CIL Recruitment: కోల్ ఇండియా కొలువులకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా!
సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/ పీజీడిగ్రీ/బీడీఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాలి.
![CIL Recruitment: కోల్ ఇండియా కొలువులకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా! Coal India Limited-CIL invites applications for the recruitment of Medical Executives to work in Mahanadi Coalfields Limited CIL Recruitment: కోల్ ఇండియా కొలువులకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/226077bd53ec8cfe866e44b00dfaf88f1665071044932522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియాలో భాగంగా ఉన్న మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/ పీజీడిగ్రీ/బీడీఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 29 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు...
* మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 66
1) సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్(E4)/ మెడికల్ స్పెషలిస్ట్(E3): 45 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: సర్జన్-06, జనరల్ ఫిజీషియన్-06, గైనకాలజీ & అబ్‌స్ట్రేటిక్స్-03, అనస్తేషియా-04, ఆర్థోపెడిక్-04, పీడియాట్రీషియన్-05, సైకియాట్రీ-03, పాథాలజిస్ట్-05, డెర్మటాలజిస్ట్-03, పల్మొనాలజిస్ట్/చెస్ట్ స్పెషలిస్ట్-02, రేడియాలజిస్ట్-04.
2) సీనియర్ మెడికల్ ఆఫీసర్ (E3): 18 పోస్టులు
3) సీనియర్ మెడికల్ ఆఫీసర్-డెంటల్ (E3): 03 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/ పీజీడిగ్రీ/బీడీఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణత.
వయసు: 31.08.2022 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలక 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.60,000 నుంచి రూ.2 లక్షల వరకు చెల్లిస్తారు.
చిరునామా:
Deputy. General Manager/ HoD(EE),
Mahanadi Coalfields Limited,
Jagriti Vihar, at Burla, Sambalpur,
Odisha-768020.
ముఖ్యమైన తేదీలు..
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2022.
* దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 29.10.2022.
:: ఇవీ చదవండి ::
NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
AP High Court Jobs: ఏపీ హైకోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఇంగ్లిష్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
BPCL: భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టులు, వీరికి అవకాశం!
కొచ్చిలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)