పాలు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు తాగకపోవడమే మంచిదట.

లాక్టోస్ ఇన్​టోల్రెన్స్ ఉన్నవాళ్లు పాలు తీసుకోకూడదట. తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, డయోరియా వస్తుందట.

పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను పాలు ఎక్కువ చేస్తాయట.

మిల్క్ ప్రోటీన్ కొందరిలో అలెర్జీని కలిగిస్తుంది. దద్దుర్లు, దురద, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

మరికొందరికి బ్రీతింగ్​లో ఇబ్బంది ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటారు.

పాలు కొందరిలో హార్మోన్ సెన్సిటివ్ వల్ల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్, ఓవరియన్, యూట్రైన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

PCOS, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, బరువు పెరగడం వంటి సమస్యలు పెంచుతుంది.

మరికొందరిలో టైప్ 2 డయాబెటిస్ సమస్యను పెంచుతుందని చెప్తున్నారు నిపుణులు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.