అన్వేషించండి

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?

ఏపీ హైకోర్టులో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఇంగ్లిష్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి.

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఇంగ్లిష్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.  

వివరాలు..

* ఏపీ హైకోర్టు ఉద్యోగాలు

కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ: 76 పోస్టులు

అర్హత: డిగ్రీ(ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్), ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

పరీక్ష ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. Registrar (Administration), High Court of Andhra Pradesh, on State Bank of India, High Court Branch, Nelapadu, Amaravati (IFSC -SBIN0061328) పేరిట చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు దరఖాస్తులు పంపే కవరు మీద "Application for the post of Court Mater and Personal Secretary to the Hon'ble Judges and Registrars, by direct recruitment"  అని రాసి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా సమర్పించాలి లేదా పంపించాలి.

ఎంపిక ప్రక్రియ: షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: అభ్యర్థులు నిమిషానికి 180 పదాలు (3 నిమిషాల వ్యవధి) టైప్ చేయగలగాలి. అలాగే నిమిషానికి  150 పదాలు (4 నిమిషాల వ్యవధి) టైప్ చేయగలగాలి. దీంతోపాటు కంప్యూటర్ మీద 40 నుంచి 45 నిమిషాల పాటు ట్రాన్‌స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 100 మార్కులకు షార్ట్‌హ్యాండ్ పరీక్ష, 20 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. షార్ట్ హ్యాండ్ పరీక్షలో అర్హత సాధించినవారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

జీత భత్యాలు: రూ.57,100 నుంచి రూ.1,47,760.


ముఖ్యమైన తేదీలు..


* నోటిఫికేషన్ వెల్లడి: 28.09.2022.

* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.09.2022.

* దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 22.10.2022.

* పరీక్ష తేది: 19.11.2022.

* ఇంటర్వ్యూలు ప్రారంభం: 25.11.2022.

* పరీక్ష ఫలితాల వెల్లడి: 30.11.2022.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Registrar (Administration), 
High Court of Andhra Pradesh, 
Nelapadu, Amaravati, 
Guntur District, Pin-522239.

Notification

Website


Also Read:

APPSC Recruitment:  ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు, పూర్తి వివరాలు ఇలా!

ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీని ద్వారా పలు ప్రభుత్వ విభాగాల్లో మొత్తం269 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా  పలు విభాగాల్లో 6 గ్రూప్ 4 ఉద్యోగాలు, 45 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అంతే కాకుండా ఆయుష్ ఆయుర్వేద విభాగంలో 3 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఆయుష్ హోమియో విభాగంలో 34 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్లు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఆయుష్ ఆయుర్వేద విభాగంలో 72 మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ హోమియో విభాగంలో 53 మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ యునాని విభాగంలో 26 మెడికల్ ఆఫీసర్లు నియామకం కోసం ప్రకటన జారీ చేసింది. అంతే కాకుండా పలు విభాగాల్లో 23 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇన్సురెన్స్ మెడికల్ సైన్సెస్ విభాగంలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేసింది. ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎపీపీఎస్సీ కోరింది. దరఖాస్తు తేదీలు సహా నోటిఫికేషన్ల పూర్తి వివరాలు వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు ఎపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాలు ఇలా...

 

NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | సంచలన ఛేజింగ్ తో పిచ్చెక్కించిన పంజాబ్ | IPL 2024| ABP DesamBoy Rescued 50 Members in Fire Accident | అగ్నిప్రమాదం నుంచి 50 మందిని కాపాడిన బాలుడు | ABP DesamFire Accident in Alwin Pharmacy Company Rangareddy | రంగారెడ్డిలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం | ABP DesamJamie Lever Interview | Allari Naresh | Aa Okkati Adakku |ఈ వీడియో చూస్తే నవ్వాగదు..

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Anupama Parameswaran: అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
Warangal News: ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
Embed widget