రోజూ యోగా చేస్తే ఆరోగ్యానికి మానసికంగా, శారీరకంగా ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి.

యోగా రెగ్యులర్​గా చేస్తే బాడీ ఫ్లెక్సీబుల్​గా మారుతుంది. కండరాలను దృఢపరిచి హెల్తీగా ఉండేలా చేస్తుంది.

శరీరానికి బలాన్ని అందించి.. కండరాలు, చేతులు, కాళ్లను మంచి షేప్​లోకి తీసుకువస్తుంది.

యోగా వెన్నుముకకు, కండరాలుకు బలం చేకూరుతుంది. ఇది వయసు ద్వారా వచ్చే కండర సమస్యలను దూరం చేస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారికి యోగా మంచి ఆప్షన్. జీర్ణ సమస్యలను దూరం చేసి మెటబాలీజంను పెంచుతుంది.

రక్తప్రసరణను పెంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది.

గట్ హెల్త్​ను మెరుగుపరిచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. మెరుగైన నిద్రను అందిస్తుంది.

నిద్ర సమస్యలున్నవారికి యోగా ఓ వరమని చెప్పవచ్చు. ఇది నిద్ర నాణ్యతను, సమయాన్ని పెంచుతుంది.

బోన్ డెన్సిటిని పెంచుతుంది. వయసు పెరిగేకొద్ది వచ్చే ఎముకల సమస్యలను దూరం చేస్తుంది.