NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి
డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 15 నుంచి అక్టోెబరు 10 వరకు దరఖాస్తు ప్రక్రియ..
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
వివరాలు:
మొత్తం ఖాళీలు: 177
1) డెవలప్‌మెంట్ అసిస్టెంట్: 173 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-80, ఎస్సీ-21, ఎస్టీ-11, ఓబీసీ-46, ఈడబ్ల్యూఎస్-15.
అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉండాలి.
2) డెవలప్‌మెంట్ అసిస్టెంట్(హిందీ): 04 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-03, ఎస్టీ-01.
అర్హత: 50 శాతం మార్కులతో హిందీ/ఇంగ్లిష్ మీడియంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉండాలి. హిందీ/ఇంగ్లిష్ ఖచ్చితంగా ఒక పాఠ్యాంశంగా ఉండాలి.
వయోపరిమితి: 01.09.2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు (జనరల్), 13 సంవత్సరాలు (ఓబీసీ), 15 సంవత్సరాలు (ఎస్సీ, ఎస్టీ), వితంతు మహిళలకు 10 సంవత్సరాలు, జమ్ముకశ్మీర్ అల్లర్ల బాధితులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం:
ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వే్జ్-40 ప్రశ్నలు-40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ- 30 ప్రశ్నలు-30 మార్కులు, రీజనింగ్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) పోస్టులకు న్యూమరికల్ ఎబిలిటీ విభాగానికి బదులుగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ -30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.
మెయిన్ పరీక్ష: 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు-150 మార్కులు, ఎస్సేరైటింగ్, లెటర్ రైటింగ్-50 మార్కులు కలిపి 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) పోస్టులకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగానికి బదులుగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ -50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.
దరఖాస్తు రుసుము: రూ.450; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి.
జీత భత్యాలు: నెలకు రూ.32,000.
ముఖ్యమైనతేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.10.2022.
Also Read:
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1569 ఉద్యోగాలు, జిల్లాలవారీగా ఖాళీల వివరాలు!
తెలంగాణ జిల్లాల్లోని బస్తీ, పల్లె దవాఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి మొదట ప్రాధాన్యం ఇస్తారు. ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ వైద్యులు రాకుంటే.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయం, చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్లు, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
పంచాయతీరాజ్ శాఖలో 529 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు, త్వరలో నోటిఫికేషన్!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించగా.. టీఎస్పీఎస్సీ నుంచి మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు కూడా విడుదల అయ్యాయి. తాజాగా మరో 529 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు సెప్టెంబరు 9న ఆదేశాలు జారీ చేశారు.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..