News
News
X

APPSC Recruitment:  ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు, పూర్తి వివరాలు ఇలా!

ప్రభుత్వ విభాగాల్లో మొత్తం269 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా  పలు విభాగాల్లో 6 గ్రూప్ 4 ఉద్యోగాలు, 45 నాన్ గెజిటెడ్, ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

FOLLOW US: 

APPSC Recruitment:  ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీని ద్వారా పలు ప్రభుత్వ విభాగాల్లో మొత్తం269 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా  పలు విభాగాల్లో 6 గ్రూప్ 4 ఉద్యోగాలు, 45 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అంతే కాకుండా ఆయుష్ ఆయుర్వేద విభాగంలో 3 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది.

ఆయుష్ హోమియో విభాగంలో 34 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్లు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఆయుష్ ఆయుర్వేద విభాగంలో 72 మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ హోమియో విభాగంలో 53 మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ యునాని విభాగంలో 26 మెడికల్ ఆఫీసర్లు నియామకం కోసం ప్రకటన జారీ చేసింది.

అంతే కాకుండా పలు విభాగాల్లో 23 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇన్సురెన్స్ మెడికల్ సైన్సెస్ విభాగంలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేసింది. ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎపీపీఎస్సీ కోరింది. దరఖాస్తు తేదీలు సహా నోటిఫికేషన్ల పూర్తి వివరాలు వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు ఎపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు ఇలా...

News Reels

APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
ఏపీలోని ప్రభుత్వ విభాగాల్లో వివిధ గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 29న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

APPSC: ఏపీలో 45 నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!

ఏపీ ప్రభుత్వ విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అక్టోబరు 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

APPSC: ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

ఏపీలోని ఆయుష్ విభాగంలో హోమియోపతి, ఆయుర్వేద లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

APPSC: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. యునానీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

APPSC: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!

ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

APPSC: ఏపీలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అర్హత, ఎంపిక వివరాలు ఇవే!

ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 29 Sep 2022 08:43 PM (IST) Tags: AP Jobs APPSC Jobs APPSC recruitment APPSC Group4 Notification APPPSC Job Notifications

సంబంధిత కథనాలు

AP Police Recruitment: ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

AP Police Recruitment: ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!

AP Police SI Notification: ఏపీలో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!

AP Police SI Notification: ఏపీలో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!

CNP Recruitment: కరెన్సీ నోట్ ప్రెస్‌లో 125 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు

CNP Recruitment: కరెన్సీ నోట్ ప్రెస్‌లో 125 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు

TSPSC: గ్రూప్-2,3,4 నోటిఫికేషన్లు వచ్చేది ఎపుడంటే?

TSPSC: గ్రూప్-2,3,4 నోటిఫికేషన్లు వచ్చేది ఎపుడంటే?

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు