అన్వేషించండి

APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 29న ప్రారంభమైంది.

ఏపీలోని ప్రభుత్వ విభాగాల్లో వివిధ గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 29న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అక్టోబరు 18 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 06

1) జూనియర్ అసిస్టెంట్: 01

విభాగం: ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 

2) జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 01

విభాగం: ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 

3) టైపిస్ట్: 01

విభాగం: ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. టైపింగ్‌లో ప్రభుత్వ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి.  

4) టైపిస్ట్: 01 

విభాగం: సెరీకల్చర్ సర్వీస్. 
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. టైపింగ్‌లో ప్రభుత్వ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి.  

5) స్టెనో/టైపిస్ట్: 01

విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. టైపింగ్‌లో ప్రభుత్వ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి.  

6) జూనియర్ స్టెనోగ్రాఫర్: 01

విభాగం: లేబర్ డిపార్ట్‌మెంట్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. టైపింగ్‌లో ప్రభుత్వ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి.  

APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

వయోపరిమితి:
01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, NCC (ఇన్‌స్ట్రక్టర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

రాతపరీక్ష విధానం:
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1: 150 మార్కులు, పేపర్-2: 350 మార్కులు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో అభ్యర్థి సబ్జెక్టుకు సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1/3 వంతు మేర కోత విధిస్తారు. 

పరీక్షలో అర్హత మార్కులు: జనరల్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. అదేవిధంగా బీసీలకు 35 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు. 

జీతం: నెలకు రూ.25,220 - రూ.80,910.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.09.2022.

ఫీజు చెల్లించడానికి చివరితేది: 18.10.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.11.2022.

Notification

Online Application

Website 

Also Read:

APPSC Non-Gazetted Recruitment: ఏపీలో 45 నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ ప్రభుత్వ విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అక్టోబరు 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

APPSC: ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఏపీలోని ఆయుష్ విభాగంలో హోమియోపతి, ఆయుర్వేద లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

APPSC MO Recruitment: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. యునానీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

APPSC Recruitment: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!

ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

APPSC AEE Recruitment: ఏపీలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అర్హత, ఎంపిక వివరాలు ఇవే!

ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Kannappa: 'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
Viral News:17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
Swati Sachdeva: రణవీర్ అల్లాబదియాకు ఫీమేల్ వెర్షన్ స్వాతి సచ్‌దేవ - తల్లి వైబ్రేటర్ గురించి  కుళ్లు జోకులు
రణవీర్ అల్లాబదియాకు ఫీమేల్ వెర్షన్ స్వాతి సచ్‌దేవ - తల్లి వైబ్రేటర్ గురించి కుళ్లు జోకులు
Malla Reddy: 'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
Embed widget