Sunscreen : 41000 ఏళ్ల క్రితమే మనిషి సన్‌స్క్రీన్ వాడేవారా? షాక్ అయ్యే ఆధారం లభ్యం!
Sunscreen : మిచిగాన్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం, 41,000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎండ నుంచి కాపాడుకునే Sunscreenలను వాడేవారు.

Sunscreen History: వేసవిలో ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవడానికి మనం సన్ న్‌ను ఉపయోగిస్తాము. కార్పొరేట్ కల్చర్, ఆధునిక కాస్మెటిక్ పరిశ్రమల చేసిన ప్రచారంలో భాగంగా ఇది వాడుకలోకి వచ్చిందని చాలాంది భావిస్తుంటారు. కానీ ఒక కొత్త పరిశోధనలో 41,000 సంవత్సరాల క్రితం కూడా మన పూర్వీకులు సన్‌స్క్రీన్ (Sunscreen) ను ఉపయోగించారని తేలింది.
మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక అధ్యయనంలో మన పూర్వీకులు అంటే హోమో సేపియన్స్ (Homo Sapiens) సూర్యుని హానికరమైన కిరణాల నుంచి రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ వంటి లేపనాలు వాడినట్టు తెలిపారు. అప్పుడు ఇది ఏదైనా బ్రాండెడ్ ఉత్పత్తిలా కాదు, కానీ సహజమైన, సరళమైనవి, వాటిని వారు తమ శరీరాలను హానికరమైన వాటి నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించేవాళ్లను తెలిసింది.
భూమిపై జరిగిన ముఖ్యమైన మార్పులు
అధ్యయనంలో తెలిపిన విధంగా 41,000 సంవత్సరాల క్రితం, భూమి అయస్కాంత క్షేత్రం చాలా బలహీనంగా ఉన్నప్పుడు, సూర్యుని కిరణాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఇది లాస్‌చాంప్స్ ఎక్స్‌కర్షన్ (Laschamps Excursion) సమయం. భూమి పైన ఉత్తర ధృవం ఐరోపా వైపునకు జరిగిపోయి దాని రక్షణ కవచం కేవలం 10% మాత్రమే మిగిలి ఉండేది. దీని వలన సూర్యుని నుండి వచ్చే కిరణాలు కాస్మిక్ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇది భూమికి చాలా హానికరం. ఈ సమయంలో ఐరోపా, ఉత్తర ఆఫ్రికా వంటి ప్రాంతాల‌్లో ఉష్మోగ్రతలు చాలా పెరిగాయి. ఈ కారణంగా ప్రజలు సూర్యుని కిరణాల వల్ల వచ్చే వ్యాధులను ఎదుర్కోవలసి వచ్చింది, ఉదాహరణకు చర్మం మంట, కళ్ళు సంబంధిత సమస్యలు , ఫోలేట్ లోపం వంటివి. మరి మన పూర్వీకులు దీనిని ఎలా ఎదుర్కొన్నారు, వారు ఆ సమయంలో సూర్యుని తీవ్రత నుంచి రక్షించుకోవడానికి ఏవైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నారా?
బట్టలు , గుహల సహాయంతో...
పరిశోధకుల ప్రకారం, హోమో సేపియన్స్ తమ రక్షణ, సౌకర్యం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. సూర్యుని తీవ్రత ఎక్కువగా ఉన్నందున బయట ఉండటం ప్రమాదకరంగా భావించి మన పూర్వీకులు గుహలలో నివసించడం ప్రారంభించారు. గుహల లోపల నీడ ఉండేది,, ఇది సహజంగా వారికి రక్షణ కల్పించేది. దాదాపు అదే సమయంలో, హోమో సేపియన్స్ బట్టలు తయారు చేసి కుట్టడం నేర్చుకున్నారు. ఈ బట్టలు వారిని చలికాలంలో వెచ్చగా ఉంచడమే కాకుండా, సూర్యుని హానికరమైన కిరణాల నుంచి కూడా రక్షించాయి.
ఓచ్రె (Ochre) ఉపయోగం
ఓచ్రె ఒక సహజ ఎరుపు రంగు ఖనిజం, ఇది ఇనుము ఆక్సైడ్‌తో తయారవుతుంది. దీనిని మన పూర్వీకులు తమ చర్మంపై రాసుకుని సూర్యుని నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించారు. ఇది సహజ సన్‌స్క్రీన్‌లా పనిచేసింది. ప్రజలు తమ చర్మ సౌందర్యానికి కూడా వినియోగించినట్టు పరిశోధకులు నమ్ముతున్నారు.
ఓచ్రె ఒక పురాతన 'సన్‌స్క్రీన్'
ఓచ్రెను అలంకరణ కోసం మాత్రమే కాదు, సూర్యుని నుంచి రక్షించుకోవడానికి కూడా ఉపయోగించారు. ఈ ఖనిజం సన్‌స్క్రీన్‌లా పనిచేసింది, ఎందుకంటే దీనిలో సూర్యుని హానికరమైన కిరణాలను మన చర్మం చేరకుండా నిరోధించే లక్షణాలు ఉన్నాయి. ఓచ్రె సహజ సన్‌స్క్రీన్‌గా ఉపయోగించారని నిరూపితమైంది . ఇది నేటికీ కొన్ని ఆదివాసీ తెగలలో కనిపిస్తుంది.
సూర్యుని నుంచి రక్షణ కోసం బట్టలు, ఓచ్రె
చలి, ఎండ నుంచి రక్షణ కోసమే హోమో సేపియన్స్ బట్టలు తయారు చేయడం కుట్టడం నేర్చుకున్నారు. అనంతరం ఈ బట్టలు, ఆహారం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళగలిగారు.
ఇవి నేటి సన్‌స్క్రీన్ లాంటివైనా?
యుఎం మానవ శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ రేవెన్ గర్వే ప్రకారం, పాత కాలపు సన్‌స్క్రీన్‌లు నేటి బ్రాండెడ్ క్రీమ్ లాంటివి కావు, కానీ అవి సహజంగా తయారు చేసుకున్నవే. అవి నాటి ప్రజలను సూర్యుని హానికరమైన కిరణాల నుంచి రక్షించాయి. ఆ సమయంలో మన పూర్వీకుల వద్ద సాంకేతికత, వస్తువుల లభ్యత తక్కువగా ఉన్నాయి, అయినా సరే సహజ వనరులను తెలివిగా ఉపయోగించుకున్నారు.
గమనిక: వార్తలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.





















