Zaheerabad Crime: పోలీసుల ముందే ఘోరం - ప్రియుడితో వెళ్లిన భార్య గొంతు కోసిన భర్త!
Husband slits wife throat: జహీరాబాద్‌లో భార్య ప్రియుడితో పారిపోయింది. ఆ తరవాత పెద్దలు, పోలీసుల సమక్షంలో జరిగిన పంచాయతీలో భర్త ఆ భార్య గొంతు కోసేశాడు.

Zaheerabad Husband slits wife throat : నమ్మిన ఇల్లాలు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, కళ్ళముందే వేరే వ్యక్తితో వెళ్తానంటే ఏ భర్త అయినా తట్టుకోలేడు. కానీ చేజేతులా ప్రాణం తీయలేడు. కానీ జహీరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆ కోపాన్ని కసితో పెంచుకుని, సాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే భార్యపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు. జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
వివాహేతర సంబంధమే కారణం
జహీరాబాద్‌కు చెందిన దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యకు వేరొక వ్యక్తితో సంబంధం ఉండటమే ఈ కలహాలకు ప్రధాన కారణం. ఈ క్రమంలోనే ఆమె తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, గాలించి వారిద్దరినీ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. దంపతులకు నచ్చజెప్పి కాపురాన్ని చక్కదిద్దాలని పోలీసులు ప్రయత్నించారు.
Zaheerabad, Sangareddy, #Telangana
— Siraj Noorani (@sirajnoorani) April 6, 2026
Husband Siddha Reddy allegedly stabbed wife Kavitha (29) to death inside a police vehicle while she was being escorted back home after being traced with her lover Pawan Reddy in Jadcherla. pic.twitter.com/GaeYi1dVCB
పోలీసుల ముందే దాడి
పోలీస్ స్టేషన్ బయట ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతుండగా, ఆమె భర్తతో వెళ్లేందుకు నిరాకరించి ప్రియుడితోనే ఉంటానని భీష్మించుక కూర్చుంది. ఇది భర్తను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. క్షణికావేశంలో తన వద్ద దాచుకున్న పదునైన ఆయుధాన్ని తీసి, పోలీసుల కళ్ళముందే అందరూ చూస్తుండగానే భార్య గొంతు కోశాడు. రక్తం మడుగులో పడిపోయిన ఆమెను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Wife Killed by Husband for Leaving with Lover
— زماں (@Delhiite_) April 6, 2026
📍 Zaheerabad, Sangareddy, Telangana
Husband Siddha Reddy allegedly stabbed wife Kavitha (29) to death inside a police vehicle while she was being escorted back home after being traced with her lover Pawan Reddy in Jadcherla. pic.twitter.com/AELmSw9Uh2
పరిస్థితి విషమం
తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. నిందితుడిని పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఈ స్థాయిలో దాడి జరగడం పోలీసుల భద్రతా వైఫల్యంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















