లడ్డూలను చాలామంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నవారికి ఇవి మంచి ఆప్షన్.

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినగలిగే, హెల్తీగా ఉంచగలిగే వాటిలో నువ్వుల లడ్డూలు ఒకటి.

డ్రైఫ్రూట్స్ లడ్డూలతో పాటు.. హెల్తీగా ఉంచడంలో నువ్వుల లడ్డూలు హెల్ప్ చేస్తాయి.

నువ్వుల లడ్డూలు బోన్స్​ని హెల్తీగా ఉంచడంలో, వెన్నుముకను స్ట్రాంగ్​ చేయడంలో హెల్ప్ చేస్తాయి.

ఈ లడ్డూలను తయారు చేయడానికి నువ్వెలు, నెయ్యి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.

నువ్వలను మాడిపోకుండా దొరగా వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

బెల్లాన్ని కరిగించి.. తీగపాకంగా వచ్చేవరకు బాగా ఉడికించుకోవాలి.

నువ్వులను కాస్త పొడిగా చేసుకుని.. ఆ పొడిని బెల్లం పాకంలో వేసి బాగా కలపాలి.

పాకంలో బాగా కలిసి తర్వాత వాటిని చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి.

వీటిని పది నుంచి పదిహేను రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్​లో కూడా వీటిని నిల్వ ఉంచుకోవచ్చు.