ ను అస్సలు భయపడకుండా చేసింది. అంతలోగా గౌరవ్ సీక్రెట్ టాస్క్ చిట్స్ ను కనిపెట్టి ఇమ్మాన్యుయేల్ కు ఇచ్చాడు.





















