Bigg Boss 9 Telugu : దివ్య చేజారిన క్వీన్ పదవి... నిఖిల్ కొత్త కింగ్... రీతూతో సరసాలు - ఇమ్మాన్యుయేల్ కు కింగ్ పనిష్మెంట్
Bigg Boss 9 Telugu Today Episode - Day 66 Review :బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కింగ్ అండ్ క్వీన్స్ అనే కెప్టెన్సీ టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. డే 66లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చోటు చేసుకున్నాయి.

ఉదయాన్నే "మీరు క్వీన్స్ అయితే మేము భయపడాలా?" అంటూ తనూజా ఫన్నీ కన్వర్జేషన్ మొదలుపెట్టింది. "అప్పుడు భయపడ్డావ్ ఇప్పుడు వణుకుతూ రావాలి" అంటూ రీతూ కామెంట్ చేసింది. "గంట తర్వాత డిప్ప పగులుతుందో లేదో చూపిస్తాను" అంటూ భరణికి దివ్య వార్నింగ్ ఇచ్చింది. ఇక 11 గంటలకు డ్యూటీ ఎక్కారు కింగ్ క్వీన్స్. లెమన్ జ్యూస్, ఫుడ్ ఆర్డర్ చేశారు. తర్వాత తింటూ ఇమ్మాన్యుయేల్ ను గుచ్చి గుచ్చి చూసింది రీతూ. "మహారాణికి నాపై కన్ను పడినట్టు ఉంది" అంటూ రాజుకు కంప్లైంట్ చేశాడు ఇమ్మూ. రాణి చెయ్యి లాగమనగానే ఇమ్మూ అదే చేయడం... అది చూసిన దివ్య రాజు కళ్యాణ్ తో "అక్కడ రీతూ రాణి ఎందుకు నవ్వుతోంది" అని అడగడం జరిగింది. "ఇమ్మాన్యుయేల్ తో సరసాలు ఆడుతోంది" అంటూ ఇమ్మూని పిలిచాడు కళ్యాణ్. "మహారాణి గారు నన్ను పని కోసం పిలిచారు. నాకు పెళ్లికాలేదు, ఓరకంట చూసింది నన్ను. పని చేసే నెపంతో నన్ను పక్కకు పిలిచారు" అంటూ అమాయకుడిలా మొహం పెట్టాడు. "అతనే అదోలా చూశాడు. నువ్వు లేని టైమ్ చూసి ఎందుకలా బిహేవ్ చేశాడో తెలియలేదు" అని రీతూ చెప్పడంతో "నీమీద చెయ్యి వేసిన వాడికి వేసే శిక్ష ఇదే" అంటూ కత్తితో ఇమ్మూకి పనిష్మెంట్ ఇచ్చాడు కింగ్.
డెమోన్ - తనూజా ఫైట్
నెక్స్ట్ "చిరునవ్వు చూపించండి వీణ స్టెప్ తో" అంటూ క్వీన్స్ సుమన్ శెట్టిని ఆదేశించారు. పిలిచినప్పుడల్లా అదే స్టెప్ వేయాలని ఆదేశించారు. అలాగే భరణికి కూడా అలాగే చెప్పారు. ఇమ్మాన్యుయేల్ ను పిలిచి కమాండర్ల గురించి ఒపీనియన్ అడిగారు. 'ముఠా మేస్త్రి' స్టెప్ వేయించారు. కమాండర్ తనూజాను కిచెన్ స్లాబ్ పై ఎక్కించమని కమాండర్లు డెమోన్, నిఖిల్ లను ఆదేశించారు. "అబ్బాయిలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి?" అంటూ తనూజా ఫైర్ అయ్యింది. "వాళ్లేం నిన్ను ముట్టలేదు" అని దివ్య క్లారిటీ ఇచ్చింది. ఈ విషయమై డెమోన్ తో గొడవ పడింది తనూజా.
నిఖిల్ ను వరించిన అదృష్టం
మధ్యాహ్నం "ఈ రణరంగంలో మరో యుద్ధం జరగబోతోంది. కమాండర్స్ గా తమ స్థానాలను నిలబెట్టుకోవడానికి, ప్రజలు కమాండర్లుగా మారడానికి జరిగే ఈ చివరి యుద్ధంలో ఇద్దరు కమాండర్లు ఒక జట్టుగా, ఇద్దరూ ప్రజలు ఒక జట్టుగా ఆడాలి. ఏ ఇద్దరు కమాండర్లు ఈ పోటీలో పాల్గొనాలి, ఏ ఇద్దరు ఈ పోటీలో పాల్గొనకుండానే ఇమ్యూనిటి అందుకోవాలి అన్నది కింగ్ అండ్ క్వీన్స్ నిర్ణయించాలి. పవన్, నిఖిల్ ప్రజలతో పోటీ పడాలని ఆదేశించారు కింగ్. సాయంత్రానికి కమాండర్లు తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, సామాన్యులు కమాండర్లు కావడానికి "నిలబెట్టు పడగొట్టు గెలుపొందు" అనే టాస్క్ ఇచ్చారు. ఈ పోటీలో నిఖిల్, డెమోన్, భరణి, గౌరవ్ లు ఆడగా... కమాండర్లు విన్ అయ్యారు. ఆ తర్వాత "భరణి వల్లే నా కెప్టెన్సీ పోయింది. ఓవర్ కాన్ఫిడెంట్" అంటూ గౌరవ్ బాధ పడ్డాడు. ఇంతటితో ప్రజలకు ఇమ్యూనిటి పొందే అన్నీ అవకాశాలు పూర్తయ్యాయని బిగ్ బాస్ ప్రకటించారు.
"ఈ రణరంగం 3వ అధ్యాయంలోని మొదటి భాగం ముగిసింది. రెండవ భాగం మొదలుపెట్టే సమయం వచ్చింది. రాజు రాణులను ఓడించి ఆ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి కమాండర్లు రెడీ" అంటూ 'ఎయిమ్ ఫర్ క్రౌన్' అనే టాస్క్ ఇచ్చారు. కెప్టెన్సీ టాస్క్ టాపిక్ తీసి, ఇమ్యూనిటి కావాలని కింగ్ అండ్ క్వీన్స్ ముగ్గురూ గొడవ పడ్డారు. చివరగా దివ్యను సెలెక్ట్ చేశారు. కమాండర్ల నుంచి డెమోన్, నిఖిల్ గేమ్ ఆడాడనికి సెలెక్ట్ అయ్యారు. కానీ దివ్య నిఖిల్ ను ఎంచుకుంది. చివరగా ఈ టాస్క్ లో నిఖిల్ విన్ అయ్యి, కొత్త కింగ్ గా మారాడు. కమాండర్లకు కూడా ఇమ్యూనిటీ పొందడానికి ఇదే ఆఖరి అవకాశం.





















