Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 20 ఏళ్ల యువ క్రికెటర్ ప్రశాంత్ వీర్ అరంగేట్రం చేశాడు. మాథ్యూ షార్ట్ స్థానంలో అతడికి ఛాన్స్ లభించింది. అయితే ప్రశాంత్ గేమ్ చూసిన వాలంతా అంతని కోసం వెతకడం మొదలు పెట్టారు. ప్రశాంత్ ప్రదర్శన చూస్తుంటే జడేజా స్థానాన్ని భర్తీ చేసే లాగా ఉన్నాడు అంటూ క్రికెట్ నిపుణులు కూడా చెప్పుకొస్తున్నారు.
గత ఏడాది జరిగిన ఐపీెల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ. 14.2 కోట్లకు ప్రశాంత్ వీర్‌ను తీసుకుంది. ఈ సీజన్లో సీఎస్కే 3 మ్యాచులాడగా రెండింట్లో ప్రశాంత్ వీర్ ప్లేయింగ్ లెవన్ లో ఉన్నాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచులో 6 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచులో 29 బంతుల్లో 43 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు.
అయితే ఈ లెఫ్మార్మ్ స్పిన్నర్ కు బౌలింగ్ చేసే అవకాశం ఇంకా రాలేదు. జడేజా ప్రత్యామ్నాయంగా సీఎస్కే మేనేజ్‌మెంట్ ప్రశాంత్ వీర్‌ను భావిస్తోంది. వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ జడేజాను అతడు రీప్లేస్ చేయగలడా అని సీఎస్కే ఫ్యాన్స్ సైతం ఐపీఎల్ వేలంలో అన్ క్యాప్డ్ ప్లేయర్ ధర చూసి ఆశ్చర్యపోతున్నారు. డొమెస్టిక్ క్రికెట్‌లో యూపీ తరపున ఆడిన ఈ 20 ఏళ్ల యువ క్రికెటర్ 7 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీయడమే కాకుండా 170 స్ట్రైక్ రేట్‌తో 112 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు లెఫ్టార్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తుండటంతో ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ కొత్త రవీంద్ర జడేజా అని పిలుస్తోంది.























