Balakrishna : మూడు నిమిషాలే... ఏ ఛాలెంజ్‌కైనా రెడీ - బాలయ్య పవర్ ఫుల్ స్పీచ్
Balakrishna Reaction : 'అఖండ 2 తాండవం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన పవర్ ఫుల్ స్పీచ్‌తో అదరగొట్టారు. అలాగే, సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్‌కు ఓ రిక్వెస్ట్ చేశారు.

Balakrishna Speech In Akhanda Thaandavam Grand Pre Release Event : హిస్టరీలో ఎంతమంది ఉన్నా దాన్ని తిరగరాసి మళ్లీ రిపీట్ చేసేవాడు ఒక్కడే ఉంటాడని... నేనే ఆ చరిత్ర నాదే ఆ చరిత్ర అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన 'అఖండ 2 తాండవం' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు.
పవర్ ఫుల్ స్పీచ్ విత్ డైలాగ్స్
సినిమాల విషయంలో తాను చేసిన తప్పులను అర్థం చేసుకుని సినిమాలో ఆత్మను పట్టుకోవాలని తెలుసుకున్నట్లు చెప్పారు బాలయ్య. 'నేను ఫ్యాన్స్ గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటా. అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ వంటి మూవీస్ మిమ్మల్ని మెప్పించడం కోసమే చేశా. మహాశివుడి సాక్షిగా పార్వతీ మాత తోడుగా గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో అఖండ 2 చేశాం. రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై, త్రినేత్రుడి వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై... ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై... నా పవర్ ఫుల్ రోల్ రేపు వెండితెలపై చూస్తారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మూవీ ట్రైలర్ చూసి సనాతన హిందూ ధర్మ శక్తి, పరాక్రమం, గొప్పగా చెప్పారని ప్రశంసించారు. రానున్న రోజుల్లో చాలా పండుగలు నిర్వహించనున్నాం.' అని అన్నారు.
ఏ ఛాలెంజ్‌కైనా రెడీ
తాను పాదరసంలాంటి వాడినని... ఏ ఛాలెంజ్‌కైనా రెడీ అన్నారు బాలయ్య. 'సినిమాకు ఎలాంటి తేడాలు తారతమ్యాలు ఉండవు. నన్ను అర్థం చేసుకునే వారితో కలిసి పని చేయడం నా అదృష్టం. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ అఖండ. మీరంతా ఘన విజయాన్ని అందించారు. నా కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేశా. అఖండ 2 తాండవం వేరే స్థాయిలో ఉంటుంది. నేను, బోయపాటి సినిమా చేయాలనుకుంటే 3 నిమిషాలే మాట్లాడుకుంటాం.
నటన అంటే ఆత్మలోకి ప్రవేశించడం. నేను ఏ ఛాలెంజ్‌కైనా రెడీ. ఒకే పనితో సంతృప్తి చెందను. అందుకే నటుడిగా కాకుండా ఎమ్మెల్యేగా, బసవతారకం హాస్పిటల్ ఛైర్మన్‌గానూ చేస్తున్నా. దేశాన్ని కాపాడేందుకు సైనికులు ఉంటే ధర్మాన్ని కాపాడేందుకు అఘోరాలు, స్వాములు ఉన్నారు. బాలయ్య సినిమా అంటే ఉగాది పచ్చడిలాంటిది. అందులో అన్నీ ఉంటాయి.' అని పేర్కొన్నారు.
ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్
ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా జంతు హింస వద్దని సూచించారు. 'కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. సినిమా రిలీజ్ సందర్భంగా మేకలు, గొర్రెలు బలిస్తుంటారు. దయచేసి అలాంటివి చెయ్యొద్దు. వాటికి కూడా జీవించే హక్కు ఉంది. మనుషులతో సమానంగా మూగజీవాలను గౌరవించాలి. ఫ్యాన్స్ ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.' అంటూ రిక్వెస్ట్ చేశారు. 'అఖండ 2' పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.





















