అరటిపండును నేరుగా కాకుండా.. తేనెతో కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదిట.

బనానాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీనిని తేనెతో కలిపి తింటే శరీరానికి శక్తి అందుతుంది.

తేనెలో యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు సమస్యలను దూరం చేస్తాయి.

జీర్ణ సమస్యలున్నవారు కూడా దీనిని హెల్తీ స్నాక్​గా తీసుకువచ్చట. కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

ఈ కాంబినేషన్​లోని ఫైబర్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ప్రొబయోటిక్ లక్షణాలు గట్ హెల్త్​కి మంచివి.

బ్రెడ్​ని టోస్ట్ చేసి.. దానిపై తేనెను వేసుకుని.. అరటిపండు ముక్కలతో కలిపి తీసుకోవచ్చు.

అరటిపండు, తేనెను పాలతో కలిపి స్మూతీగా చేసుకుని తాగవచ్చు. ఇది టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.

ఓట్​మీల్​లో తేనెను మిక్స్ చేసి.. దానిలో అరటిపండు ముక్కలు వేసి పోషకాహారంగా తీసుకోవచ్చు.

వీటిని హెల్తీ స్నాక్​గా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇది మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.