Bollywood Kajol : పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ - ఆ కామెంట్స్‌పై బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రియాక్షన్
Kajol Reaction : బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రీసెంట్‌గా 'పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్' అంటూ కామెంట్స్ చేయగా తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా అదే టాక్ షోలో ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు.

Bollywood Actress Kajol Reaction On Marriage Expiry Date Comments : బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రీసెంట్‌గా 'పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్' అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆమె సరదాగా చేసిన కామెంట్స్ సీరియస్ కాగా... సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై తాజాగా ఆమె రియాక్ట్ అయ్యారు.
సీరియస్‌గా తీసుకోవద్దు
బాలీవుడ్ స్టార్స్ కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్టులుగా వస్తోన్న సెలబ్రిటీల టాక్ షో 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్'. ఇటీవలే ఈ షోలో ఆమె చేసిన కామెంట్స్‌పై విమర్శలు. తాజాగా అదే టాక్ షోలో కాజోల్ దీనిపై స్పందించారు. 'మనం రెండో పార్ట్‌లోకి వెళ్దాం. మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టిన విభాగం అది. దయచేసి సరదా సంభాషణల్లో భాగంగా చేసిన ఆ కామెంట్స్ సీరియస్‌గా తీసుకోవద్దు.' అని అన్నారు. దీనికి ట్వింకిల్ రియాక్ట్ అవుతూ... ఈ షో స్టార్ట్ అయినప్పుడే ఫస్ట్ ఎపిసోడ్ నుంచే తాము మాట్లాడే వాటిని సీరియస్‌గా తీసుకోవద్దని డిస్‌క్లైమర్ ఇస్తూనే ఉన్నామని చెప్పారు. మేం చెప్పే సలహాలు పాటించొద్దని మళ్లీ చెబుతున్నామంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
Also Read : 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ డే కలెక్షన్స్ - రామ్ ఖాతాలో హిట్ పడినట్లేనా?
అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ స్టార్స్ కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్స్‌గా వస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్‌గా ఈ షోలో విక్కీ కౌశల్, కృతిసనన్ పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్‌లో 'పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా? వద్దా?' అనే క్వశ్చన్ వచ్చింది. దీనికి ట్వింకిల్ ఖన్నా... 'అది పెళ్లి... వాషింగ్ మెషీన్ కాదు' అంటూ సమాధానం ఇచ్చారు.
దీనిపై కాజోల్ సైతం స్పందిస్తూ... 'నేను కూడా అలాగే అనుకుంటున్నా. కానీ, రెన్యువల్ చేసుకునే ఛాన్స్ ఉంటే మంచిదని నా ఒపీనియన్. ఒకవేళ ఎక్స్‌పైరీ డేట్ ఉంటే ఎవరూ ఎక్కువ కాలం బాధ పడాల్సిన అవసరం ఉండదు.' అంటూ చెప్పడం వైరల్ అయ్యింది. ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు రాగా... సరదాగా చేసిన కామెంట్స్ సీరియస్‌గా తీసుకోవద్దంటూ రియాక్ట్ అయ్యారు.





















