Andhra King Taluka Reaction : మా హీరోస్‌ది మంచి మనసు - ప్రొడ్యూసర్స్‌కు అండగా టాలీవుడ్ టాప్ స్టార్స్... 'ఆంధ్ర కింగ్ తాలూకా' సక్సెస్ మీట్ హైలెట్స్
Andhra King Taluka : టాలీవుడ్ టాప్ హీరోస్ రెమ్యునరేషన్ పరంగా నిర్మాతలకు అండగా ఉన్నారని ప్రముఖ నిర్మాత రవిశంకర్ అన్నారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా' సక్సెస్ మీట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Producer Ravi Shankar About Tollywood Actors Remuneration : టాలీవుడ్ స్టార్ హీరోస్ చాలా మంది నిర్మాతలకు అండగా నిలబడ్డారని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ అన్నారు. రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' సక్సెస్ మీట్‌లో ఆయన హీరోల రెమ్యునరేషన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డబ్బే ఇంపార్టెంట్ కాదు
'తెలుగు నిర్మాతకు అండగా ఉండే హీరోస్ ఎవరైనా ఉన్నారా?' అనే ప్రశ్నకు రవిశంకర్ రియాక్ట్ అయ్యారు. ఇండస్ట్రీలో నిర్మాతకు అండగా ఉండే హీరోస్ చాలా మంది ఉన్నారని తెలిపారు. ''రంగస్థలం' టైంలో రామ్ చరణ్ ఆయన రెమ్యునరేషన్ బ్యాలెన్స్ సినిమా రిలీజ్ అయిన ఎప్పటికో కానీ తీసుకున్నారు. మహేష్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ తర్వాత ఏడాదికి కానీ రెమ్యునరేషన్ తీసుకోలేదు. చిరంజీవి వాల్తేరు వీరయ్య తర్వాత ఏడాదికే తీసుకున్నారు.
ఓటీటీ డీల్ లేట్ అవుతాయి కదా అవి వచ్చినప్పుడే ఇవ్వండి అంటూ చెప్పారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా' విషయానికొస్తే ఉపేంద్ర తన రెమ్యునరేషన్ చెప్పలేదు. రామ్ డబ్బులు తీసుకోలేదు. నైజాం, గుంటూరు తీసుకున్నారు. వీరంతా ప్రొడ్యూసర్ బాధ ఏంటి అనేది అర్థం చేసుకున్నట్లే. చాలా మంది హీరోలు నిర్మాతలకు అండగా నిలబడ్డారు. ఎన్టీఆర్ కూడా ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే ఇవ్వండి అనేలా ఉంటారు. పవన్ కల్యాణ్ గారు మిగిలితేనే రెమ్యునరేషన్ ఇవ్వమన్నారు. ప్రభాస్, అల్లు అర్జున్ కూడా అంతే. బన్నీ పుష్ప తర్వాత ఏడాది పాటు విడతలుగా రెమ్యునరేషన్ తీసుకున్నారు.' అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా... మా హీరోస్‌ది మంచి మనసు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
తెలుగు రాష్ట్రాల్లో 'కింగ్'
టాలీవుడ్ ఆడియన్స్ ప్రేమ ఎప్పటికీ మరువలేనిదని కన్నడ స్టార్ ఉపేంద్ర అన్నారు. తానెప్పుడు ఇక్కడికి వచ్చినా ఓ కింగ్‌లా ఫీల్ అవుతానని అన్నారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా స్టోరీ చర్చలు నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది. స్క్రిప్ట్ విన్నప్పుడే థ్రిల్ ఫీలయ్యా. తొలుత కొద్ది టెన్షన్‌గా ఉన్నా ఆ తర్వాత అది పోయింది. టాలీవుడ్ ఆడియన్స్ నాపై చూపే ప్రేమ, అభిమానమే ఇందుకు కారణం. 25 ఏళ్ల నుంచి అదే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా.' అంటూ చెప్పారు.
ఫస్ట్ డే కలెక్షన్స్
గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.7.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుండగా... ఇండియావ్యాప్తంగా రూ.4.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ 2,75,000 డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. చాలా రోజుల తర్వాత రామ్ ఖాతాలో హిట్ పడిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మూవీలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. పి.మహేష్ బాబు దర్శకత్వం వహించగా... ఉపేంద్రతో పాటు రావు రమేష్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించారు.





















