అన్వేషించండి

Kadapa Tipu Sultan controversy: కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నాలు - తీవ్రంగా వ్యతిరేకిచిన బీజేపీ

Tipu Sultan controversy: కడప నగరంలో టిప్పు సుల్తాన్ పేరుతో సర్కిల్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెచ్చారు. దఇది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.

Kadapa Tipu Sultan Circle controversy:   రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప నగరంలో టిప్పు సుల్తాన్ పేరుతో ఒక సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని జరుగుతున్న ప్రయత్నాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడిన టిప్పు సుల్తాన్ పేరును ప్రజా ప్రదేశాలకు పెట్టడం సరికాదని పలు హిందూ సంఘాలు , భారతీయ జనతా పార్టీ   గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి చర్యలు మతపరమైన విభేదాలను సృష్టించే కుట్రలో భాగమని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. 
 
టిప్పు సుల్తాన్ తన పాలనలో హిందూ సమాజంపై దాడులు చేశారని, దేవాలయాలను ధ్వంసం చేయడమే కాకుండా వేలాది మందిని బలవంతంగా మతమార్పిడి చేశారని బిజెపి నాయకులు గుర్తు చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని గొప్పగా చిత్రీకరించడం భావ్యం కాదని, ఇది స్థానిక ప్రజల సెంటిమెంట్లను గాయపరచడమేనని వారు వాదిస్తున్నారు. గతంలో ఇదే జిల్లాలోని ప్రొద్దుటూరులో కూడా ఇటువంటి ప్రయత్నం జరిగినప్పుడు, హిందూ సమాజం తిరుగుబాటుతో అది ఆగిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.   

ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి సున్నితమైన అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే సమాజంలో చీలిక తెచ్చేందుకు కొందరు ఇటువంటి ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి శాంతిభద్రతలను కాపాడాలని బాధితులు , సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.  

ఈ వివాదంతో, కడప మున్సిపల్ కమిషనర్ ,  జిల్లా కలెక్టర్  ఈ ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని బిజెపి డిమాండ్ చేస్తోందది.  స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరుతోంది. 

అసలు కడపలో టిప్పు సుల్తాన్  పేరు ఎందుకంటే ?

టిప్పు సుల్తాన్ మద్దతుదారులు ఆయనను బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకగా పోరాడిన మొట్టమొదటి పాలకుల్లో ఒకరిగా చూస్తారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన  మైసూరు పులి గా, దేశభక్తుడిగా ఆయనను గౌరవిస్తూ, ఆ జ్ఞాపకార్థం సర్కిల్‌కు ఆయన పేరు పెట్టాలని కోరుతుంటారు. కడప , ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. తమ సామాజిక వర్గానికి చెందిన ఒక చారిత్రక వీరుడి పేరును ఒక సర్కిల్‌కు పెట్టాలనేది ఆయా ప్రాంతాల్లోని ముస్లిం పెద్దలు మరియు నాయకుల దశాబ్దాల కాలం నాటి కోరిక. దీనిని మత సామరస్యానికి మరియు తమ గుర్తింపుకు చిహ్నంగా వారు భావిస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం టిప్పు సుల్తాన్ కుటుంబానికి కడపతో సంబంధం ఉంది. టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ తల్లి  ఫాతిమా ఫక్రున్నీసా, అప్పటి కడప కోట గవర్నర్ అయిన మీర్ ముయినుద్దీన్ కుమార్తె. ఈ చారిత్రక అనుబంధాన్ని కూడా కొందరు కారణంగా చూపుతుంటారు. 

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget