క్రైస్తవులు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్గా చెప్తారు కానీ.. డిసెంబర్ 1వ తేదీ నుంచే ఈ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. క్రిస్టియన్స్ అందరూ హ్యాపీగా చేసుకునే సెలబ్రేట్ చేసుకునే పండుగల్లో ఇది కూడా ఒకటి. యేసు క్రీస్తు జన్మించాడనే కారణంతో క్రిస్టియన్స్ క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన డిసెంబర్ 25వ తేదీనే పుట్టాడనే ఎలాంటి రుజువు లేదు. కానీ చలికాలంలోనే యేసు పుట్టాడని క్రైస్తవులు నమ్ముతారు. రోమన్ క్యాలెండర్ ప్రకారం, ఇతర రీజన్స్ ద్వారా డిసెంబర్ 25వ తేదీని క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. పాపులను రక్షించుటకై.. కన్యకైన మరియమ్మ గర్భమున క్రీస్తు జన్మించినట్లు బైబిల్ చెప్తోంది. అందుకే ఈ వేడుకను క్రైస్తవులు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. రెడ్ వైన్, కేక్స్, క్రిస్మస్ ట్రీలతో వేడుకలు చేసుకుంటారు. పాటలు పాడుతూ, ప్రార్థనలు చేసుకుంటారు. ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. బైబిల్ ఉన్న అంశాలనే ఇవ్వడం జరిగింది.