ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి ఫైన్ లైన్స్, ముడతలు, వయసుపరంగా మచ్చలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

ద్రాక్షలోని విటమిన్ సి ఉంటుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్​ను తగ్గించి.. బ్రైట్​నెస్​ను పెంచుతుంది.

ద్రాక్షలో 81 శాతం నీరు ఉంటుంది. ఇది చర్మానికి హైడ్రేషన్ అందించి హెల్తీగా ఉంచుతుంది.

ద్రాక్షలోని యాంటీబాక్టీరియల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి.

జుట్టు పెరుగుదలకు కూడా ఇవి మంచివి. చుండ్రును తగ్గించి.. జుట్టు సమస్యలను దూరం చేస్తాయి.

పెరుగులో తేనె, యోగర్ట్​ కలిపి ఫేస్ మాస్క్ చేసుకోండి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

గ్రేప్ జ్యూస్​ని టోనర్​గా మార్చుకోవచ్చు. ఇవి స్కిన్ pH బ్యాలెన్స్​ని సెట్ చేసి.. పోర్స్ లేకుండా చేస్తాయి.

గ్రేప్ సీడ్ ఆయిల్​ని మాయిశ్చరైజర్​గా, జుట్టుకు మాస్క్​గా ఉపయోగించుకోవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.