Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు గుడ్ న్యూస్-ఆర్టీసీ బస్‌లలో ఉచిత ప్రయాణం
Andhra Pradesh :ఆర్టీసీ బస్‌లలో ఉచిత ప్రయాణం సహా ఏడు వరాలను దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

Andhra Pradesh :దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు మహిళలకే పరిమితమైన ఉచిత ప్రయాణాన్ని దివ్యాంగులకు వర్తింపజేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ హామీతోపాటు మరో ఏడు వరాలు ఇస్తున్నట్టు వెల్లడించారు. విజయవాడలో జరిగిన అంర్జాతీయ విభన్న ప్రతిభావంతుల దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు.
దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు బలహీనులు కాదని వారు తలచుకుంటే ఏదైనా సాధించగలరని విల్ పవర్ ఉన్న వ్యక్తులని అభిప్రాయపడ్డారు. అందరి కంటే వారికి పట్టుదల ఎక్కువ ఉంటుందని గుర్తు చేశారు. అందుకే వారికి కూడా సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి వారికి చేయూత అందిస్తున్నామని తెలిపారు. మొదట ఎన్టీఆర్ వాళ్లకు 30 రూపాయల పింఛన్ ఇచ్చారని, దాన్ని ఎప్పటికప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెంచుతూనే వచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరు వేల రూపాయలు అందిస్తున్నామని తెలియజేశారు. తీవ్ర వైకల్యం ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు కూడా అందజేస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెల దివ్యాంగులకు 471 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు.#AndhraPradesh pic.twitter.com/9Ft9QRctFU
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 3, 2025
దివ్యాంగుల చదువుల్లో కూడా చేయూత ఇస్తున్నామని విభిన్న ప్రతిభావంతుల కోసం డీఎస్సీ తీస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వినికిడి లోపం ఉన్న వారి కోసం ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వారికి ప్రతి అడుగులో సాయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అంతే కాకుండా వైజాగ్‌లో నేషనల్ సెంటర్ ఫర్ డిజేబిలిటీ స్పోర్ట్స్‌్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
దివ్యాంగులకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సదుపాయంతోపాటు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్స్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఒక ప్రతినిధి ఉండేలా చేస్తామన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక సబ్సిడీ అందించే పథకాలు ప్రారంభిస్తామని మాట ఇచ్చారు. శాప్ ద్వారా అన్ని క్రీడలమాదిరిగానే దివ్యాంగులకు సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూస్తామని పేర్కొన్నారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు 7 వరాలు ప్రకటించాను. ఇప్పటివరకు మహిళలకు మాత్రమే అందుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని దివ్యాంగులకు కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్స్-పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక… pic.twitter.com/4jR9edfhjW
— N Chandrababu Naidu (@ncbn) December 3, 2025
ప్రభుత్వం కార్యాలయాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లోనే దివ్యాంగులకు సీట్లు ఉండేలా చూస్తామని చంద్రబాబు తెలిపారు. వినికిడి లోపం ఉన్న వారికి ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెసిడెన్షిలయల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగులకు అదే చోట పింఛన్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు. వీటన్నింటితోపాటు దివ్యాంగుల కోసం అమరావతి ప్రత్యేక భవనం ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.





















