అన్వేషించండి

David Warner : ఆసిస్ దిగ్గజం డేవిడ్ వార్నర్  అరెస్టు! వెంటబడి పట్టుకున్న సిడ్నీ పోలీసులు!

ఆస్ట్రేలియా మాజీ ఓపెన్ డేవిడ్ వార్నర్‌ సిడ్నీలో అరెస్టు అయ్యారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్‌ విరామంలో కుటుంబాన్ని కలవడానికి వెళ్లారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • డేవిడ్ వార్నర్​ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.
  • రక్తంలో ఆల్కహాల్​ శాతం పరిమితి దాటడంతో పోలీసులు అరెస్టు చేశారు.
  • మే 7న కోర్టులో హాజరుకావాలి, వృత్తిపరమైన బాధ్యతలు కొనసాగించవచ్చు.
  • పీఎస్​ఎల్​ కెరీర్​పై ప్రభావం, పెషావర్​తో మ్యాచ్​కు అందుబాటులో ఉంటారు.

David Warner : సిడ్నీలోని మారూబ్రా ప్రాంతంలో న్యూసౌత్‌ వేల్స్‌ పోలీసులు ఆదివారం సాయంత్రం 5 ఏప్రిల్‌ 2026న తనిఖీలు నిర్వహించారు. 39 ఏళ్ల వార్నర్‌ తన వ్యాన్‌ను నడుపుతూ వెళ్తున్న టైంలో పోలీసులు చెకింగ్ చేస్తున్నారని గ్రహించారు. అందుకే పరీక్షలు జరిగే కొద్ది దూరంలోనే వాహనాన్ని ఆపేశారు. టెస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆయన వద్దకు వెళ్లి పరీక్షలు చేశారు.  

ఈ ప్రాథమిక పరీక్షలో వార్నర్‌ మద్యం సేవించినట్టు తేలింది. అనంతరం ఆయనను మారూబ్రా పోలీసు స్టేషన్‌కు తరలించి రెండోసారి పరీక్షించగా, ఆయన రక్తంలో ఆల్కహాల్‌ శాతం 0.104గా నమోదైంది. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం ఇది అనుమతించదగిన పరిమితి కంటే ఎక్కువ. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి మధ్యస్థ స్థాయి నేర కిందగా కేసు నమోదు చేశారు. 

కోర్టు విచారణ, తదుపరి చర్యలు 

అరెస్టు అనంతరం వార్నర్‌కు కోర్టు అటెండెన్స్‌ నోటీసు జారీ చేసి విడుదల చేశారు. దీని ప్రకారం, ఆయన మే 7, 2026 గురువారం నాడు సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆయన తన వృత్తిపరమైన బాధ్యతలను కొనసాగించవచ్చు. కానీ ఈ చట్టపరమైన సమస్య ఆయన కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

పీఎస్‌ఎల్‌ 2026పై ప్రభావం

వార్నర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా మూడు విజయాలతో కరాచీ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నీలో వార్నర్‌ ఇప్పటి వరకు 93 పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే వ్యక్తిగత పనుల మీద వెళ్లిన కెప్టెన్ ఇలా వివాదంలో చిక్కుకోవడం ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌కు మింగుడుపడని విషయమే. ఏప్రిల్ 9 గురువారం నాడు పెషావర్ జల్మీతో జరగబోయే తదుపరి మ్యాచ్‌కు వార్నర్ అందుబాటులో ఉంటారని సమాచారం. కానీ భవిష్యత్‌లో ఇలాంటి విరామ అభ్యర్థలను బోర్డు తిరస్కరించే అవకాశం ఉంది. 

వివాదాల వార్నర్‌ 

2018లో సౌతాఫ్రికాతో జరిగిన కేప్ టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కుప ప్లాన్ చేసినట్టు తేలడంతో వార్నర్‌పై ఏడాదిపాటు నిషేధం విధించారు. ఈ కుట్రలో వార్నర్‌ కీలక సూత్రధారి అని క్రికెట్ ఆస్ట్రేలియా విచారణలో వెల్లడైంది. 2018 ఘటన తర్వాత వార్న్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధించారు. అయితే ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అక్టోబర్‌ 2024లో ఈ నిషేధాన్ని ఎత్తివేసి, ఆయనకు మళ్లీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం కల్పించారు. 2013లో బర్మింగ్‌హామ్‌లోని ఒక బార్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్‌పై దాడి చేసినందుకు వార్నర్‌ సస్పెన్షన‌కు గురయ్యారు. అలాగే మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగం ఆయన శైలిలో భాగంగా ఉండేది. 

Frequently Asked Questions

డేవిడ్ వార్నర్ ఎప్పుడు, ఎక్కడ అరెస్ట్ అయ్యారు?

డేవిడ్ వార్నర్ 5 ఏప్రిల్ 2026న సిడ్నీలోని మారూబ్రా ప్రాంతంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు.

డేవిడ్ వార్నర్ రక్తంలో ఆల్కహాల్ శాతం ఎంత నమోదైంది?

మారూబ్రా పోలీసు స్టేషన్‌లో రెండోసారి పరీక్షించగా, ఆయన రక్తంలో ఆల్కహాల్‌ శాతం 0.104గా నమోదైంది.

డేవిడ్ వార్నర్ కోర్టులో ఎప్పుడు హాజరు కావాలి?

ఆయన మే 7, 2026 గురువారం నాడు సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది.

ఈ సంఘటన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) పై ప్రభావం చూపుతుందా?

వార్నర్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారు, కానీ భవిష్యత్‌లో ఇలాంటి విరామ అభ్యర్థలను బోర్డు తిరస్కరించే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget