మగవారిలో, ఆడవారిలో లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సాహించడంలో వెల్లుల్లి ముఖ్యపాత్ర పోషిస్తుందట.

గార్లిక్​లోని అల్లిసిన్ నాళాలను సడలించి రక్తప్రవాహం పెంచుతుంది. అంగస్తంభన పనితీరును మెరుగుపరుస్తుంది.

టెస్టోస్టెరాన్​ స్థాయిలను పెంచి.. లిబిడో, స్పెర్మ్ నాణ్యతను పెంచి.. లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది.

వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్​ వల్ల కలిగే నష్టం నుంచి స్పెర్మ్ క్వాలిటీని, సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి.

వెల్లుల్లి జననేంద్రియాల్లో రక్తప్రవాహాన్ని పెంచుతుంది. లిబిడో, ఉద్రేకాన్ని మెరుగుపరుస్తుంది.

పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరి, PMS సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు యోని ఇన్​ఫెక్షన్​లను నివారించడంలో హెల్ప్ చేస్తాయి.

రోజుకు 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను మీ డైట్​లో తీసుకుంటే మంచిది.

నేరుగా గార్లిక్ తీసుకోకూడదంటే.. సప్లిమెంట్స్ రూపంలో వాటిని తీసుకోవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.