Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 71 రివ్యూ... ఈ వారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే... అందరి టార్గెట్ రీతూనే... తనూజా షాకింగ్ డెసిషన్
Bigg Boss 9 Telugu Today Episode - Day 71 Review : బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్ల ప్రక్రియ గరంగరంగా సాగింది. కంటెస్టెంట్స్ రివేంజ్ నామినేషన్లతో ఫైర్ అయ్యారు. నామినేషన్లలో ఎవరున్నారంటే?

డే 71 ఎపిసోడ్ లో "ఇంకొకడు వస్తే నన్ను పక్కన పెడతా అంటే నేను నీతో ఉండలేను. రాత్రి కళ్యాణ్ తో ఉన్నావ్. నేను వెళ్ళిపోతే నన్నెందుకు అడగలేదు" అంటూ గొడవ స్టార్ట్ చేశాడు డెమోన్. "సిల్లీ సిల్లీ వాటికి ఎందుకు గొడవ" అంటూ రీతూ ఫైర్ అయ్యింది. కాసేపటికే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు బిగ్ బాస్. "ఎంతమందిని ఎవరు నామినేట్ చేయాలన్న హక్కు కెప్టెన్ తనూజకు ఉంటుంది. మీ ముందున్న బాక్స్ లో 1, 2 నెంబర్స్ ఉన్న టోకెన్స్ ఉన్నాయి" అని చెప్పారు బిగ్ బాస్. నామినేషన్ చేయడానికి నిర్దిష్ట టైమ్ ఉంటుంది. ఎండ్ బెల్ మోగగానే దిష్టిబొమ్మను బద్దలు కొట్టాలి అనేది ప్రాసెస్.
రీతూని టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు
"రీతూ గేమ్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నావు. కాన్ఫిడెన్స్ కోల్పోతున్నావు. నీవల్ల గేమ్ మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయ్యింది. ఇక్కడున్న వాళ్ళలో గేమ్స్ పరంగా ఎక్కడో ఒకచోట వెనకబడిపోయావ్. డిజాస్టర్ సంచాలక్" అంటూ రీతూని నామినేట్ చేశాడు ఇమ్మాన్యుయేల్. ఈ విషయమై ఇద్దరి మధ్య హీటింగ్ డిస్కషన్ నడిచింది. సెకండ్ నామినేషన్ లో భరణి పేరు పెట్టాడు ఇమ్మూ. "మొన్న ఈజీగా గెలిచే గేమ్ లో ఓడిపోయారు. ఆరోగ్యరీత్యానో ఏమో ఎఫర్ట్స్ సరిగ్గా పెట్టట్లేదు. మీవల్ల గౌరవ్ ఆ గేమ్ ఓడిపోయాడు" అంటూ నామినేషన్ పాయింట్ పెట్టాడు ఇమ్మూ.
డెమోన్ కి 2 టోకెన్స్ ఇచ్చింది తనూజా. ఫస్ట్ కళ్యాణ్ ను నామినేట్ చేశాడు డెమోన్. "ఫస్ట్ కెప్టెన్సీ అప్పుడు నేనూ, రీతూ బ్యాడ్ అయ్యాము. మేము మోసం చేసాము అని స్టార్ ఇస్తే ప్రౌడ్ ఫీల్ అయ్యావు. సాయికి నిన్ను బ్యాక్ స్టాబ్ చేశామని చెప్పావు" అనే రీజన్ చెప్పాడు. "ఆ వీక్ ఇమ్మూ, ఫ్లోరా నేను బాగా ఆడాము కాబట్టి స్టార్ ఇచ్చారు. అంతేగానీ మీవల్ల కాదు. ఫస్ట్ రీతూ, సెకండ్ ప్రిఫరెన్స్ నేను అన్నావ్. అలా అన్నావ్ కాబట్టి రాముని తీయమన్నాను. నువ్వు మిస్ అండర్ స్టాండింగ్ చేసుకున్నావ్. సాయితో బ్యాక్ స్టాబ్ అని నేను ప్రామిస్ గా అనలేదు" అని చెప్పాడు కళ్యాణ్. డెమోన్ ఇంకో నామినేషన్ లో రీతూ పేరు చెప్పాడు. "నువ్వు మాటిచ్చి సాయిని తీసేయడం నాకు నచ్చలేదు. నేనేదైనా నార్మల్ గా మాట్లాడినా నువ్వు అరుస్తున్నావ్. అక్కడ నా తప్పు లేకపోయినా నాదే తప్పు అని బయటకెళ్ళడం బాధగా ఉంది. నువ్వు టాప్ 5లోనే ఉండాలని కోరుకున్నా. ఎవరెంత నిన్ను నమ్మకూడదని చెప్పినా నీకేం కావాలో అదే చేయడానికే ట్రై చేశా" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు పవన్. "ఏం ఉన్నా నేను నిన్ను నామినేట్ చేసి చెప్పలేదు పవన్" అంటూ రీతూ గుక్కపెట్టి ఏడ్చింది. తరువాత ఆ గొడవ ముదిరింది.
ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్
సంజన 'ఫ్యామిలీ వీక్ పోయింది నీవల్లే' అని కళ్యాణ్ ను నామినేట్ చేసింది. 'యాక్టివిటీ రూమ్ లో మిమ్మల్ని ముంచినందుకు నామినేట్ చేశా చెప్పండి. ఒప్పుకుంట' అని కళ్యాణ్ అన్నాడు. భరణికి 2 టోకెన్స్ ఇవ్వగా... భరణి "ఫిట్నెస్ గురించి మాట్లాడాడు. అది పర్సనల్. నామినేషన్స్ లోకి రాలేదు. హెల్ప్ అనేది మ్యూచువల్. నీకు నేను నాకు నువ్వు" అంటూ ఇమ్మూని నామినేట్ చేశాడు. "మొన్న సంచాలక్ గా ఫెయిల్ అయ్యావు" అంటూ రీతూని నామినేట్ చేశాడు. కళ్యాణ్ డెమోన్ ను నామినేట్ చేశాడు. "తనూజా మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే పక్కకు తీసుకెళ్ళి ఆమెకు చెప్పావు. నావైపు స్టాండ్ తీసుకోలేదు" అని డెమోన్ అన్నాడు. "తనూజాను అడిగి మరీ ఆన్సర్ చెప్పాడు కళ్యాణ్.
రీతూకి 2 టోకెన్స్ ఇవ్వగా... "మీరు సోలోగా ఆడుతున్నట్టు పోట్రె చేయడానికి ట్రై చేస్తారు. మీ వల్ల నా గేమ్ అంతా పోయింది. నన్ను మైండ్ లెస్ అనడానికి మీరెవరు?" అని సంజనాను నామినేట్ చేసింది. "కాన్ఫిడెన్స్ డౌన్ చేస్తున్నావు" అని దివ్యను నామినేట్ చేసింది. దివ్యకు 1 టోకెన్ రాగా రీతూని నామినేట్ చేసి వివరణ ఇచ్చింది. సుమన్ శెట్టి "టవర్ టాస్క్ లో సంచాలక్ గా ఫెయిల్ అయ్యావు" అంటూ కళ్యాణ్ ను నామినేట్ చేశాడు. కెప్టెన్ పవర్ తో తనూజా "నీ గేమ్ నువ్వు ఆడు" అని రీతూని సేవ్ చేసింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కళ్యాణ్, భరణి, ఇమ్మాన్యుయేల్, డెమోన్ పవన్, సంజనా, దివ్య నామినేట్ అయ్యారు.





















