అన్వేషించండి

Prerana Kambam: 'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే

Prerana Kambam Biography: 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్‌తో తెలుగులో పాపులర్ అయిన నటి ప్రేరణ కంబం. ఇప్పుడు 'బిగ్ బాస్ 8'లో అడుగు పెట్టారు. ఆవిడ బ్యాగ్రౌండ్ తెలుసా?

ప్రేరణ కంబం (Actress Prerana Kambam)... తెలుగు బుల్లితెర వీక్షకులకు బాగా తెలిసిన నటి. 'స్టార్ మా' సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'తో పాపులర్ అయ్యారు. అందులో ఆమె కృష్ణ రోల్ చేశారు. నాలుగేళ్లు ఆ సీరియల్ నడిచింది. ఇప్పుడు ఆ భామ 'బిగ్ బాస్ 8'లో అడుగు పెట్టారు. ఇంతకీ, ఆవిడ బ్యాగ్రౌండ్ ఏమిటి? టీవీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఏమిటి? అనేది తెలుసా?

పుట్టింది హైదరాబాద్ సిటీలోనే! కానీ...
ప్రేరణ కంబం జన్మించినది మన హైదరాబాద్ సీటులోనే! అయితే... ఆమె తెలుగు అమ్మాయి కాదు. తమిళ కుటుంబంలో జన్మించిన హైదరాబాదీ. ప్రేరణ తండ్రి పేరు పురుషోత్తమ్‌. ఆయన సాఫ్ట్‌వేర్ కంపెనీ (టీసీఎస్)లో ఉద్యోగి. ఉద్యోగ రీత్యా ఆయన అమెరికా వెళ్లడంతో తండ్రితో పాటు ప్రేరణ సైతం యుఎస్ఏ షిఫ్టయ్యారు. ఆమె తల్లి రూప ఒక కాలేజీ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగి. అమెరికా నుంచి  ఫ్యామిలీ ఇండియా వచ్చిన తర్వాత బెంగళూరులో సెటిల్ అయ్యారు. అక్కడ 'దయానంద సాగర్‌ కాలేజీ'లో బీటెక్‌ చేశారు. ఇండస్ర్టియల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (2018)లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు.

యాక్టర్ కావాలనుకోలేదు... ప్రేరణ అథ్లెట్!
ప్రేరణ ఎప్పుడూ యాక్టర్ కావాలని అనుకోలేదు. ఆమె చిన్నతనం నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొనేది. చదువులోనూ మేటి. జిల్లా, రాష్ట్ర స్థాయి లాంగ్‌ జంప్‌, హై జంప్‌, 400 మీటర్లు, 800 మీటర్లు పరుగు ఆవిడ పోటీల్లో పాల్గొన్నారు. చాలా సార్లు మగ పిల్లలతో కలిసి ఫుట్‌బాల్‌ కూడా ఆడానని ఓ ఇంటర్వ్యూలో ప్రేరణ పేర్కొన్నారు. అయితే... కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేశారు. ఆమె మోడలింగ్ కెరీర్ చూసి సినిమాల్లో ట్రై చేయమని ఎవరో ఇచ్చిన సలహాతో గ్లామర్ ప్రపంచంలో అడుగు పెట్టారు. తొలుత కన్నడ సీరియల్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అక్కడి నుంచి మళ్ళీ సీరియల్స్ చేయడం స్టార్ట్ చేశారు. 

'బిగ్ బాస్'లో పార్టిసిపేట్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌!
తెలుగు బుల్లితెరకు 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్‌తో పరిచయం కావడానికి ముందు కన్నడలో పలు సీరియళ్లు చేశారు ప్రేరణ. అలాగే, ఓ ఎనిమిది సినిమాల్లో కథానాయికగా నటించారు. మంచి కథ, క్యారెక్టర్లు రావడంతో మళ్లీ సీరియల్స్ స్టార్ట్ చేశానని ఆవిడ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే... ప్రేరణకు ఆల్రెడీ 'బిగ్ బాస్'లో పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది.

Also Read: ఆర్జీవీ 'దిశా ఎన్కౌంటర్' హీరోయిన్, కరీంనగర్ రైతు బిడ్డ... 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్ సోనియా ఆకుల బ్యాగ్రౌండ్ తెలుసా?

శాండిల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేసిన, కన్నడ కలర్స్ ఛానల్‌లో టెలికాస్ట్ అయిన కన్నడ 'బిగ్‌ బాస్‌' మినీ సీజన్‌లో ప్రేరణ కంబం పాల్గొన్నారు. ఇటీవల స్టార్ మా ఛానల్‌లో ప్రసారమైన 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గాళ్స్' షోలోనూ ఆవిడ సందడి చేశారు. 

View this post on Instagram
 
A post shared by Vikas Alagarsamy (@ooak.photography)

గతేడాది పెళ్లి చేసుకున్న ప్రేరణ... భర్త ఎవరో తెలుసా?
గత ఏడాది నవంబర్ నెలలో ప్రేరణ కంబం పెళ్లి చేసుకున్నారు. శ్రీపాద దేశ్‌పాండేతో ఆవిడ ఏడు అడుగులు నడిచారు. 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గాళ్స్' షోలో భర్తకు ఆవిడ రాసిన లవ్ లెటర్ కూడా వైరల్ అయ్యింది.

Also Readమూడు బెడ్ రూమ్స్, 'యానిమల్' థీమ్... 'బిగ్ బాస్' ఇంట్లో విశేషాలు తెల్సా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget