(Source: ECI | ABP NEWS)
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 58 రివ్యూ... సింగిల్‌గా సంజన... మిడ్ నైట్ సీక్రెట్ టాస్కులతో సుమన్ శెట్టి - దివ్య అరాచకం
Bigg Boss 9 Telugu Today Episode - Day 59 Review : 9వ వారం నామినేషన్ల రగడ సోమవారమే పూర్తి కావడంతో, నేటి ఎపిసోడ్ లో 3 టీమ్స్ కు కెప్టెన్సీ కంటెండర్, సీక్రెట్ టాస్కులు పెట్టారు బిగ్ బాస్.

బిగ్ బాస్ డే 58లో నామినేషన్ల అనంతరం హౌస్ మేట్స్ మధ్య డిస్కషన్ నడిచింది. ఎవరికి వారే తమ లాజిక్స్ ను సమర్థించుకున్నారు. ఇక నామినేషన్లలో ఒకరిపై ఒకరు ఫైర్ అయిన తనూజా - ఇమ్మాన్యుయేల్ తమ మధ్య ఉన్న గొడవలను సారీలతో సరిచేసుకున్నారు. "నిఖిల్, గౌరవ్ లను నామినేట్ చేయాల్సింది" అని భరణి అనగా, "నేనెందుకు చేస్తాను? ప్రతివారం విడిచిపెట్టి, డైరెక్ట్ నామినేషన్ పవర్ వస్తే ఇప్పటికి కూడా ఎందుకు నామినేట్ చేయను" అంటూ తనూజ గురించి భరణిని నిలదీసింది దివ్య.
తనూజాను నమ్మని హౌస్ మేట్స్
బిగ్ బాస్ పెట్టిన ఫోన్ ను చూసి హౌస్ మేట్స్ ఫ్యామిలీ.నుంచి ఫోన్ వస్తుందేమోనని తెగ సంబరపడ్డారు. కానీ బిగ్ బాస్ వాళ్ళ సంతోషంపై నీళ్ళు చల్లుతూ, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ చేశారు. అందులో ముందుగా తనూజాతో ఫోన్ మాట్లాడుతూ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయ్యిందని అందరికీ చెప్పమన్నారు. అయితే ఆమె మాటను ఒక్కరు కూడా నమ్మలేదు సరికదా... పైగా సీక్రెట్ టాస్క్ ఏమో అంటూ అనుమానపడ్డారు.
ఆ తరువాత ఫోన్ ను సంజనా లిఫ్ట్ చేయగా, రీతూకి ఇవ్వమని చెప్పి "తనూజాను నమ్ముతున్నావా" అని అడిగారు. ఆమె లేదని చెప్పడంతో "నమ్మకమే ఈ టాస్క్ లో ముఖ్యం. టాస్క్ ఇప్పటికే మొదలైంది. స్టోర్ రూమ్ నుంచి లేఖను తీసుకుని వివరాలు తెలుసుకోండి" అని చెప్పారు. "ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైంది. మీ మధ్యలోనే ఒక రెబల్ ఉన్నారు. వాళ్ళే మిమ్మల్ని టాస్క్ నుంచి తప్పిస్తారు. ఆ డేంజర్ నుంచి తప్పించుకోవడానికి టాస్క్ లు ఇస్తాను" అంటూ హౌస్ మేట్స్ ను టీంలుగా విడగొట్టారు బిగ్ బాస్. తనూజా- ఇమ్మాన్యుయేల్ - గౌరవ్ ఆరెంజ్ టీం, రీతూ - భరణి - నిఖిల్ బ్లూ టీం, కళ్యాణ్ - దివ్య- సాయి పింక్ టీం. మిగిలిన వాళ్ళలో ఆరెంజ్ రామూ, పింక్ సుమన్ శెట్టి, బ్లూ డెమోన్ పవన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. సంజన సింగిల్ గా మిగిలిపోగా, ఆమెను కంటెండర్ టాస్క్ నుంచి తప్పించారు.
అర్ధరాత్రి దొంగల్లా సుమన్ - దివ్య చిలిపి పనులు
తరువాత సుమన్ వంతు వచ్చింది. "ఈ టాస్క్ లో మీరే రెబల్. మీకిచ్చే సీక్రెట్ టాస్క్ లు విన్ అయితే మీరు కంటెండర్ అవ్వొచ్చు. సీక్రెట్ టాస్క్ చేస్తున్నప్పుడు పట్టుబడితే టాస్క్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిస్తే ఎవరో ఒకరిని ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేసే పవర్ ఉంటుంది. బాత్రూమ్ వాష్ బేసిన్ కింద ఒక చిట్ ఉంది. అందులో ఉన్న టాస్క్ ను పూర్తి చేయండి" అని చెప్పారు బిగ్ బాస్. దివ్యకు సుమన్ రెబల్ అని స్వయంగా చెప్పేశారు బిగ్ బాస్. "రెండో రెబల్ దివ్య".అంటూ సుమన్ చేయాల్సిన సీక్రెట్ టాస్క్ ను ఇద్దరినీ కలిసి పూర్తి చేయమన్నారు. మొదటి సీక్రెట్ టాస్క్ ముగ్గురు సభ్యులను వారు కూర్చున్న ప్లేస్ నుంచి లేపి, వీళ్ళు కూర్చోవడమే. ఈ టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.
చివరగా 'సీసా బ్యాలెన్స్' అనే టాస్క్ ఇవ్వగా, అందులో ఇమ్మాన్యుయేల్ టీమ్ గెలిచింది. కళ్యాణ్ ను కెప్టెన్సీ కంటెండర్ రేసు నుంచి తప్పించారు. తనూజా టీంకు సేఫ్ గ్రీన్ కార్డ్ ఇవ్వగా, దాన్ని ఇమ్మాన్యుయేల్ కు ఇచ్చారు. రాత్రి 2 గంటల 45 నిమిషాలకు ఒక టెట్రా ప్యాకెట్ పాలు తాగాలి, హౌస్ మేట్స్ కి తెలియకుండా పాలన్నిటినీ స్టోర్ రూమ్ లో పెట్టేయాలి. దీన్ని కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు దివ్య, సుమన్.





















