అన్వేషించండి

Christmas Facts : క్రిస్మస్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా? 2024 సెలబ్రేషన్స్ సమయంలో ఈ నిజాలు మీకోసమే

Christmas 2024 : క్రిస్మస్ అనే పదం ఎక్కడినుంచి వచ్చింది? శాంతా క్లాజ్ ఎవరు? క్రిస్మస్​ను అన్ని దేశాల్లో ఒకేరోజు జరుపుకుంటారా? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

Interesting Christmas Facts : జీసస్ పుట్టినరోజు సందర్భంగా.. క్రైస్తవులు క్రిస్మస్​ను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ క్రిస్మస్​ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. వీటి గురించి ఎక్కువమందికి తెలియదు. క్రిస్మస్​ను అందరూ డిసెంబర్ 25వ తేదినే సెలబ్రేట్ చేసుకోరట. క్రిస్మస్​ ట్రీ ట్రెడీషన్ ఎప్పటి నుంచి వచ్చింది. క్రిస్మస్​ అనే పేరు ఎలా వచ్చింది వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

యేసు పుట్టిన రోజు ఇదేనా?

క్రిస్మస్​ను క్రైస్తవులు అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. యేసు క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా వారంతా సంతోషంతో దీనిని నిర్వహించుకుంటారు. జీసస్​ని దేవుని కుమారుడని.. లోక రక్షకుడిగా నమ్మి ప్రార్థిస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ క్రిస్మస్​ను చేసుకుంటారు. కానీ యేసు పుట్టినరోజు ఇదే అనే చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. 

ఆ దేశాల్లో క్రిస్మస్ ఎప్పుడంటే..

దాదాపు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్​ను డిసెంబర్ 25వ తేదీనే జరుపుకుంటారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం క్రిస్మస్​ను ఇప్పుడు జరుపుకోరు. రష్యా, ఉక్రెయిన్, రోమానియా వంటి దేశాల్లో క్రిస్మస్​ను జనవరి 7వ తేదీన జరుపుకుంటారు. గ్రీక్ ఆర్థోడాక్స్ వారు కూడా జనవరి 7వ తేదీనే క్రిస్మస్ చేసుకుంటారు. 

క్రిస్మస్ పేరు ఎలా వచ్చిందంటే.. 

క్రిస్మస్ అనే పేరు క్రిస్టెస్ మాస్సే అనే ఆంగ్ల పదబంధం నుంచి వచ్చింది. దీని అర్థం క్రీస్తు మాస్. అలాగే ‘Xmas’ అని కూడా క్రిస్మస్ టైమ్​లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని గ్రీకు నుంచి తీసుకున్నారు. గ్రీకు పదంలోని 'క్రిస్టోస్' నుంచి ఇది వచ్చింది. 

విక్టోరియన్ యుగం.. 

క్రిస్మస్ రోజు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు సంతోషంగా జరుపుకుంటారు. యూకేలో అయితే ఈ ఫెస్టివల్​ను విక్టోరియన్ యుగం నుంచి ప్రారంభించారు. క్వీన్​ విక్టోరియా ఆమె భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ ఈ క్రిస్మస్​ను బాగా సెలబ్రేట్ చేసుకునేవారు. క్రిస్మస్ కార్డులు, గిఫ్ట్​లు ఇచ్చే, క్రాకర్స్ కాల్చే ఆనవాయితీ ఇక్కడి నుంచే వచ్చింది. రోస్ట్ టర్కీ వంటకాలు కూడా ఇక్కడినుంచే ప్రారంభమయ్యాయి. 

క్రిస్మస్ ట్రీ

క్రిస్మస్ సమయంలో ట్రీని పెట్టే పద్ధతి కూడా విక్టోరియన్ కాలం నుంచే ప్రారంభించారు. జర్మనీలో 16వ శతాబ్ధంలో వీటిని మొదట గుర్తించారు. ఆ సమయంలో క్రైస్తవులు ఫిర్ చెట్లను పండ్లు, నట్స్​తో అలంకరించేవారు. కాలం మారే కొద్ది స్వీట్స్, పేపర్ బొమ్మలు, లైట్స్​తో అలంకరిస్తున్నారు. అయితే ఈ క్రిస్మస్ ట్రీ మూలాలు మాత్రం రోమన్లు, ప్రాచీన ఈజిప్షియన్లు స్టార్ట్ చేశారని చెప్తారు. 

లండన్ స్టోరీ.. 

ప్రతి సంవత్సరం నార్వే నుంచి క్రిస్మస్​ ట్రీని లండన్​కి పంపిస్తారు. ట్రఫాల్గర్ స్క్వేర్​లో దీనిని లైట్స్​తో అలంకరించి పెడతారు. 20 మీటర్లు ఎత్తులో ఈ ట్రీ ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యూకే నార్వేకి అందించిన సహాయానికి గుర్తుగా దీనిని పంపిస్తారు. 

శాంతా క్లాజ్.. 

శాంతా క్లాజ్ లేకుండా క్రిస్మస్ కంప్లీట్ కాదు. సింటర్ క్లాస్​ అనే పేరు నుంచి శాంతా క్లాజ్ వచ్చింది. నెదర్లాండ్స్ భాష అయిన డచ్​లో సెయింట్​ నికోలస్​ అని దీనికి అర్థం. ఆయన 4వ శతాబ్ధంలోని క్రిస్టియన్ బిషప్​గా చెప్తారు. అతని దయ, నిస్వార్థ హృదయానికి గుర్తుగా అతని పేరిట శాంతా క్లాజ్​ని తెరపైకి తెచ్చారు. 

అప్పుడు క్రిస్మస్ చట్టవిరుద్ధమట.. 

క్రిస్మస్​ను 1644వ సంవత్సరంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం చట్టవిరుద్ధమట. అయితే ఆ సమయంలో క్రిస్మస్​ను సీక్రెట్​గా సెలబ్రేట్ చేసుకునేవారట. అనంతరం 20 ఏళ్ల తర్వాత క్రిస్మస్​ను జరుపుకోవడం చట్టబద్ధం చేశారట. 

Also Read : హ్యాపీ క్రిస్మస్ 2024.. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి సోషల్ మీడియాలో ఇలా విష్ చేసేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
PV Sindhu Marriage Latest Photos: పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
Embed widget