గర్భిణీగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉంటే ప్రెగ్నెన్సీ సమయంలో వాటికి దూరంగా ఉండాలి. ఇవి పిండంపై ఎఫెక్ట్ చూపిస్తాయి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు తీసుకుంటే మంచిది. సరిగ్గా ఉడికించని మాంసం, చేపలు, గుడ్లను అస్సలు తినకండి. ఇది అస్సలు మంచిది కాదు. రాత్రి నిద్ర 7 నుంచి 9 గంటలు ఉండేలా చూసుకోండి. ఇది బేబి గ్రోత్ హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్‌గా చెకప్స్ చేయించుకోవాలి. ఇది బేబి గ్రోత్, డెవలప్మెంట్ గురించి తెలుసుకునేందుకు హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ లక్షణాలను విస్మరించకూడదు. కడుపులో నొప్పి, బ్లీడింగ్, కాంట్రాక్షన్స్ ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి. శరీరానికి, బేబికి కావాల్సిన విటమిన్స్‌ను అందించాలి. ఇవి బేబి గ్రోత్‌కి మంచిది. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలుంటే.. వైద్యుల సలహాలను రెగ్యూలర్‌గా తీసుకోవాలి. ఒత్తిడి ప్రెగ్నెన్సీపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది కాబట్టి.. యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి.