కొన్ని టిప్స్ రెగ్యులర్‌గా ఫాలో అయితే వింటర్లో జలుబు రాకుండా ఉంటుంది. చేతులను కనీసం 20 సెకన్లు సోప్‌తో లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. తినే ముందు, దగ్గు, ఫ్లూ సమయంలో శానిటైజర్‌ను కచ్చితంగా ఉపయోగించాలి. చేతులను కళ్లు, ముక్కు, నోరుకి టచ్ చేయకండి. ఇలా టచ్ చేస్తే బాక్టీరియా పెరుగుతుంది. హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఫ్లూయిడ్స్ తీసుకుంటే డీహైడ్రేషన్ రాదు. సూప్స్, నీళ్లు తీసుకుంటే మంచిది. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండాలి. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు రెగ్యూలర్‌గా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉన్న పోషకాహారం తీసుకోవాలి. ఫ్లూ, వైరస్లు రాకుండా వ్యాక్సిన్లు వేయించుకుంటే మంచిది. జలుబు, ఫ్లూతో ఇబ్బంది పడేవారికి దగ్గరగా ఉండడం అంత మంచిది కాదు. మాస్క్ వేసుకోవచ్చు.